ఫ్యాక్ట్ చెక్: ఏపి ప్రభుత్వం కొత్త వక్ఫ్ బోర్డును తీసుకురావడం కోసం పాత బోర్డును రద్దు చేసింది
శతాబ్దాలుగా విరాళంగా ఇచ్చిన కోట్లాది రూపాయల వక్ఫ్ ఆస్తులను నియంత్రించే దశాబ్దాల నాటి చట్టాన్ని సవరించాలని కేంద్ర
Claim :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసిందిFact :
ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం
శతాబ్దాలుగా విరాళంగా ఇచ్చిన కోట్లాది రూపాయల వక్ఫ్ ఆస్తులను నియంత్రించే దశాబ్దాల నాటి చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లు ద్వారా ప్రస్తుత వక్ఫ్ బిల్లుకు 40కి పైగా సవరణలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. వక్ఫ్ బిల్లు వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది, ఇవి సాధారణంగా ఇస్లామిక్ చట్టం ప్రకారం ధార్మిక లేదా మతపరమైన ప్రయోజనాల కోసం అంకితం చేసినవి. ఈ ఆస్తులు భారతదేశంలోని రాష్ట్ర, జాతీయ వక్ఫ్ బోర్డుల ద్వారా చూసుకుంటారు. వీటిని విద్య, సామాజిక సంక్షేమం, మతపరమైన కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. నిర్వహణ లోపం, పారదర్శకత లేకపోవడంతో సంస్కరణల అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బిల్లును సమీక్షించాల్సిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.. పలు అంతరాయాల కారణంగా బిల్లు ప్రవేశం వాయిదా పడింది. ఫిబ్రవరి 2025లో బడ్జెట్ సెషన్లో దీనిని సమర్పించాలని భావిస్తున్నారు.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.