Fri Apr 11 2025 09:53:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: భారతదేశంలో రక్త అవసరాలకు 104 నెంబర్ ను తీసుకొచ్చారనే వాదనలో ఎలాంటి నిజం లేదు
భారతదేశంలో ఎవరికైనా రక్తం కావాల్సి ఉంటే 104 నెంబర్ కు కాల్

Claim :
భారతదేశంలో ఎవరికైనా రక్తం కావాల్సి ఉంటే 104 నెంబర్ కు కాల్ చేయాలిFact :
వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు
సమయానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. మీ బాధ్యతగా మీరు రక్తాన్ని అందిస్తే తప్పకుండా ఇతరులను రక్షించగలదని గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది ప్రజలు ప్రాణాలను కాపాడుకోవడానికి రక్తమార్పిడిపై ఆధారపడుతూ ఉంటారు. క్యాన్సర్ రోగులు, శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వ్యక్తులు, ప్రమాదానికి గురైన వారికి రక్తం అవసరం చాలా ఉంటుంది. భయం, గందరగోళం, అపోహల కారణంగా కూడా పలువురు రక్తదానం అంటే చాలు వెనకడుగు వేస్తూ ఉంటారు.
రక్తాన్ని తీసుకునే వారికే కాదు.. రక్తదానం చేసే వారికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. శరీరంలో ఐరన్ ఓవర్‌లోడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బులకు కారణమయ్యే రక్తంలో ఇనుము స్థాయిలను తగ్గించడం ద్వారా గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తదానం చేయడం ద్వారా, మీరు ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కాదు. మీరు మీ హృదయాన్ని కూడా కాపాడుకోవచ్చు.
అయితే ప్రభుత్వం కొత్త పథకం తీసుకుని వచ్చిందని.. ఇకపై 104 నెంబర్ కు కాల్ చేస్తే రక్తాన్ని డెలివరీ చేస్తారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. బాటిల్ కు 450 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారని చెబుతున్నారు.
"*ప్రభుత్వం కొత్త పథకం...*
ఈరోజు నుండి, భారతదేశంలో రక్త అవసరాలకు *"104"* ప్రత్యేక నంబర్ కానుంది. *"Blood_On_Call"* అనేది సేవ పేరు. ఈ నంబర్‌కు కాల్ చేసిన తర్వాత,
*40 కిలోమీటర్ల* పరిధిలో, నాలుగు గంటల్లోపు,
రక్తం డెలివరీ అవుతుంది...
బాటిల్ కు *రూ. 450/-* మరియు రవాణాకు" అంటూ పోస్టులు పెడుతున్నారు.

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా.. 104 కు రక్తం హోమ్ డెలివరీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ప్రభుత్వం నుండి రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటనలు రాలేదని మేము ధృవీకరించాం.
మేము చేసిన కీవర్డ్ సెర్చ్ లో 2014 టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక మాకు కనిపించింది. రక్తం కావాల్సిన వారు మహారాష్ట్రలో ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చని కథనంలో తెలిపారు. కాల్ సెంటర్‌ను ఔంధ్ సివిల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. రక్త గ్రహీతలను వారి జిల్లాలోని బ్లడ్ బ్యాంకులతో అనుసంధానం చేస్తుందని అధికారులు తెలిపారు.
ఆ కథనం ఇక్కడ చూడొచ్చు.
2022 లో వచ్చిన నివేదికల ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వం 2022లో ఈసేవలను నిలిపివేసింది. మహారాష్ట్రలో టోల్ ఫ్రీ నంబర్ 104లో అందుబాటులో ఉన్న బ్లడ్-ఆన్-కాల్ సేవను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2022 నుండి నిలిపివేసింది. రాష్ట్ర బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ కౌన్సిల్ (SBTC) అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ థోరట్ ఈ విషయంపై మాట్లాడుతూ, ఈ సేవ ఆర్థికంగా భారంగా మారినందున నిలిపివేస్తున్నామని తెలిపారు. ఆ నివేదికను ఇక్కడ చూడొచ్చు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), 5 నవంబర్ 2024న X ఖాతాలో వైరల్ కథనాలను ఖండిస్తూ వీడియోను పోస్టు చేసింది. ప్రజలను "తప్పుదోవ పట్టించేది" అని పేర్కొంది. ప్రభుత్వం అటువంటి పథకాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేసింది.

2023 మార్చి నెలలో కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వాదనను ఖండిస్తూ పోస్టు పెట్టింది.
జనవరి-2014లో మహారాష్ట్రలో ప్రారంభించిన ‘బ్లడ్ ఆన్ కాల్’ (104) సేవను రాష్ట్ర ప్రభుత్వం 01 ఏప్రిల్ 2022 నుండి నిలిపివేసింది. అయితే ఈ మెసేజీ పలు భాషల్లో, పలు సందర్భాల్లో వైరల్ అయింది. 104 కాల్ చేస్తే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా సేవలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి.
గతంలో తెలుగుపోస్ట్ ఈ వదంతులను ఖండిస్తూ నిజ నిర్ధారణ చేసింది. అందుకు సంబంధించిన లింక్ ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : భారతదేశంలో ఎవరికైనా రక్తం కావాల్సి ఉంటే 104 నెంబర్ కు కాల్
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story