ఫ్యాక్ట్ చెక్: మహాకుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించాక ఏపీ డిప్యూటీ సీఎం ఆసుపత్రి పాలయ్యారనే వాదనలో నిజం లేదు
2025 ప్రయాగ్రాజ్లోని మహా కుంభమేళా సెలబ్రిటీలతో పాటు భారీ సంఖ్యలో భక్తులను ఆకర్షించింది. ఇప్పటికే 62 కోట్ల మంది

Claim :
మహా కుంభమేళాలో సంగమ నీటిలో పుణ్యస్నానం చేసిన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ ఉప CM పవన్ కళ్యాణ్ ఆసుపత్రి పాలయ్యారుFact :
వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల నిమిత్తం అపోలో ఆసుపత్రికి వెళ్లారు.
2025 ప్రయాగ్రాజ్లోని మహా కుంభమేళా సెలబ్రిటీలతో పాటు భారీ సంఖ్యలో భక్తులను ఆకర్షించింది. ఇప్పటికే 62 కోట్ల మంది యాత్రికులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అంబానీ, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు మహా కుంభమేళాను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఫిబ్రవరి 18, 2025న తన భార్య, కొడుకుతో కలిసి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.
క్లెయిం ఆర్కైవ్ లింకును ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
మనీ కంట్రోల్ లో ప్రచురితమైన కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి స్కాన్లతో సహా అనేక పరీక్షలను నిర్వహించారు. ప్రాథమిక ఫలితాలను సమీక్షించగా, వైద్య నిపుణులు రాబోయే వారాల్లో అదనపు పరీక్షలు చేయించుకోవాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.