Thu Nov 07 2024 06:40:12 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తెలుగు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానం చెప్పలేకపోయారా..?
హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కోసం పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా విచ్చేశారు. అయితే ఆయనకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్లెయిమ్: జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానం చెప్పలేకపోయారా..?
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కోసం పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా విచ్చేశారు. అయితే ఆయనకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
14 సెకన్ల నిడివి గల వీడియోలో అమిత్ షాను ఒక న్యూస్ రిపోర్టర్ ప్రశ్నిస్తున్నట్లు చూపబడింది. ఆ ప్రశ్నకు అమిత్ షా కనీసం సమధానం చెప్పలేకపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు.
వరదల సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎందుకు సహాయం చేయలేదని ఓ విలేకరి ప్రశ్నించగా హోంమంత్రి మౌనంగా ఉన్నారని పేర్కొంటూ పలువురు యూజర్లు ట్విట్టర్లో వీడియోను షేర్ చేశారు. ట్విట్టర్ యూజర్ @manishjagan జులై 4, 2022న ఈ ట్వీట్ చేశాడు.

హిందీలో ట్వీట్ చేయడమే కాకుండా.. అమిత్ షా విలేఖరి అడిగిన ప్రశ్నకు కనీసం సమాధానం చెప్పలేకపోయారంటూ ట్వీట్లు.. రీట్వీట్లు చేయడం మొదలుపెట్టారు.
''వర్షాలు, వరదలతో తెలంగాణ అతలాకుతలమైంది. కానీ కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాలేదు. అలాంటప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు ముఖం చూపించేందుకు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు'' అని షాను హిందీలో విలేకరి ప్రశ్నించినట్లు తెలిసింది.
@FUNNYSRK అనే ట్విట్టర్ యూజర్ కూడా ఇదే వీడియోను పోస్ట్ చేయడం మేము గమనించాం.

ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ వీడియో ఇప్పటిది కాదు.. పాత వీడియో. అంతేకాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.2020 నాటి వీడియో నుండి ఈ వీడియోను తీసుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో చూపిస్తున్నట్లుగా.. అమిత్ షా విలేఖరి ప్రశ్నకు మౌనంగా ఉండలేదు. వీడియో యొక్క సుదీర్ఘ వీడియోలో, విలేఖరి ప్రశ్నకు అమిత్ షా ప్రతిస్పందించడం చూడవచ్చు.
వీడియో క్లిప్‌లో.. రిపోర్టర్ బూమ్-మైక్‌లో V6 లోగో కనిపించింది. మేము V6 న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానెల్లో "అమిత్ షా ఇంటర్వ్యూ"ని ఉపయోగించి కీవర్డ్ సెర్చ్ చేసాము. అప్పుడు ఈ 3.02 నిమిషాల నిడివి గల వీడియో కనుగొనబడింది.
నవంబర్ 29, 2020న ప్రచురించబడిన 40 సెకన్ల వీడియోలో.. తెలంగాణలో వరదల సమయంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు లేకపోవడం గురించి విలేఖరి అమిత్ షాను అడిగాడు. దానికి హోం మంత్రి వెంటనే స్పందిస్తూ, "మేము హైదరాబాద్‌కు ఎక్కువగా నిధులు ఇచ్చాము. ఏడు లక్షల ఇళ్లల్లో నీరు ప్రవేశించింది, ఆ సమయంలో ఒవైసీ, కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? అని నేను అడగాలనుకుంటున్నాను" అని అమిత్ షా ఎదురు ప్రశ్నించారు.
వీడియో యొక్క టైటిల్, వివరణ ప్రకారం.. ఇది 2020లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో రికార్డ్ చేయబడింది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, నవంబర్ 29, 2020న GHMC ఎన్నికలకు ముందు కేంద్ర హోంమంత్రి పార్టీ రోడ్‌షోలో పాల్గొన్నారు.
వైరల్ వీడియోలో చెప్పినట్లుగా ఇటీవల చోటు చేసుకున్నది కాదు.
క్లెయిమ్: జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానం చెప్పలేకపోయారా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Amit Shah ‘silenced’ by a reporter in Telangana
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story