Mon Dec 23 2024 14:30:37 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆక్టోపస్ సముద్రంలో నడుస్తూ ఉన్నాయి.. అదొక రోబో
ఆక్టోపస్ సముద్రగర్భంలో నడుస్తోందన్న వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.. సముద్రగర్భంలో ఆక్టోపస్ నడుస్తోంది అంటూ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Claim :
వైరల్ వీడియోలో ఉన్నది ఆక్టోపస్.. సముద్రంలో నడుస్తూ ఉందిFact :
వైరల్ వీడియోలో కనిపిస్తున్న జీవి నిజమైన ఆక్టోపస్ కాదు, రోబోటిక్ స్పై ఆక్టోపస్
ఆక్టోపస్ సముద్రగర్భంలో నడుస్తోందన్న వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.. సముద్రగర్భంలో ఆక్టోపస్ నడుస్తోంది అంటూ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను షేర్ చేసి “Rare video of a baby octopus walking on the seabed” అంటూ పోస్టులు పెడుతున్నారు. బేబీ ఆక్టోపస్ నడుస్తూ ఉందని.. ఇది చాలా అరుదైన వీడియో అంటూ చెప్పుకొచ్చారు.
ఇంకొందరు “Octopus walking on the seabed. Is there anyone left who doesn't believe in the theory of evolution? #Darwin #evolution Climate Change The Bible Penalty Dortmund $RUNE #BuildOnBase OpenSea Onana $INJ #cryptocurrencies #BLEACH Canadians”. అంటూ పోస్టులు పెట్టారు. సముద్రగర్భంలో నడుస్తున్న ఆక్టోపస్. పరిణామ సిద్ధాంతాన్ని నమ్మని వారు ఎవరైనా మిగిలి ఉన్నారా? అంటూ ఆ పోస్టుల ద్వారా చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పుల్లో ఇదొక భాగమని కూడా కొందరు పోస్టులు పెడుతున్నారు.

https://www.facebook.com/reel/1353116508746160
వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మేము బీబీసీ సిరీస్ కు సంబంధించి ‘Spy in the Wild’ కు సంబంధించిన ఆర్టికల్స్ ను చూశాం.
మేము BBC Earth కు సంబంధించిన YouTube ఛానెల్లో “The Octopus with Nine Brains I Spy in the Ocean I BBC Earth” శీర్షికతో ప్రచురించిన ఎక్కువ నిడివి ఉన్న వీడియోను కూడా కనుగొన్నాము. ఈ వీడియోను June 6, 2023న అప్లోడ్ చేశారు. ఆ వీడియో కింద “Although this coconut octopus has nine brains, it still needed a little help from our underwater spy robot..” అని ఉంచారు. కోకోనట్ ఆక్టోపస్ కు తొమ్మిది మెదడులు ఉన్నప్పటికీ.. అండర్ వాటర్ స్పై రోబోట్ సహాయం కావాలని అందులో చెప్పారు.
వీడియోలో 0.30 సెకన్ల మార్క్ వద్ద “To help fathom it out, another spy is required. One programmed to walk in a similar way, its aim is to communicate with the octopus to find out how clever it really is.” అని మనం వినొచ్చు. "దాన్ని అర్థం చేసుకోవడానికి, మరొక గూఢచారి అవసరం. అదే విధంగా నడవడానికి ప్రోగ్రామ్ చేశారు. ఆక్టోపస్ నిజంగా ఎంత తెలివైనదో తెలుసుకోవడానికి దానితో కమ్యూనికేట్ చేయడం దీని లక్ష్యం." అని చెప్పడం ద్వారా అదొక స్పై రోబో అని స్పష్టంగా అర్థం అవుతోంది.
అదే వీడియోను భాగస్వామ్యం చేసిన లాఫింగ్స్క్విడ్.కామ్ ప్రకారం, జాన్ డౌనర్ ప్రొడక్షన్స్ రూపొందించిన రోబోటిక్ స్పై ఆక్టోపస్ కు సంబంధించినది. డేవిడ్ టెన్నాంట్-వివరించిన BBC/PBS సిరీస్ స్పై ఇన్ ది వైల్డ్ లో హృదయాన్ని కదిలించే క్లిప్ ఉంది. వేటాడే వాటి నుండి దాక్కోవడానికి ఆశ్రయం కోసం వెతుకుతున్న అసలైన కోకోనట్ ఆక్టోపస్‌కు ఆ స్పై రోబో సహాయం అందిస్తుంది.
ఒక వెదురు ముక్కలో దాక్కోవాలని ఆక్టోపస్ అనుకుంది. ఇది కొంత వరకూ రక్షణ ఇచ్చినా.. పూర్తిగా కాపాడుకోవడం కష్టమే..! ఇంతలో స్పై ఆక్టోపస్.. ఒక కొబ్బరి చిప్పను తీసుకుని ఆక్టోపస్ ముందుకు వెళ్ళింది. మొదట నిజమైన ఆక్టోపస్ దాన్ని తీసుకోడానికి సంశయించినా.. ఆ తర్వాత తన ప్రాణాలను కాపాడుకోడానికి అదే మంచి పని అని భావించి తీసేసుకుంది.
https://laughingsquid.com/robotic-octopus-helps-octopus-hide/
scmp.com ప్రకారం, 'స్పై ఇన్ ది ఓషన్' అనే నాలుగు-భాగాల సిరీస్‌లో యానిమేట్రానిక్ డాల్ఫిన్, ఆక్టోపస్, మెరైన్ ఇగ్వానా, కటిల్‌ఫిష్, సీల్, బేబీ స్పెర్మ్ వేల్ వంటివి కూడా ఉన్నాయి.
