Mon Mar 31 2025 15:58:05 GMT+0000 (Coordinated Universal Time)
WEF గ్లోబల్ రిస్క్ రిపోర్ట్: సాయుధ పోరాటం, వాతావరణ మార్పులు, తప్పుడు సమాచారం కీలకమైన ముప్పులు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు చెందిన గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2025 లో ఆయుధ పోరాటాలు, వాతావరణ మార్పులు, తప్పుడు సమాచారం

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు చెందిన గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2025 లో ఆయుధ పోరాటాలు, వాతావరణ మార్పులు, తప్పుడు సమాచారం, ప్రపంచానికి పెను ముప్పుగా మారే ప్రమాదం ఉందని వివరించారు. పెరుగుతున్న సాయుధ ఘర్షణలు, వాతావరణ మార్పులు 2025లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద మైనస్ గా మారనున్నాయి. పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఘర్షణ వాతావరణం కూడా అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నట్లు నివేదిక తెలిపింది.
తప్పుడు సమాచారం, అసత్య కథనాల ప్రచారం వల్ల తక్కువ సమయంలోనే ఊహించని ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. నమ్మకాలను చెరిపివేయడం, దేశాల మధ్య, ప్రజల మధ్య గొడవలు తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. సామాజిక ఐక్యతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
వాతావరణ ముప్పు కారణంగా దీర్ఘకాలిక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల కారణంగా జీవవైవిధ్యానికి నష్టం, పర్యావరణ వ్యవస్థలో ఊహించని మార్పులు రావడం వల్ల భవిష్యత్తు తరాలకు పెను ముప్పుగా మారే అవకాశం ఉంది. ఈ భూమిపైన ఉన్న ఎన్నో వ్యవస్థలలో మార్పులు కూడా వస్తాయి. సహజ వనరుల కొరత కూడా పొంచి ఉంది. పర్యావరణంపై ఇప్పుడు మొదలయ్యే ప్రమాదాలు దీర్ఘకాలికంగా ఎన్నో ఇబ్బందులకు కారణమవుతూ ఉన్నాయి. పర్యావరణ మార్పూల వల్ల కాలుష్యం పెరుగుతుంది. గాలి, నీరు, భూమి అన్నీ కలుషితం అవుతాయి. అనారోగ్యం ప్రజలను వెంటాడుతుంది. పర్యావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా తక్షణ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రమాదాలు జరుగుతాయని ప్రముఖంగా గుర్తించారు. దీర్ఘకాలిక ప్రమాదాలలో టెక్నాలజీ తో ముడిపడిన తప్పుడు సమాచారం, ఇంకా ఏఐ టెక్నాలజీ వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు కూడా ఉన్నాయి అని రిపోర్ట్ చెబుతోంది.
సెప్టెంబర్- అక్టోబరు 2024లో 900 మందిని సర్వేలో భాగం చేశారు. గ్లోబల్ రిస్క్ ఎక్స్ పర్ట్స్, పాలసీ-మేకర్లు, ఇండస్ట్రీ పెద్దల అభిప్రాయాల ఆధారంగా వచ్చే దశాబ్దంలో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన అవగాహనతో ప్రతిపాదనలు తీసుకుని వచ్చారు. దాదాపు మూడింట రెండు వంతుల మంది 2035 నాటికి ఈ భూమి మీద ప్రకృతిలో దారుణమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని మెజారిటీ వ్యక్తులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణ, సాంకేతిక, సామాజిక సవాళ్లు తీవ్రతరం అవుతాయని భావిస్తున్నారు.
2025లో జనవరి 20 నుండి 24 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్-క్లోస్టర్స్లో (WEF) వార్షిక సమావేశానికి ముందు నివేదికను విడుదల చేశారు. వాతావరణ మార్పు, జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టం, కాలుష్యంపై దృష్టి సారించడం, ప్రపంచ సమాజం తప్పనిసరిగా పరిష్కరించాల్సిన సవాళ్లను వివరించనున్నారు. ఈ సంవత్సరం సమావేశం థీమ్ ను చూస్తే ఇంటెలిజెంట్ ఏజ్ కోసం సహకారం (Collaboration for the Intelligent Age),ఈ క్లిష్టమైన పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి సహకార ప్రయత్నాలు ముఖ్యమని చెబుతున్నాయి. 2006లో మొదటి ఎడిషన్ వచ్చినప్పటి నుండి వాతావరణ సమస్యలు, పలు ప్రమాదాలను వర్గీకరించారు.
వాతావరణ మార్పులతో సంబంధం ఉన్న ప్రమాదాలు కూడా రాబోయే సంవత్సరాల్లో పెను ముప్పు తేనున్నాయని 14% మంది చెబుతున్నారు. బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల నిరంతర వినియోగం వల్ల కాలుష్యం మరింత పెరుగుతూ, తీవ్రమైన వాతావరణ మార్పులకు దారి తీస్తుంది. కాబట్టి, వాతావరణ మార్పుల్లో తేడాలు ప్రతి సంవత్సరం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనబడుతోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు, బ్రెజిల్, ఇండోనేషియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు, కెనడాలో కార్చిచ్చు, యునైటెడ్ స్టేట్స్లోని హెలెన్, మిల్టన్ హరికేన్లు అటువంటి సంఘటనలకు ఇటీవలి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గత సంవత్సరం మాదిరిగానే తప్పుడు సమాచారం కారణంగా కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తప్పుదారి పట్టించే సమాచారం కారణంగా వేగవంతంగా వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఇవి ఇతర ప్రమాదాలు పెరగడానికి కారణమవుతాయి.
2025 లో భౌతిక సంక్షోభాన్ని కలిగించే టాప్ 10 ప్రమాదాలలో నాలుగు సామాజిక స్వభావం ఉండటం ద్వారా పెరుగుతున్న సమాజం విచ్చిన్నమవుతుందనే భావన పెరుగుతోంది. ప్రాపంచం లో రిస్క్ ల తీవ్రత అంచనాలను తెలుపుతున్న ఈ రిపోర్ట్ లో తప్పుడు, అబద్దపు సమాచారం వల్ల అత్యధిక ప్రమాదం ఉందని నిర్ధారించారు, అయితే వాతావరణ మార్పుల వల్ల సంభవించే ప్రమాదాలు లాగ్-టర్మ్ గ్లోబల్ రిస్కులుగా పరిగణనలోకి వచ్చాయి.
Next Story