Mon Dec 23 2024 18:59:31 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఐస్ క్రీం ఉత్పత్తులలో ఉపయోగించే కృత్రిమ వనిల్లా ఎసెన్స్‌లో బీవర్ విసర్జన పదార్ధం ఉండదు
బేకింగ్‌లో సాధారణంగా ఉపయోగించే పదార్ధం వనిల్లా ఎసెన్స్. ఇవి ఆయా ఉత్పత్తులకు రుచి, తీపి, వాసనను కలిగిస్తాయి.
Claim :
ఐస్ క్రీమ్‌లు, కేకులు మొదలైన వాటిలో ఉపయోగించే కృత్రిమ వనిల్లా ఎసెన్స్‌ను బీవర్లు విసర్జించే వ్యర్థాల నుండి తయారు చేస్తారు.Fact :
ఐస్ క్రీమ్లలో ఉపయోగించే కృత్రిమ వనిల్లా ఎసెన్స్‌ను ల్యాబ్‌లో సింథటిక్‌గా తయారు చేస్తారు. బీవర్లు విసర్జించే వాటి నుండి తీసుకోరు.
బేకింగ్‌లో సాధారణంగా ఉపయోగించే పదార్ధం వనిల్లా ఎసెన్స్. ఇవి ఆయా ఉత్పత్తులకు రుచి, తీపి, వాసనను కలిగిస్తాయి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. కాలిన గాయాలకు చికిత్స చేయడానికి కూడా సహాయపడుతుంది. వనిల్లా ఎసెన్స్ పెర్ఫ్యూమ్ తయారీ, లోషన్లు మొదలైన వాటిలో సువాసన తీసుకుని రావడానికి ఉపయోగిస్తారు. వనిల్లా సారం కాక్టెయిల్లలో సూక్ష్మమైన తీపి, రుచిని జోడించడానికి కూడా ఉపయోగిస్తారు. రుచికరమైన వంటలకు వనిల్లా
ABPlive వెబ్సైట్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఐస్ క్రీమ్‌లు, బిస్కెట్లు మొదలైన వాటిలో సాధారణంగా ఉపయోగించే వనిల్లా ఎసెన్స్ బీవర్ అనే జంతువు నుండి సేకరిస్తారని పేర్కొంది. ఈ పదార్ధాన్ని కాస్టోరియం అని పిలుస్తారని, ఇది బీవర్ పాయువు దగ్గర గ్రంధుల ద్వారా ఉత్పత్తి చేయబడుతుందని తెలిపింది. అంతేకాకుండా సువాసనను కూడా ఇస్తుందని కథనంలో తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఐస్‌క్రీమ్‌లు, ఇతర ఉత్పత్తులలో ఉపయోగించే వనిల్లా ఎసెన్స్‌ను బీవర్ అని పిలిచే జంతువు మలద్వారం నుండి సేకరిస్తారనే వాదన తప్పు.
మేము వనిల్లా మూలం గురించి శోధించినప్పుడు, వనిల్లా మెక్సికోలో ఉద్భవించిందని తెలుసుకున్నాం. వనిల్లా ఆర్చిడ్ మొక్క నుండి తీసుకున్నారని మేము కనుగొన్నాము. వనిల్లా అనేది చిన్నటి తీగ దీని పొడవు 15 మీటర్ల వరకు ఉంటుంది. మందపాటి కాండం, ఆకుపచ్చ-పసుపు పుష్పాలను కలిగి ఉంటుంది. సన్నని కాయలు వేలాది చిన్న, నల్లని గింజలు ఉంటాయి. వనిల్లా గింజలను క్రీమ్, కస్టర్డ్ ఆధారిత సాస్‌లు, మిఠాయిలతో సహా ఆహారంలో సువాసన కారకాలుగా ఉపయోగిస్తారు. వనిల్లా బీన్స్ ను ఎలా తీస్తారో చూపించే ప్రక్రియకు సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది.

మేము సంబంధిత కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు. బీవర్ క్యాస్టర్ శాక్ల నుండి సేకరించిన కాస్టోరియం, కృత్రిమ సారం వస్తుందనేది నిజం కాదని తెలిపే కొన్ని కథనాలను మేము కనుగొన్నాము.
బిజినెస్ ఇన్‌సైడర్‌లో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం, ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలోని ఫ్లేవర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ రాబర్ట్ జె మెక్గోరిన్ ఈ వాదనను ఖండించారు. కృత్రిమ వనిల్లాను సింథటిక్ వెనిలిన్తో తయారు చేస్తారని వివరించారు. ఈ సింథటిక్ వెనిలిన్ ప్రధానంగా లవంగం నూనెలోని ప్రధాన పదార్ధమైన యూజీనాల్ నుండి ల్యాబ్ లలో ఉత్పత్తి చేస్తారు. కాస్టోరియం బీవర్ యొక్క పాయువు నుండి కూడా రాదని కథనం పేర్కొంది. ఇది జంతువులోని ఆముదపు సంచుల నుండి వస్తుంది. US FDA కూడా కాస్టోరియంను 'సాధారణంగా సురక్షితమైనది'గా పేర్కొన్నప్పటికీ, కృత్రిమ సువాసనలో కాస్టోరియం ఉపయోగం చాలా అరుదని తెలిపింది.
నేషనల్ జియోగ్రాఫిక్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం వెనిలా ఐస్ క్రీంలో బీవర్ స్రావాలు ఉండటం చాలా అరుదని పేర్కొంది. కాస్టోరియం ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని, పెర్ఫ్యూమ్లు, ఆహారం మరింత రుచి ఉండడానికి ఉపయోగించరని కూడా గుర్తించాం. కాస్టోరియం చాలా ఖరీదైనది, అరుదైనది. దాని వెలికితీత ప్రక్రియ కూడా సంక్లిష్టమైనది, హానికరమైనది.
యాంటీ అడిటివ్ క్లీన్ లేబుల్ ఆర్గనైజేషన్‌లో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం.. 2013 నుండి, సంవత్సరానికి 300 పౌండ్ల కాస్టోరియం మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని తెలిపింది. ఐస్ క్రీం, ఇతర ఉత్పత్తులలో ఉపయోగించే కృత్రిమ వనిల్లా ఎసెన్స్‌లో బీవర్ విసర్జన పదార్ధం ఉంటుందనే వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim : ఐస్ క్రీమ్‌లు, కేకులు మొదలైన వాటిలో ఉపయోగించే కృత్రిమ వనిల్లా ఎసెన్స్‌ను బీవర్లు విసర్జించే వ్యర్థాల నుండి తయారు చేస్తారు.
Claimed By : Mainstream media
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Mainstream Media
Fact Check : False
Next Story