Mon Nov 25 2024 13:47:58 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ ఫోటోలో ఉన్న వ్యక్తి జెఎన్‌యులో బ్రాహ్మణ వ్యతిరేక నిరసనలకు మూలకారణం కాదు
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యు) క్యాంపస్‌లోని అనేక గదుల ముందు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించాయి.
Claim :
వైరల్ ఫోటోలో ఉన్న వ్యక్తి జెఎన్‌యులో బ్రాహ్మణ వ్యతిరేక నిరసనలకు మూలకారణం అయ్యాడుFact :
వైరల్ ఫోటోలో ఉన్న వ్యక్తి జెఎన్‌యులో బ్రాహ్మణ వ్యతిరేక నిరసనలకు మూలకారణం కాదు, ఆయన భారత బ్లాగర్ పుష్పక్ సేన్
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యు) క్యాంపస్‌లోని అనేక గదుల ముందు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్-2 బిల్డింగ్ గోడలపై, పలువురు ఫ్యాకల్టీ గది తలుపులపై గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతకర రాతలు రాశారు. 'బ్రాహ్మణులు క్యాంపస్‌ను విడిచివెళ్లాలి. బ్రాహ్మణులు, బనియాలపై ప్రతీకారం తీర్చుకుంటాం. బ్రాహ్మణులారా భారత్‌ను విడిచివెళ్లండి' అనే వ్యాఖ్యలు గోడలపై కనిపించాయి.
గ్రాఫిటీకి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారు. యూనివర్శిటీలో బ్రాహ్మణ వ్యతిరేక నిరసన వెనుక ఉన్న వ్యక్తి అని పేర్కొంటూ చీర కట్టుకున్న వ్యక్తికి సంబంధించిన చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారు.
ట్విట్టర్ వినియోగదారులు ఈ చిత్రాలకు క్యాప్షన్ ఇస్తూ "ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ఈ వ్యక్తి కారణంగా బ్రాహ్మణులు, బనియాలపై విద్వేషం కొనసాగుతూ ఉంది" అని చెప్పుకొచ్చారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మా ఫ్యాక్ట్ చెక్ టీమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించింది. చిత్రంలో ఉన్న వ్యక్తిని భారతీయ బ్లాగర్ పుష్పక్ సేన్ అని గుర్తించే అనేక వెబ్సైట్లను కనుగొన్నాము. అతనొక భారతీయ బ్లాగర్ పుష్పక్ సేన్.
ది టెలిగ్రాఫ్, ఇతర వెబ్ సైట్ లకు అతను ఇచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా, పుష్పక్ సేన్ ఒక ఫ్యాషన్ ఐకాన్. అతను ది బాంగ్ ముండాగా ప్రసిద్ధి చెందాడు. అతను చీరకట్టులో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. మగవాళ్లు కూడా చీర కట్టుకోవచ్చనే సిద్ధాంతంతో ఈ ట్రెండ్ ను అతడు తీసుకుని వచ్చాడు.
వైరల్ అవుతున్న ఫోటోను పుష్పక్ సేన్ సోషల్ మీడియా అకౌంట్ లో కూడా చూడొచ్చు. మే 22, 2022న ఈ ఫోటోను అప్లోడ్ చేశాడు. కోల్‌కతాలోని గ్రేట్ ఈస్టర్న్ లలిత్ హోటల్లో మొదటి ఫోటోను తీశారు. రెండవ చిత్రం డిసెంబర్ 11, 2021న "Master in Fashion Communication and Marketing. @polimodafirenze Class of 2021." అప్లోడ్ చేశారు.
https://www.instagram.com/p/CXUA7G4NGFq/?utm_source=ig_embed&ig_rid=4ea3d16d-2f3c-4fb0-8b56-923844073150
అతని లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం, పుష్పక్ సేన్ కు జెఎన్యుతో ఏ విధంగానూ సంబంధం లేదు. అతను ఫ్యాషన్ మార్కెటింగ్, కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీని చేశాడు. ప్రస్తుతం ప్రముఖ స్టైలింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
మేము మరింత నిర్ధారణ కోసం పుష్పక్ సేన్‌ని కూడా సంప్రదించాము. అతను స్పందించినప్పుడు ఈ ఫ్యాక్ట్ చెక్ ను అప్డేట్ చేస్తాం.
అతని లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం, పుష్పక్ సేన్ కు జెఎన్యుతో ఏ విధంగానూ సంబంధం లేదు. అతను ఫ్యాషన్ మార్కెటింగ్, కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీని చేశాడు. ప్రస్తుతం ప్రముఖ స్టైలింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
మేము మరింత నిర్ధారణ కోసం పుష్పక్ సేన్‌ని కూడా సంప్రదించాము. అతను స్పందించినప్పుడు ఈ ఫ్యాక్ట్ చెక్ ను అప్డేట్ చేస్తాం.
స్పష్టంగా, వైరల్ చిత్రాలలో ఉన్న వ్యక్తి JNUలో బ్రాహ్మణ వ్యతిరేక నిరసనల వెనుక లేడు. వైరల్ అవుతున్న దావా తప్పు.
Claim : వైరల్ ఫోటోలో ఉన్న వ్యక్తి జెఎన్‌యులో బ్రాహ్మణ వ్యతిరేక నిరసనలకు మూలకారణం అయ్యాడు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story