ఫ్యాక్ట్ చెక్: రాహుల్ పక్కన ఉన్నది హిండెంబర్గ్ అధిపతి కాదు
సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్బుక్లో, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉన్న వ్యక్తిని చూపిస్తూ, ఆయన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ అంటూ ఒక చిత్రం షేర్ అవుతోంది.
సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్బుక్లో, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉన్న వ్యక్తిని చూపిస్తూ, ఆయన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ అంటూ ఒక చిత్రం షేర్ అవుతోంది.
హిందీలో క్లెయిమ్ ఇలా ఉంది " ये जो पप्पू के साथ खड़ा है वो है हिंडेनबर्ग का चीफ नाथन एंडरसन . अदानी के खिलाफ जो साजिश हुई है वो इसी ने की है। लेकिन इस फोटो को देख के आपकी समझ में आ जायेगा की इसके पीछे कौन है। "
అనువదించబడినప్పుడు, కధనం ఇలా ఉంది: "పప్పుతో నిలబడిన వ్యక్తి హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్. అదానీ పతనం వెనుక కుట్ర పన్నిన వ్యక్తి. ఈ ఫోటో చూస్తే దీని వెనుక ఎవరున్నారో మీకే అర్థమవుతుంది."
నిజ నిర్ధారణ:
చిత్రంలో రాహుల్ గాంధీతో కనిపిస్తున్న వ్యక్తి హిండెన్‌బర్గ్ చీఫ్ అన్న వాదన అవాస్తవం. అతను 2018లో జర్మనీ పర్యటనలో రాహుల్ గాంధీని కలిసిన జర్మన్ మంత్రి.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, 2018లో ప్రచురించబడిన అదే చిత్రాన్ని కలిగి ఉన్న కొన్ని ట్వీట్లు లభించాయి.
భారత జాతీయ కాంగ్రెస్ చేసిన ట్వీట్ ప్రకారం, చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి నీల్స్ అన్నెన్, రాష్ట్ర మంత్రి, బుండెస్టాగ్ సభ్యుడు, వీరితో రాహుల్ భారతదేశం జర్మన్ రాజకీయాలు, కేరళలో వరదలు, ఘ్శ్ట్ ఉద్యోగాలపై చర్చించారు.
కొన్ని వార్తా నివేదికలు కూడా అదే చిత్రాన్ని పంచుకున్నాయి.
https://www.ndtv.com/india-
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీపై తన నివేదికను అందించిన తర్వాత, అనేక వార్తా సంస్థలు అండర్సన్‌పై కథనాలను ప్రచురించాయి. ఈ నివేదికలలో ఎన్నో చిత్రాలు ప్రచురించారు, అతను వైరల్ ఇమేజ్‌లో ఉన్న వ్యక్తికి భిన్నంగా ఉండడం చూడవచ్చు.
https://www.indiatimes.com/
కనుక, వైరల్ ఇమేజ్‌లో రాహుల్ గాంధీ పక్కన నిలబడి ఉన్న వ్యక్తి హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ కాదు. వాదన అవాస్తవం.