Mon Dec 23 2024 07:32:09 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: లేదు, ఏపీలో మద్యం కొనుగోలుకు లిక్కర్ పర్చేజ్ కార్డులు తీసుకుని రాలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం కొనుగోలు కోసం కొత్తగా ID కార్డ్‌ను జారీ చేయబోతోంది. షాపుల నుండి మద్యం కొనడానికి ఇది తప్పనిసరి అని కథనాలు ప్రచారం చేస్తున్నారు.
క్లెయిమ్: సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వైరల్ న్యూస్ వీడియో ప్రకారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం కొనుగోలు కోసం కొత్తగా ID కార్డ్‌ను జారీ చేయబోతోంది. షాపుల నుండి మద్యం కొనడానికి ఇది తప్పనిసరి అని కథనాలు ప్రచారం చేస్తున్నారు., ID కార్డ్‌ను తప్పనిసరిగా రూ. 5,000 చెల్లించి ఏటా కొనుగోలు చేయాలని సదరు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. అదే వార్తల క్లిప్పింగ్స్ ప్రకారం, కార్డ్ ద్వారా మద్యం కొనుగోలు చేయడానికి అనుమతిని ఇస్తుంది, ఇది కేటాయించిన కోటా ప్రకారం విక్రయించబడుతుంది. మద్యం కొనుగోలు చేయడానికి కార్డ్ హోల్డర్ అతను/ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు రుజువును చూపిస్తేనే మద్యాన్ని కొనడానికి అనుమతి లభిస్తుంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. వాట్సాప్‌లో విస్తృతంగా సర్క్యులేషన్ చేయడంతో వైరల్‌గా మారింది. మద్యం కొనుగోలు కోసం కార్డుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు.. ఎటువంటి నోటిఫికేషన్ ను కూడా విడుదల చేయలేదు.పైన పేర్కొన్న వీడియో వాట్సాప్‌లో చక్కర్లు కొడుతూ ఉంది. మద్యం వినియోగదారులు, విక్రయదారులలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. వీడియో ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం కొనుగోలు కార్డును ప్రవేశపెట్టింది. ఎవరైనా మద్యం కొనుగోలు చేయాలనుకుంటే అది తప్పనిసరి. ఈ వీడియో ప్రకారం.. కార్డును రూ. 5000కి కొనుగోలు చేయాలి. అందులో పేర్కొన్న పరిమితిలోపు మద్యం కొనుగోలు చేయవచ్చు. మా పరిశోధనలో ఈ వాదనలు ఏవీ నిజం కాదని మేము కనుగొన్నాము.
సంబంధిత కీ వర్డ్స్ తో కూడిన సాధారణ Google సెర్చ్ ప్రారంభించాము. ఏ ప్రధాన వార్తా ఛానెల్ కూడా అటువంటి వార్తలను ప్రసారం చేయలేదని మేము కనుగొన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ ఏజెన్సీలు మీడియాతో అలాంటి సమాచారాన్ని పంచుకోలేదు. AP బెవరేజెస్ వెబ్‌సైట్‌ను తనిఖీ చేసినప్పుడు, మేము అలాంటి GO జారీ చేయలేదని కనుగొన్నాము.
దీనిని ధృవీకరించడానికి, మేము AP బేవరేజెస్ DGM శ్రీ శ్రీనివాసుల రెడ్డి ని ఫోన్ లో సంప్రదించాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి GO ఏదీ జారీ చేయలేదని ఆయన ధృవీకరించారు.
తదుపరి దర్యాప్తులో, 2019లో అదే తరహా వార్తలు వెలువడ్డాయని, కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెల్ లు ఎటువంటి ధృవీకరణ లేకుండానే ప్రసారం చేశాయని మేము కనుగొన్నాము.

మేము అసవ్ వైన్స్ వ్యవస్థాపకుడు కిషన్ పెద్దపల్లిని కూడా సంప్రదించాము. ఆంధ్రప్రదేశ్‌లో తప్పనిసరిగా మద్యం కొనుగోలు కార్డ్‌పై జరగాలంటూ నోటిఫికేషన్ ఏదైనా వచ్చిందా అని అడిగాము. ఆయన అలాంటిది ఏమీ లేదని ధృవీకరించారు.
మీ ఇచ్చిన ఫలితాల ఆధారంగా, మద్యం కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం ఇచ్చిన కార్డునే వాడాలంటూ జరుగుతున్న ప్రచారం అబద్దమని మేము నిర్ధారించాము. ఇది పూర్తిగా అవాస్తవమని తేలింది.
Claim : AP Government Is Introducing Liquor Purchase ID Cards
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story