Tue Nov 05 2024 14:49:29 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఉక్రెయిన్ సైనికులు తమ భాగస్వామ్యులతో ఎమోషనల్ అవుతున్న వీడియోలు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న సమయంలో, సైనికులు తమ ప్రియమైన వారిని కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటి భావోద్వేగ వీడియో వైరల్‌గా మారింది.
క్లెయిమ్: ఉక్రెయిన్ సైనికులు యుద్ధానికి ముందు తమ భాగస్వామ్యులతో ఎమోషనల్ అవుతూ..!
ఫ్యాక్ట్: ఈ వైరల్ వీడియో నిజమైనది కాదు. సినిమా లోని సన్నివేశం.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న సమయంలో, సైనికులు తమ ప్రియమైన వారిని కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటి భావోద్వేగ వీడియో వైరల్‌గా మారింది. ఉక్రేనియన్ సైనికులు కీవ్ లో ప్రియమైనవారికి వీడ్కోలు పలికిన దృశ్యాలని చెబుతున్నారు.
చాలా మంది ట్విటర్ వినియోగదారులు ఓ చిన్న వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ "Damn war ... Here is the capital of Ukraine: scenes of anxiety, farewell, love " వంటి శీర్షికలతో షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో నిజంగా చోటు చేసుకున్నది కాదు. ఈ వీడియో ఉక్రెయిన్ సినిమా "The War of Chimeras" కి సంబంధించినది. 2017 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది.
InVID టూల్ మరియు రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ల సహాయంతో, వైరల్ క్లిప్‌లోని అవే దృశ్యాలు రెండు YouTube వీడియోలతో సరిపోలినట్లు మేము కనుగొన్నాము. జియోమోవీస్ అనే యూట్యూబ్ ఛానెల్ లో సినిమా కు సంబంధించిన ట్రైలర్‌ను అప్లోడ్ చేసింది. ఇందులో షేర్ చేస్తున్న వీడియో క్లిప్ ఉంది.
వైరల్ క్లిప్‌లోని మొత్తం దృశ్యం మరొక యూట్యూబ్ ఛానెల్ "ప్రొడక్షన్"లో కూడా కనుగొనబడింది. YouTube ఛానెల్ ఉక్రేనియన్ భాషలో వీడియో గురించి సవివరమైన సమాచారాన్ని కలిగి ఉంది. ఇది "ది వార్ ఆఫ్ చిమెరాస్" సినిమాకు సంబంధించిన దృశ్యాలని పేర్కొంది.
"The War of Chimeras" సినిమాను అనస్తాసియా స్టారోజిత్స్కా, మరియా స్టారోజిత్స్కా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 2017లో నిర్మించారు.
ఈ చిత్రం తూర్పు ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని చిత్రీకరించబడింది.
వైరల్ క్లిప్ కు ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఆ వీడియో ఓ చిత్రానికి సంబంధించినది.
క్లెయిమ్: ఉక్రెయిన్ సైనికులు యుద్ధానికి ముందు తమ భాగస్వామ్యులతో ఎమోషనల్ అయ్యారు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టులు అబద్ధం
Claim : Video shows soldiers bidding farewell to loved ones in Kyiv amid Russia’s invasion of Ukraine.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story