Mon Nov 25 2024 08:01:58 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఏపీ ఎన్నికలకు సంబంధించి ఆత్మసాక్షి సర్వే ఫలితాలు తారుమారు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు సంస్థలు ముందస్తు ఎన్నికల సర్వేలు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తున్నాయి.
Claim :
రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం SAS గ్రూప్ నిర్వహించిన ఆత్మసాక్షి సర్వే లో TDP/BJP/Janasena కూటమి 136 సీట్లు గెలుచుకోవచ్చు అని వెల్లడించిందాFact :
రానున్న ఎన్నికల్లో టీడీపీ/బీజేపీ/జనసేన కూటమికి 50, వైఎస్సార్సీపీకి 93 సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే తేల్చింది. వైరల్ చిత్రాన్ని మార్ఫింగ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు సంస్థలు ముందస్తు ఎన్నికల సర్వేలు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఆత్మసాక్షి గ్రూప్ కూడా మార్చి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పరిస్థితిని అంచనా వేయడానికి సర్వేను నిర్వహించింది. సర్వే ఫలితాలను విడుదల చేసింది.
అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు సర్వే ఫలితాలను పంచుకోవడం ప్రారంభించారు.
“AP: ఆత్మసాక్షి సర్వే 2024: టిడిపి+జెఎస్పీ+బీజేపీకి 53.5%, వైసిపికి 41.5%. అసెంబ్లీ టిడిపి+జెఎస్పీ+బీజేపీ -136, వైసిపి -21, పోటాపోటీ - 18
పార్లమెంట్ టిడిపి+జెఎస్పీ+బీజేపీ -20 సీట్లు వైసిపి -2 సీట్లు పోటాపోటీ -3 సీట్లు! #bjp #Janasena #tdp #AndhraPradesh" అంటూ పలువురు పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఆత్మసాక్షి గ్రూప్ నివేదికలో ప్రచురించిన అసలైన సర్వే ఫలితాలతో పోలిస్తే.. భిన్నమైన ఫలితాలలు సర్క్యులేషన్లో ఉన్నాయి. వైరల్ చిత్రాన్ని ఎడిట్ చేశారు.
“Atmasakshi survey 2024” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా.. మేము సర్వే నివేదిక ఫలితాలను విశ్లేషించే కొన్ని YouTube వీడియోలను కనుగొన్నాము. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 93 సీట్లు, టీడీపీ కూటమి 50 సీట్లు, 32 స్థానాల్లో తీవ్ర పోటీ ఉంటుందని ఆత్మసాక్షి గ్రూప్ నివేదికలో పేర్కొన్నారని విశ్లేషణకు సంబంధించిన వీడియోలు స్పష్టంగా చెబుతున్నాయి.
తెలుగుపోస్ట్ ఈ సర్వేకు సంబంధించి మరింత స్పష్టత కోసం ఆత్మసాక్షి గ్రూప్ని సంప్రదించగా.. ఆత్మసాక్షి ఒరిజినల్ సర్వే రిపోర్టులో టీడీపీ/జేఎస్పీ/బీజేపీ కూటమి 50 సీట్లు, వైఎస్సార్సీ పార్టీ 93 సీట్లు, 32 సీట్లలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని చెప్పినట్లు మేము గుర్తించాం.
పూర్తీ వివరాలను మీరు ఇక్కడ గమనించవచ్చు.
ఒరిజినల్ సర్వే రిపోర్టును.. ఆత్మసాక్షి గ్రూప్ సర్వే పేరుతో నకిలీ రిపోర్టును మీరు ఇక్కడ గమనించవచ్చు.
కొంతమంది నకిలీ పోస్టులతో సోషల్ మీడియాలో ప్రజలలో గందరగోళం సృష్టిస్తూ ఉన్నారని శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ CEO, VR మూర్తి పేర్కొన్నారు. తప్పుదారి పట్టించే క్లెయిమ్లను నమ్మకండని ఆయన సూచించారు.
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ/బీజేపీ/జనసేన కూటమి 136 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆత్మసాక్షి సర్వేలో తేలిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు. అసలు సర్వే రిపోర్టులలోని సంఖ్యలను పూర్తిగా మార్చేశారు.
Claim : The Atmasakshi survey (Mood of Andhra Pradesh) conducted by SAS Group for the upcoming Andhra Pradesh assembly elections shows that the TDP/BJP/Janasena alliance appears to win 136 seats
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story