Mon Dec 23 2024 09:34:28 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఏపీ సీఈవో కులాల వారీగా ఓటర్ల జాబితా విడుదల చేయలేదు, సోషల్ మీడియా పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి
మే 13, 2024న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు రెడ్డి, కమ్మ, కాపు.. ఇతర సామాజిక వర్గాల అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల్లో ఎక్కువగా వెనుకబడిన కులాల వారికి సీట్లను కేటాయిస్తామని చెప్పిన ప్రధాన పార్టీలు కమ్మ,
Claim :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కులాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేసిందిFact :
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అటువంటి జాబితాను విడుదల చేయలేదు.
మే 13, 2024న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు రెడ్డి, కమ్మ, కాపు.. ఇతర సామాజిక వర్గాల అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల్లో ఎక్కువగా వెనుకబడిన కులాల వారికి సీట్లను కేటాయిస్తామని చెప్పిన ప్రధాన పార్టీలు కమ్మ, రెడ్డి వర్గాలకు ఎక్కువ సీట్లను కేటాయించారనే విమర్శలను కూడా ఎదుర్కొన్నాయి.
మే 13, 2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. అయినప్పటికీ, సోషల్ మీడియా ఖాతాల్లో ఇప్పటికీ తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన అలాంటి ఓ పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కులం ఆధారంగా ఓటరు జాబితాను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లో వారి కులం ఆధారంగా పోలైన ఓట్ల సంఖ్య ఉంది. కాపు, బలిజ 67 లక్షలకు పైగా ఓట్లు, ఎస్సీ మాల - 35 లక్షల ఓట్లు, రెడ్డి దాదాపు 27 లక్షల ఓట్లతో జాబితా మొదలవుతుంది, మిగిలిన అన్ని కులాల సంఖ్యతో జాబితా ఉంది.
ఒక X వినియోగదారు ఈ జాబితాను ‘కులం ఆధారంగా ఓటర్లను చూసినా, ఈ ఎన్నికల్లో YSRCPకి మంచి విజయం దక్కుతుంది’ అనే శీర్షికతో పోస్టును షేర్ చేసారు.
ఇతరులు కూడా ఇదే వాదనతో పోస్టును షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి అటువంటి జాబితాను విడుదల చేయలేదు.
మేము ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్సైట్తో పాటు సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేసినప్పుడు, వారు ఈ డేటాను ప్రచురించినట్లుగా లేదా విడుదల చేసినట్లుగా ఎలాంటి నివేదిక కానీ, పోస్ట్ కానీ ఏదీ మాకు కనిపించలేదు.
తదుపరి పరిశోధనలో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టినట్లుగా కొన్ని కథనాలను మేము కనుగొన్నాము. ఈ పోస్టులపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించినట్లు telugu.samayam ప్రచురించిన కథనం మేము చూశాం. ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా ఓటరు వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించిందని వైరల్ అవుతున్న కథనాలు బూటకమని ఆయన స్పష్టం చేశారు. కులాల వారీగా ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించలేదని ఏపీసీఈవో తన ట్వీట్లో కూడా స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న సమాచారంలో ఎలాంటి నిజం లేదని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తన ట్వీట్లో తెలిపారు. APCEO కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో నిజాలు, వాస్తవాలను మాత్రమే సోషల్ మీడియాలో పంచుకోవాలని, ఇలాంటి అబద్ధాలను పంచుకోవద్దని పోస్ట్ చేసింది.
వన్ ఇండియా కూడా ఈ వైరల్ పోస్టును ఫ్యాక్ట్ చెక్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ CEOకు సంబంధించిన అధికారిక X (ట్విట్టర్) ఖాతా లో.. ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఈ డేటా తప్పు! క్షుణ్ణంగా నిజ నిర్ధారణ చేసిన తర్వాత, షేర్ చేసిన సమాచారం పూర్తిగా కల్పితమని స్పష్టమవుతుందన్నారు. తప్పుడు సమాచారంతో మోసపోకండని సూచించారు.
‘BUSTED! It's time to set the record straight! The following data circulating online is FALSE! After thorough fact-checking, it's clear that the information being shared is completely fabricated. Don't be fooled by misinformation! Let's keep our feeds filled with truth and accuracy. Spread the word, not the lies! #APElections2024 #SVEEP #ChunavKaParv #DeshKaGarv #ECI #generalelections2024 #Elections2024 #LS2024' అంటూ ట్వీట్ కూడా వేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్ట్ లో ఎలాంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కులాల ఆధారంగా ఎలాంటి ఓటరు జాబితాను విడుదల చేయలేదు.
Claim : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కులాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేసింది
Claimed By : Twitter user
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story