ఫ్యాక్ట్ చెక్: మనిషి కాలికి వేసిన పట్టీ లోకి పాము దూరలేదు, ఇది అబద్దం
ఎక్స్-రే అనేది మానవ శరీరం లోపలి భాగాల గురించి తెలుసుకోడానికి రేడియేషన్‌ను ఉపయోగించే ఒక రకమైన మెడికల్ ఇమేజింగ్.
Claim :
పాము మనిషి కాలుకి వేసిన పట్టీలోకి ప్రవేశించి, అక్కడే ఉండిపోయిందిFact :
వైరల్ అవుతున్న ఫోటోలో ఎలాంటి నిజం లేదు, నిజమైన ఎక్స్ రే లో పాము అలా కనపడదు
ఎక్స్-రే అనేది మానవ శరీరం లోపలి భాగాల గురించి తెలుసుకోడానికి రేడియేషన్‌ను ఉపయోగించే ఒక రకమైన మెడికల్ ఇమేజింగ్ టెక్నీక్. ఎక్స్-రే కిరణాలు సాధారణంగా విరిగిన ఎముకలు, దంతాల గురించి తెలుసుకోడానికి ఉపయోగిస్తారు. లోపల అయిన గాయాలు, రుగ్మతలు, వ్యాధుల నిర్ధారణకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. జీర్ణవ్యవస్థలోని భాగాలను అంచనా వేయడానికి మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయంలోని రాళ్లు మొదలైన పరిస్థితులను నిర్ధారించడంలో కూడా సహాయపడతాయి. శరీరం గుండా రేడియేషన్ కిరణాలను పంపడం ద్వారా లోపల ఏమి జరుగుతోందో తెలుసుకోవచ్చు. రేడియేషన్ కిరణాలు కనిపించవు, మనం అనుభూతి చెందలేము కూడా.
ఎముకలు వంటి ఘన, దట్టమైన వస్తువులు రేడియేషన్‌ను సులభంగా గ్రహిస్తాయి. కాబట్టి అవి ఎక్స్-రే చిత్రంలో బూడిద రంగులో కనిపిస్తాయి. కొందరు వ్యక్తులు ఏదైనా మింగేసినా, శరీరంలోపల ఏమైనా చొచ్చుకు వెళ్లినా వాటిని ఎక్స్ రే సహాయంతో గుర్తిస్తారు. ఓ ఎక్స్ రే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఓ వ్యక్తి కాలు భాగంలో వేసిన పట్టీలోకి పాము లోపలికి వెళ్లిపోయిందని ఆ పోస్టుల ద్వారా చెబుతూ ఉన్నారు. ఒక పాము, గుండ్రని వస్తువు ఎక్స్-రే చిత్రంలో కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నప్పుడు పాము ప్లాస్టర్ లోపలికి చొరబడిందని వాట్సాప్‌లో ప్రచారం జరుగుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్ :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మేము ఈ పోస్ట్‌పై కామెంట్స్ ను తనిఖీ చేసినప్పుడు, పోస్టు పెట్టిన X వినియోగదారు తన స్నేహితులలో ఒకరు ఈ చిత్రాన్నిషేర్ చేశారని తెలిపారు. అసలు ఫోటోను Instagram ఖాతా నుండి తీసుకున్నానని పేర్కొంటూ ఒక కామెంట్ ను స్వయంగా పంచుకున్నట్లు మేము కనుగొన్నాము. అది ఫేక్ అని తెలిసి కూడా ఆ చిత్రాన్ని షేర్ చేశానని తెలిపాడు.అందువల్ల, వైరల్ చిత్రం నిజమైన ఎక్స్-రే కాదు. ఇది నకిలీ చిత్రం. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.