యూవీ ఒక రోల్ మోడల్ …!!
ఆడింది ఎంతకాలం అని కాదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశానికి నేనేమి చేశానని చెప్పుకోదగ్గ అతికొద్ది మంది క్రీడాకారుల్లో పంజాబీ స్టైలిష్ స్టార్ యువరాజ్ సింగ్. కెరియర్ [more]
ఆడింది ఎంతకాలం అని కాదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశానికి నేనేమి చేశానని చెప్పుకోదగ్గ అతికొద్ది మంది క్రీడాకారుల్లో పంజాబీ స్టైలిష్ స్టార్ యువరాజ్ సింగ్. కెరియర్ [more]
ఆడింది ఎంతకాలం అని కాదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశానికి నేనేమి చేశానని చెప్పుకోదగ్గ అతికొద్ది మంది క్రీడాకారుల్లో పంజాబీ స్టైలిష్ స్టార్ యువరాజ్ సింగ్. కెరియర్ లో దూసుకుపోతున్న తరుణంలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడినా చావును ఎదిరించి తిరిగి జట్టులో స్థానం సంపాదించి నేటి యువతకు యువి స్ఫూర్తిగా నిలిచాడనడంలో అతిశయోక్తి లేదు. పాజిటివ్ దృక్పథం తో సాధించలేనిది ఏమి లేదని చాటి చెప్పిన యువి క్రికెట్ కి గుడ్ బై చెప్పినా అభిమానుల గుండెల్లో మాత్రం శాశ్వతంగా స్థానం సంపాదించేశాడు. యువరాజ్ సింగ్ భారత క్రికెట్ లో ఒక రోల్ మోడల్ అనే చెప్పాలి. అలాంటి యువి క్రికెట్లో అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లకు బై కొట్టేశాడు. గత రెండేళ్లుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడని యువరాజ్ కు ఫిట్ నెస్ సమస్యలు, కొత్త తరం నుంచి వస్తున్న తీవ్ర పోటీ నేపథ్యంలో తన కెరియర్ ముగిసిందని అంచనాకు వచ్చేశాడు. దాంతో టీం ఇండియా లో ఒక ఊపు తెచ్చిన స్టార్ తన ఆటకు భారంగా గుడ్ బై చెప్పక తప్పలేదు.
యూత్ లో యమా క్రేజ్ …
ఇండియా తరపున ధోని సాధించిన అన్ని ఫార్మాట్ ప్రపంచ కప్ లను గెలిచిన టీం లలో యువరాజ్ ఆల్ రౌండర్ గా ప్రదర్శించిన ఆట తీరు విమర్శల చేత కూడా ప్రశంసల జల్లు కురిసేలా చేసింది. భారత తరపున ఆరు బాల్స్ కి ఆరు సిక్సర్లు బాదిన వారిలో రవిశాస్త్రి తరువాత యువి రెండో బ్యాట్స్ మెన్. మిడిల్ ఆర్డర్ కి దశాబ్దానికి పైగా సేవ అందించిన యువరాజ్ టీం కి నమ్మదగ్గ వెన్నెముకగా నిలిచాడు. యువి టీం ఇండియా కు సెలెక్ట్ కాక చాలా రోజులే అయినా ఇప్పటికి ఆ స్థానం భర్తీ కావడం లేదంటే అతడు ఎంత స్పెషల్ ఆటగాడో చెప్పనక్కర్లేదు. తుఫాన్ లా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే యువి బ్యాటింగ్ చూసేందుకు అంతా ఎగబడేవారు. బ్యాటింగ్ కి వచ్చేముందు లక్ష్యం ఎంత పెద్దది వున్నా యువి విరుచుకుపడితే విధ్వంసం సృష్టిస్తే ఓటమి అంచున వున్న టీం ఎన్నో విజయాలను అలవోకగా అందుకునేది.
యువి గ్రేట్ ….
క్రికెట్ కి గుడ్ బై కొట్టానని యువరాజ్ ప్రకటించగానే టీం ఇండియా లో సహచరులంతా అతడి భావి జీవితం బాగుండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. నీ ఆటతీరు అనితర సాధ్యం అంటూ కీర్తించారు. ముఖ్యంగా యువి బ్యాటింగ్ అంటే బాగా ఇష్టపడే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ ట్వీట్ అదరగొట్టాడు. చాలామంది వస్తూ వుంటారు పోతూవుంటారు. కానీ యువరాజ్ లాంటి ఆటగాడు అరుదంటూ ఆకాశానికి ఎత్తేస్తూ యువి తో దిగిన సెల్ఫీ పోస్ట్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సైతం యువి ని కొనియాడాడు. అతడి ఆట అమోఘమన్నాడు. టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ సైతం తనదైన శైలిలో స్పందించాడు. మధుర జ్ఞాపకాలను మిగిల్చి వెళిపోతున్నావంటూ వీడ్కోలు చెప్పాడు. క్రికెట్ లో ఒక శకం ముగిసిందంటూ సురేష్ రైనా ట్వీట్ చేశాడు.
ఇక ఆ ఆట చూడలేమా …
సునామీలా విరుచుకుపడుతూ తన ఎడమచేతి వాటం బ్యాటింగ్ తో చూడముచ్చటైన ఆట తీరు. ఎడమ చేతి తో బంతిని గాల్లో తిప్పుతూ యువి చేసే బౌలింగ్ ఇక వుండబోవన్న వార్త యువరాజ్ అభిమానులను తీవ్రంగా ఆవేదనకు గురిచేసింది. టెస్ట్ క్రికెట్ లో సైతం వన్డే, టి ట్వంటీ మెరుపులు మెరుపులతో అన్ని ఫార్మాట్లకు వన్నె తెచ్చిన తమ అభిమాన ప్లేయర్ ఇక ఆటకు సెలవు చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అండర్ 19 ప్రపంచ కప్ ను అందించిన జట్టు నుంచి భారత్ ప్రపంచ కప్ అందుకునే వరకు వుండి చరిత్ర సృష్ట్టించిన యువి చిరస్మరణీయమైన అట తీరుతో భావి క్రీడాకారులకు ఆదర్శం అంటూ బరువు ఎక్కిన గుండెతో ఆల్ ద బెస్ట్ చెబుతుంది క్రీడాలోకం.