Sun Mar 23 2025 12:39:24 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఓ వర్గానికి చెందిన వారు పుచ్చకాయలో రంజాన్ సమయంలో కెమికల్స్ ను కలుపుతున్నారంటూ జరుగుతున్న వాదనలో నిజం లేదు
2025లో పవిత్ర రంజాన్ మాసం మార్చి 2, 2025న ప్రారంభమైంది. చంద్రుడి రాకను బట్టి నెల రోజుల తర్వాత రంజాన్ నెల ముగుస్తుంది.

Claim :
రంజాన్ సందర్భంగా ఒక హిందూ వ్యక్తి పుచ్చకాయలలో రసాయనాలను ఇంజెక్ట్ చేసి అమ్ముతున్నారుFact :
ఈ వీడియో స్క్రిప్టెడ్. 'ది సోషల్ జంక్షన్' అనే యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన స్క్రిప్టెడ్ వీడియో.
2025లో పవిత్ర రంజాన్ మాసం మార్చి 2, 2025న ప్రారంభమైంది. చంద్రుడి రాకను బట్టి నెల రోజుల తర్వాత రంజాన్ నెల ముగుస్తుంది. ఈ నెలలో పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఇతర వస్తువుల వినియోగం పెరిగింది. అలాగే వేసవి కారణంగా వేడి పెరగడం వల్ల, పండ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న వేడిని తట్టుకోవడానికి ప్రజలు పండ్ల వినియోగాన్ని కూడా పెంచారు. అనేక ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున, ఈ సమయంలో పుచ్చకాయల వంటి పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఒక వ్యక్తి పుచ్చకాయ పండ్లను కల్తీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, పండ్ల విక్రేత ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తూ, రంజాన్ సమయంలో పుచ్చకాయను కల్తీ చేస్తున్నాడని సూచించే శీర్షికలతో వీడియోను వైరల్ చేస్తున్నారు. “रमजान में मुसलमानों की जान बचाए, इस वीडियो को शेयर कर नेकी कमाए!! रमजान में इफ़्तारी की करते हुए खरीददारी आपकी एक गलती से हो सकती है सभी की छुट्टी।। #Ramadan #RamadanKareem #Ramadan2025” అంటూ పోస్టులు పెట్టారు. "రంజాన్ నెలలో ముస్లింల ప్రాణాలను కాపాడండి, ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మంచితనం సంపాదించండి!! రంజాన్‌లో ఇఫ్తార్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు, మీరు చేసే ఒక పొరపాటు అందరికీ నష్టాన్ని కలిగిస్తుంది" అని ఆ మెసేజీలో ఉంది.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఈ వీడియోలో పండ్ల విక్రేత కల్తీ జరుపుతున్న అసలైన వీడియో కాదు. ఈ వీడియో ది సోషల్ జంక్షన్ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన స్క్రిప్టెడ్ వీడియో.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించగా, ఆ వీడియో పాతదని కనుగొన్నాము. ఈ వీడియో మే 2024లో Facebookలో షేర్ చేశారని కూడా తెలుస్తోంది.
మరింత శోధించగా, ఆ వీడియోను ది సోషల్ జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ లో “तरबूज खाने वाले जरूर देखें, कैसे होता है आपके सेहत से खिलवाड़ सावधान!” అనే శీర్షికతో ప్రచురించారని మేము కనుగొన్నాము. ఏప్రిల్ 29, 2024న వీడియోను అప్లోడ్ చేశారు.
పుచ్చకాయలు, మామిడి పండ్లను కల్తీ చేసినందుకు యువకులను పట్టుకున్నట్లు చూపించే ఇలాంటి వీడియోలు యూట్యూబ్ ఛానెల్లో చాలా ఉన్నాయి. ఓ యువకుడు పుచ్చకాయలను కల్తీ చేస్తున్నట్టు చూపించే మరో వీడియో కూడా ఛానెల్లో షేర్ చేశారు. ఆ వీడియో పూర్తిగా కల్పితమని, వీడియోలోని అన్ని ఘటనలు స్క్రిప్టెడ్ అని తెలిపారు. ప్రజల అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించారని ఆ వీడియోలో తెలిపారు. వైరల్ వీడియోలో అలాంటి డిస్క్లైమర్ ఏదీ లేనప్పటికీ, ఆ వీడియోను ఒకే బృందం రూపొందించిందని, స్క్రిప్టెడ్ వీడియో అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. రెండు వీడియోలకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇక్కడ చుడొచ్చు
జూలై 2024లో ఒక యువకుడు మామిడిపండ్లలో రసాయనాలు నింపుతున్న వాదనపై కూడా తెలుగుపోస్ట్ బృందం ఫ్యాక్ట్ చెక్ చేసి అందులో నిజం లేదని తేల్చింది. అదే యూట్యూబ్ ఛానెల్ నుండి వచ్చిన వీడియో తప్పుడు వాదనలతో ఇప్పుడు వైరల్ ఆవుతోందని తెలుస్తోంది .
పండ్లలో రసాయనాలు నింపుతున్నట్లు చూపించే స్క్రిప్టెడ్ వీడియోలు సోషల్ మీడియాలో తప్పుడు వాదనలతో ప్రచారంలో ఉన్నాయి. ఒక వ్యక్తి పుచ్చకాయలో రసాయనాలు నింపుతున్నట్లు చూపించే వైరల్ వీడియో ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే వాదనలో నిజం లేదు. ఇది కేవలం అవగాహన ప్రయోజనాల కోసం సృష్టించిన పాత వీడియో. వీడియోలోని వ్యక్తులు నటీ నటులు.
Claim : రంజాన్ సందర్భంగా ఒక హిందూ వ్యక్తి పుచ్చకాయలలో రసాయనాలను ఇంజెక్ట్ చేసి అమ్ముతున్నారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story