వైసీపీలోనూ మొదలయినట్లుందే
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్టుగా దాదాపు 9 ఏళ్లకు పైగా సాగిన నిరీక్షణ ఫలించిన వేళ.. ఏపీలో రెండో ప్రభుత్వంగా వైసీపీ కొలువుదీరిన వేళ.. పార్టీలో పరిస్థితి [more]
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్టుగా దాదాపు 9 ఏళ్లకు పైగా సాగిన నిరీక్షణ ఫలించిన వేళ.. ఏపీలో రెండో ప్రభుత్వంగా వైసీపీ కొలువుదీరిన వేళ.. పార్టీలో పరిస్థితి [more]
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్టుగా దాదాపు 9 ఏళ్లకు పైగా సాగిన నిరీక్షణ ఫలించిన వేళ.. ఏపీలో రెండో ప్రభుత్వంగా వైసీపీ కొలువుదీరిన వేళ.. పార్టీలో పరిస్థితి ఎలా ఉండాలి? నాయకుల ఉత్సాహం ఏవిధంగా ఉండాలి? ముఖ్యంగా జగన్ననను సీఎం చేయడం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అంటూ .. ప్రకటించడమే కాకుండా ఆయా త్యాగాలు చేసి చూపిన వారు కూడా ఉన్నారు. అయితే, అదే సమయంలో జగన్ కూడా వారికి అనేక హామీలు ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు ఇస్తానని చెప్పారు. అయితే, పరిస్థితి తిరగబడింది. జగన్ అధికారంలోకి వచ్చి 75 రోజులు గడిచినా.. కూడా కీలకమైన నాయకులకు పదవులు దక్కడం లేదు.
త్యాగంచేసిన వారికి…..
ముఖ్యంగా సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్, గొట్టిపాటి భరత్, అసలు టికెట్ కోసం వచ్చి దానినే త్యాగం చేసిన విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వంటి వారికి జగన్ పదవులు ఇవ్వలేదు. వీరికి ఓపెన్‌గానే ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. మర్రి రాజశేఖర్‌ను అయితే ఏకంగా ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. కానీ, అదే సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా వంటివారికి డబుల్ పదవులు ఇచ్చారు. ఇక, ఎన్నికల్లో ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటివారికి కూడా మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు.
గుర్తింపు లేదా…?
కానీ, పార్టీనే నమ్ముకుని, జగన్ ఆదేశాలను జవదాటకుండా.. పార్టీ కోసం జగన్ సీఎం అయ్యేందుకు కృషి చేసినవారికిమాత్రం గుర్తింపు లేకుండా పోయింది. దీనికితోడు తాజాగా ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వచ్చిన చల్లారామకృష్ణారెడ్డి, హిందూపురంలో ఓట మి పాలైన ఇక్బాల్‌లకు కూడా జగన్ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఇదే అంశం చర్చకు దారితీ స్తోంది. జగన్ కోసం త్యాగం చేసిన నాయకులకు గుర్తింపు లభించకపోవడంపై అంతర్గతంగా చర్చ జరుగు తుండడం గమనార్హం.
క్లారిటీ ఇస్తేనే…..
అయితే, నాయకుల్లో మాత్రం అసంతృప్తి ఛాయలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే, జగన్‌ను ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. దీంతో నాయకులే తర్జన భర్జన పడుతున్నారు. ఇక కొన్ని జిల్లాల్లో సీనియర్లు అయిన ఎమ్మెల్యేలు జూనియర్లు అయిన మంత్రులను లెక్క చేయని పరిస్థితులు నెలకొనడంతో జూనియర్ మంత్రులు సైతం అసంతృప్తితోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. మరి జగన్ వ్యూహం ఏంటనే విషయంపైనా చర్చ జరుగుతుండడం గమనార్హం. ఏదేమైనా.. జగన్ ఈ విషయంలో క్లారిటీ ఇస్తే.. శ్రేణులు ఉత్సాహంగా పనిచేసేందుకు ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు.