వైసీపీలో బావమరిది సూపర్ హిట్…. బావ డిజాస్టర్
వారిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు.. తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని కంచుకోటగా మార్చేసుకున్నారు. అంతకుమించి వీరిద్దరు స్వయానా బావబావమరుదులు. వీరిలో బావమరిది రాజకీయాల్లో సీనియర్.. రెండుసార్లు ఎమ్మెల్యే… బావ [more]
వారిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు.. తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని కంచుకోటగా మార్చేసుకున్నారు. అంతకుమించి వీరిద్దరు స్వయానా బావబావమరుదులు. వీరిలో బావమరిది రాజకీయాల్లో సీనియర్.. రెండుసార్లు ఎమ్మెల్యే… బావ [more]
వారిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు.. తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని కంచుకోటగా మార్చేసుకున్నారు. అంతకుమించి వీరిద్దరు స్వయానా బావబావమరుదులు. వీరిలో బావమరిది రాజకీయాల్లో సీనియర్.. రెండుసార్లు ఎమ్మెల్యే… బావ జూనియర్.. ఒక్కసారి ఎమ్మెల్యే. వీరిద్దరి రాజకీయంలో అనుభవం ఉండి తలపండిన బావమరిది సీఎం జగన్ చేతే గ్రేట్ అనిపించుకుని దూసుకుపోతుంటే.. బావ మాత్రం రాజకీయాల్లో ఇంకా ఓనమాలు కూడా నేర్చుకోలేక జగన్ అయితే ఏంటి ? అన్న దురుసుతనంతో వ్యవహరిస్తున్నారన్న టాక్ ? తెచ్చుకుంటున్నారు. సీమ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వారిద్దరు ఎవరో కాదు అనంతపురం జల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.
కేతిరెడ్డి రెండోసారి…..
అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే దివంగత కేతిరెడ్డి సూరీడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వెంకట్రామిరెడ్డి రాజకీయాల్లోకి రాకముందు రిలయన్స్ సంస్థలో ఉద్యోగ చేసేవారు. వీరికి జేసీ కుటుంబంతో తీరని వైరం ఉండేది. తర్వాత వైఎస్ జేసీ ఫ్యామిలీకి తాడిపత్రి, కేతిరెడ్డి ఫ్యామిలీకి ధర్మవరం సెట్ చేసి.. ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోకూడదని పంచాయతీ చేశారు. 2009 ఎన్నికల్లో తొలిసారి వైఎస్ దయతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి, 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడారు. ఇక గత ఎన్నికల్లో అదే వైసీపీ నుంచి గెలిచి రెండోసారి అసెంబ్లీ మెట్లెక్కారు.
సంచలన విజయం నమోదు చేసి….
ఇక కేతిరెడ్డి సోదరిని వివాహం చేసుకున్న సుధీర్‌రెడ్డి జమ్మలమడుగులో పేరుమోసిన డాక్టర్. గత ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గాన్ని శాసించే రాజకీయ ఉద్దండులు మాజీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఇద్దరూ టీడీపీలో ఉండడంతో జగన్ సుధీర్‌రెడ్డికి సీటు ఇచ్చారు. 53 వేల ఓట్లతో సుధీర్‌రెడ్డి సంచలన విజయం నమోదు చేశారు. అసెంబ్లీలో బావబావమరుదులుగా ఉన్న వీరిద్దరూ రాజకీయంలో ఎవరికి ఎన్ని మార్కులు పడుతున్నాయి ? ఎవరు పైచేయిలో ఉన్నారన్నది పరిశీలిస్తే కేతిరెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్న రేంజ్లో దూసుకుపోతున్నారు. అస్సలు ఎవ్వరూ వేలుత్తి చూపించే ఛాన్స్ లేనంత ప్లానింగ్‌తో ఆయన సీఎం జగన్ దగ్గర పదే పదే మంచి మార్కులు వేయించుకుంటున్నారు.
కేతిరెడ్డి సోషల్ మీడియాలో….
అదే సమయంలో సుధీర్‌రెడ్డి మాత్రం రాజకీయ అనుభవ లేమితో జమ్మలమడుగులో తనకు వచ్చిన ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంటున్నారు. అసలు తెలుగు సోషల్ మీడియాలో ఏ ఛానెల్ వీడియో ఓపెన్ చేద్దామన్నా కేతిరెడ్డి వీడియోలే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లలో, వాట్సాప్ గ్రూపులు… ట్విట్టర్లలో ఎక్కడ చూసినా కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం వీడియోలే దర్శనమిస్తున్నాయి. ప్రజల్లోకి పక్కా ప్లానింగ్‌తో వెళుతోన్న తీరుతో పాటు నియోజకవర్గం లో ఎవరికి ఏ సమస్య ఉన్నా స్వయంగా నోట్ చేసుకోవడం దగ్గర నుంచి.. అధికారులను ఫాలో అప్ చేయించడం.. చివరకు ఆ పని అయ్యేవరకు ఆయన గుర్తు పెట్టుకుని మరీ పూర్తి చేయిస్తున్నారు.
పక్కా ప్లానింగ్ తో….
పార్టీలతో సంబంధం లేకుండా కేతిరెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ప్రతి శాఖలోనూ ఆయనకు పట్టు ఉండడం, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అధికారులతో తేడా వస్తే చెడుగుడు ఆడుకోవడం ఏలాంటి గ్రూపులు లేకుండా పేద ప్రజల పక్షాన నిలబడడంతో పాటు ఇటు సొంత పార్టీ కేడర్‌తో సంబంధం లేకుండా ప్రజల్లో ఆయనకు మంచి ఇమేజ్ వచ్చింది. కేతిరెడ్డి ధర్మవరంలో అనుసరిస్తోన్న ప్లానింగ్‌ను తెలుసుకున్న సీఎం జగన్ సైతం అందరూ ఎమ్మెల్యేలు అదే బాటలో వెళ్లాలని తమ పార్టీ నేతలకు సూచనలు జారీ చేశారు. సోషల్ మీడియాలో కేతిరెడ్డి వీడియోలే వైరల్ అవుతున్నాయి.
సుధీర్ రెడ్డి మాత్రం….?
ఇటు జమ్మలమడుగులో సుధీర్‌రెడ్డి రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగతంగాను తక్కువ సమయంలో విమర్శల పాలవుతున్నారు. రాజకీయంగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పార్టీలోకి రావడంతో ఆయనతో ఎత్తులు వేయలేని పరిస్థితి. ఇటు నియోజకవర్గంలో బలంగా ఉన్న సీఎం జగన్ బంధువులతోనూ పొసగడం లేదని అంటున్నారు. అదే సమయంలో కాంట్రాక్టులు, ఇతర వ్యవహారాల్లో తన కోటిరీకే ప్రయార్టీ ఇస్తున్నారన్న ఆరోపణలు ఇవన్నీ ఆయనకు మైనస్‌గా మారాయి. ఏదేమైనా వైసీపీలోనే కేతిరెడ్డి హిట్, సుధీర్‌రెడ్డి ఫట్ అన్న టాక్ వస్తోందంటే సుధీర్‌రెడ్డిపై కేతిరెడ్డిదే పై చేయి అనాల్సిందే ?