ఆంధ్రప్రదేశ్ లోని కొందరు పదవ తరగతి విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో 35 కన్నా తక్కువ మార్కులు వచ్చినప్పటికీ పాస్ అని ప్రకటించారా?
పదవ తరగతి ఫలితాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సోమవారం విడుదల చేసింది. మొత్తం రెగ్యులర్ విద్యార్థుల్లో 67.26శాతం పబ్లిక్ పరీక్షను పాసయ్యారని ప్రకటించింది. బాలురందరిలో 64.02 శాతం, బాలికలలో 70.70 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపింది.
పదవ తరగతి ఫలితాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సోమవారం విడుదల చేసింది. మొత్తం రెగ్యులర్ విద్యార్థుల్లో 67.26శాతం పబ్లిక్ పరీక్షను పాసయ్యారని ప్రకటించింది. బాలురందరిలో 64.02 శాతం, బాలికలలో 70.70 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపింది.
అయితే సోషల్ మీడియాలోని కొందరు యూజర్లు కొన్ని పోస్టులను షేర్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక విద్యార్థికి రెండు సబ్జెక్టులలో కేవలం 17, 11 మార్కులు వచ్చినప్పటికీ పాస్ చేశారని, మరో విద్యార్థికి 25 వచ్చినా ఫెయిల్ చేసి ఇంకో విద్యార్థినికి 22 మాత్రమే వచ్చినా పాస్ చేశారని వివరించారు. ఈ యూజర్లు ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యావ్యవస్థను నాశనం చేసిందని, మొత్తంమీద రెండులక్షల మంది ఫెయిల్ అయ్యారని ఆరోపించారు.
ఫ్యాక్ట్ చెక్:
నిజానికి, సోషల్ మీడియా యూజర్లు చెప్తున్నట్లుగానే రెండు సబ్జెక్టుల్లో 17, 11 మార్కులు వచ్చిన ఒక విద్యార్థిని, ఒక సబ్జెక్టులో 22 మార్కులు వచ్చిన మరో విద్యార్థినిని పాస్ అయినట్లుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, ఆ విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్లను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నందు పరిశీలించినపుడు వారిలో ఒక విద్యార్థి 13-SM అనే కోడ్ ఉన్న అవకరంతోనూ, మరో విద్యార్థి 2-HC అనే కోడ్ అవకరంతోనూ బాధ పడుతున్నారని తెలుస్తుంది.
ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు కొన్ని మినహాయింపులు, తగ్గింపులు ఇచ్చేందుకు వీలుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం GO MS No 14, SE (Prog II) Dept , Dated 31-01-2019ను రిలీజ్ చేసింది. అ తర్వాత Rights of Persons with Disability Act 2016 లోని అంశాలను బలపరుస్తూ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నందు కొన్ని ఏర్పాట్లను కేంద్రప్రభుత్వం చేసినందువలన.. వాటికి అనుగుణంగా GO MS No 14 స్థానంలో GO MS No 86 School Education (Prog II) Department, dated 29.12.2021 ను అమలు చేయాలని ఆదేశించింది. Andhra Pradesh Residential Educational Institutes Society వారి వెబ్ సైట్ లో ఉన్న ఆ GO MS No 86 ను ఈ లింక్ లో చదవవచ్చు.
https://apreis.apcfss.in/
ఆ GO MS No 86 ప్రకారం అవకరంని బట్టి, మినహాయింపులని, తగ్గింపులని వాద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించింది. అందులో అవకరం SM అంటే.. ఆ విద్యార్థి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, HC అంటే ఆ విద్యార్థి సెరిబ్రల్ పాల్సీ తో బాధ పడుతున్నాడని.. వీరు పరీక్షలలో 35 కు బదులుగా 10 మార్కులు సాధిస్తే చాలు పాస్అయినట్లుగా ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
కాబట్టి, ప్రకారం ఈ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు 35 కన్నా తక్కువ మార్కులు వచ్చినా, వారి పాస్ మార్కులు 10 కన్నా ఎక్కువే సాధించినందువల్ల GO MS No 86 School Education (Prog II) Department, dated 29.12.2021 ప్రకారం వారికి పాస్ అయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
Claim: పదవతరగతి పరీక్షల్లో 35 కన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను కొందరిని ప్రభుత్వం పాస్ చేసింది, విద్యావ్యవస్థను నాశనం చేసింది.
Claimed By: సోషల్ మీడియా యూజర్లు.
Fact Check: False.