అందువల్ల, నిజమైన ఆక్టోపస్ లాగా కనిపించే జీవి ఒక రోబోటిక్ ఆక్టోపస్. సముద్రం అడుగున సముద్ర జీవుల జీవితం, అలవాట్లను అర్థం చేసుకోవడానికి దీన్ని సృష్టించారు. ఇది సముద్రగర్భం మీద నడిచే నిజమైన ఆక్టోపస్ కాదు. దావా తప్పువైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. వీడియోలో కనిపిస్తున్న ఆక్టోపస్ సముద్రం కింద ఉన్న నిజమైన ఆక్టోపస్ ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు కెమెరాతో కూడిన రోబోటిక్ స్పై ఆక్టోపస్. దీన్ని పలు పరిశోధనల కోసం వాడుతున్నారు.వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మేము బీబీసీ సిరీస్ కు సంబంధించి ‘Spy in the Wild’ కు సంబంధించిన ఆర్టికల్స్ ను చూశాం.
మేము BBC Earth కు సంబంధించిన YouTube ఛానెల్లో “The Octopus with Nine Brains I Spy in the Ocean I BBC Earth” శీర్షికతో ప్రచురించిన ఎక్కువ నిడివి ఉన్న వీడియోను కూడా కనుగొన్నాము. ఈ వీడియోను June 6, 2023న అప్లోడ్ చేశారు. ఆ వీడియో కింద “Although this coconut octopus has nine brains, it still needed a little help from our underwater spy robot..” అని ఉంచారు. కోకోనట్ ఆక్టోపస్ కు తొమ్మిది మెదడులు ఉన్నప్పటికీ.. అండర్ వాటర్ స్పై రోబోట్ సహాయం కావాలని అందులో చెప్పారు.
వీడియోలో 0.30 సెకన్ల మార్క్ వద్ద “To help fathom it out, another spy is required. One programmed to walk in a similar way, its aim is to communicate with the octopus to find out how clever it really is.” అని మనం వినొచ్చు. "దాన్ని అర్థం చేసుకోవడానికి, మరొక గూఢచారి అవసరం. అదే విధంగా నడవడానికి ప్రోగ్రామ్ చేశారు. ఆక్టోపస్ నిజంగా ఎంత తెలివైనదో తెలుసుకోవడానికి దానితో కమ్యూనికేట్ చేయడం దీని లక్ష్యం." అని చెప్పడం ద్వారా అదొక స్పై రోబో అని స్పష్టంగా అర్థం అవుతోంది.
అదే వీడియోను భాగస్వామ్యం చేసిన లాఫింగ్స్క్విడ్.కామ్ ప్రకారం, జాన్ డౌనర్ ప్రొడక్షన్స్ రూపొందించిన రోబోటిక్ స్పై ఆక్టోపస్ కు సంబంధించినది. డేవిడ్ టెన్నాంట్-వివరించిన BBC/PBS సిరీస్ స్పై ఇన్ ది వైల్డ్ లో హృదయాన్ని కదిలించే క్లిప్ ఉంది. వేటాడే వాటి నుండి దాక్కోవడానికి ఆశ్రయం కోసం వెతుకుతున్న అసలైన కోకోనట్ ఆక్టోపస్‌కు ఆ స్పై రోబో సహాయం అందిస్తుంది.
ఒక వెదురు ముక్కలో దాక్కోవాలని ఆక్టోపస్ అనుకుంది. ఇది కొంత వరకూ రక్షణ ఇచ్చినా.. పూర్తిగా కాపాడుకోవడం కష్టమే..! ఇంతలో స్పై ఆక్టోపస్.. ఒక కొబ్బరి చిప్పను తీసుకుని ఆక్టోపస్ ముందుకు వెళ్ళింది. మొదట నిజమైన ఆక్టోపస్ దాన్ని తీసుకోడానికి సంశయించినా.. ఆ తర్వాత తన ప్రాణాలను కాపాడుకోడానికి అదే మంచి పని అని భావించి తీసేసుకుంది.
https://laughingsquid.com/
scmp.com ప్రకారం, 'స్పై ఇన్ ది ఓషన్' అనే నాలుగు-భాగాల సిరీస్‌లో యానిమేట్రానిక్ డాల్ఫిన్, ఆక్టోపస్, మెరైన్ ఇగ్వానా, కటిల్‌ఫిష్, సీల్, బేబీ స్పెర్మ్ వేల్ వంటివి కూడా ఉన్నాయి.
అందువల్ల, నిజమైన ఆక్టోపస్ లాగా కనిపించే జీవి ఒక రోబోటిక్ ఆక్టోపస్. సముద్రం అడుగున సముద్ర జీవుల జీవితం, అలవాట్లను అర్థం చేసుకోవడానికి దీన్ని సృష్టించారు. ఇది సముద్రగర్భం మీద నడిచే నిజమైన ఆక్టోపస్ కాదు. దావా తప్పువైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Viral video shows an octopus walking, not crawling on the seabed
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story