కుప్పం కోటలో చెవిరెడ్డి వ్యూహం.. చక్రం తిప్పుతున్న ఎంపీ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి 175 నియోజకవర్గాల్లోనూ మీకు ఇష్టమైన నియోజకవర్గం ఏదని అంటే .. తడుముకోకుండా చెప్పేది కుప్పం నియోజకవర్గం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో [more]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి 175 నియోజకవర్గాల్లోనూ మీకు ఇష్టమైన నియోజకవర్గం ఏదని అంటే .. తడుముకోకుండా చెప్పేది కుప్పం నియోజకవర్గం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో [more]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి 175 నియోజకవర్గాల్లోనూ మీకు ఇష్టమైన నియోజకవర్గం ఏదని అంటే .. తడుముకోకుండా చెప్పేది కుప్పం నియోజకవర్గం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల కన్నా కూడా కుప్పంపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. దీనికి ప్రధాన కారణం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ నియోజకవర్గం కంచుకోట కావడమే. రాష్ట్రంలో టీడీపీని ఓడించి నా కూడా జగన్‌కు పెద్దగా సంతృప్తిగా లేదు. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడిం చాలనేది జగన్ వ్యూహం.. లక్ష్యం కూడా.
గత ఎన్నికల్లోనే….
ఈ నేపథ్యంలోనే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయితే, అప్పటికి ప్రతిపక్షంలో ఉండడంతో వైసీపి అంచనాలు ఫలించలేదు. అయితే, చంద్రబాబుకు ప్రతి సారీ వస్తున్న మెజారిటీని మాత్రం భారీ ఎత్తున తగ్గించగలిగారు. చంద్రబాబు తొలి మూడు రౌండ్లలో వెనకపడిపోయారు కూడా. చంద్రబాబు చావు తప్పికన్ను లొట్టబోయిన చందంగా గెలవడంతో వైసీపీకి ఎంత మాత్రం సంతృప్తి లేదు. ఎట్టి పరిస్థితిలోనూ చంద్రబాబును తన సొంత నియోజకవర్గంలో అవమానపరచాలనే ధోరణితోనే ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం వైసీపీ అధికారంలోనే ఉండడంతో ఇక్కడ వైసీపీని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లాలని భావించిన జగన్ ఇక్కడి బాధ్యతలను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు.
టీడీపీ క్యాడర్ ను…
కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైసీపీ జెండా ఎగరేసేలా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇక్కడ పార్టీని గెలుపు గుర్రంఎక్కించే బాధ్యతను సీఎం జగన్ ఏకంగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు అప్పగించారు. ఆయన చెవిరెడ్డిని వెంట బెట్టుకుని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ ఇద్దరు ఇక్కడ పాత టీడీపీ కేడర్‌ను వైసీపీలోకి లాగేస్తున్నారు. ఇక ఈతరం యువకులు అందరూ వైసీపీ వైపు ఆకర్షితులు అయ్యేలా చేస్తున్నారు. దీనికి తోడు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. చంద్రబాబు ముప్పై సంవతవ్సరాలుగా గెలిపిస్తున్నారు.. కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా ఓడించండని కోరుతున్నారు.
కరోనా సమయంలోనూ….
ఇక చాలా మంది టీడీపీ మాజీ నేతలు కూడా అనేకానేక ఆఫర్లతో ఫ్యాన్ కిందకు చేరుతున్నారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఎదురీత ధోరణిలో ముందుకు సాగుతోందని అంటున్నారు. నేతలకు పోటీ చేసేందుకు కేసుల భయం వెంటాడుతోంది. దీంతో ఎవరూ కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఎట్టి పరిస్థితిలోనూ కుప్పంలో వైసీపీ హవా పెరిగే విధంగా నాయకులు వ్యూహాత్మకంగా చక్రం తిప్పుతున్నారు. ఇటీవల కరోనా నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుప్పంలోనూ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడం, చంద్రబాబు ఇక్కడివారిని పట్టించుకోవడం లేదని ప్రచారం చేయడం వంటి ఆసక్తిగా మారాయి. మరి వైసీపీ వ్యూహం ఏమవుతుందో చూడాలి.