Tue Nov 05 2024 19:53:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి మంటలు అంటుకోలేదు.
ఆ సమయంలో టపాసులు కాల్చగా నిప్పు రవ్వలు ఎగిరి డీజే వెహికల్లోని జనరేటర్ మీద
Claim :
మిలాద్ ఊరేగింపు సందర్భంగా చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి మంటలు వ్యాపించాయిFact :
అక్కడ ఉన్న డీజే సిస్టంకు మంటలు అంటుకున్నాయి. వాటిని కొద్దిసేపటికి పోలీసులు ఆర్పివేశారు
మిలాద్-ఉన్-నబీ.. ప్రవక్త ముహమ్మద్ జయంతిని సూచిస్తుంది. హిజ్రీ క్యాలెండర్లోని మూడవ నెల రబీ ఉల్ అవల్ నెల 12వ రోజున జరుపుకుంటారు. ఈ సందర్భంగా ముస్లింలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక నమాజులు, ఊరేగింపులు వంటివి నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలో మిలాద్-ఉన్-నబీని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ జయంతిని పురస్కరించుకుని జంటనగరాల్లో నిర్వహించే ఊరేగింపుల్లో వేలాది మంది ముస్లిం యువకులు, పెద్దలు పాల్గొంటారు.
ఈ సంవత్సరం మిలాద్-ఉన్-నబీ వేడుకలు సెప్టెంబర్ 16న గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డితో జరిగిన సమీక్షా సమావేశంలో మిలాద్ కమిటీలు, ముస్లిం పెద్దలు మిలాద్ ఊరేగింపులను సెప్టెంబర్ 19, గురువారానికి రీషెడ్యూల్ చేయడానికి అంగీకరించారు. సున్నీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (SUFI) నాయకత్వంలో, ప్రవక్త ముహమ్మద్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ పాతబస్తీలో ఐదు మిలాద్ ఊరేగింపులు నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 18, 2024 బుధవారం రాత్రి మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాద్ ఊరేగింపును ఎన్నో ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 19, గురువారం నాడు ప్రశాంతంగా ముగిసింది. వేలాది మంది ముస్లింలు పాల్గొన్న ఈ ఊరేగింపు వివిధ రంగుల జెండాలను ఊపుతూ నగరంలోని పలు ప్రాంతాల మీదుగా సాగింది. ఊరేగింపు అంతటా భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు.
మిలాద్ ఊరేగింపు సందర్భంగా కొందరు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్య లక్ష్మి అమ్మవారి ఆలయంపై దాడికి తెగబడ్డారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూ ఉంటే ఏమి చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 18, 2024 బుధవారం రాత్రి మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాద్ ఊరేగింపును ఎన్నో ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 19, గురువారం నాడు ప్రశాంతంగా ముగిసింది. వేలాది మంది ముస్లింలు పాల్గొన్న ఈ ఊరేగింపు వివిధ రంగుల జెండాలను ఊపుతూ నగరంలోని పలు ప్రాంతాల మీదుగా సాగింది. ఊరేగింపు అంతటా భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు.
మిలాద్ ఊరేగింపు సందర్భంగా కొందరు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్య లక్ష్మి అమ్మవారి ఆలయంపై దాడికి తెగబడ్డారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూ ఉంటే ఏమి చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భాగ్యలక్ష్మి ఆలయంపై ఎలాంటి దాడి జరగలేదు. ఆలయానికి మంటలు కూడా అంటుకోలేదు.
మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర మంటలు అంటుకున్నాయి కానీ, ఆలయానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పలు మీడియా సంస్థల నివేదికలను కనుగొన్నాం.
https://hyderabadmail.com/
https://telugu.timesnownews.
ఇండియా సున్నీ యునైటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును నిర్వహించారు. ఆ సమయంలో టపాసులు కాల్చగా నిప్పు రవ్వలు ఎగిరి డీజే వెహికల్లోని జనరేటర్ మీద పడ్డాయి. దీంతో ఆ సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కొద్దిసేపటికే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని మీడియా నివేదికలు తెలిపాయి.
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కొందరు యువకులు పోలీసుల వైపు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
ఈ పరిణామాలపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కూడా స్పందించారు. చార్మినార్ వద్ద ఎలాంటి లాఠీచార్జి జరగలేదని, చార్మినార్ వద్ద మిలాద్ నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే వాహనంలో మంటలు చెలరేగాయని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేసి, జనాలను దూరంగా పంపించామని చెప్పారు. కొందరు యువకులు ముందుకు దూసుకొచ్చారని.. వారిని కూడా వెనక్కి పంపించడం జరిగిందని తెలిపారు. లాఠీ చార్జ్ అని వస్తున్న పుకార్లనీ నమ్మద్దని కోరారు.
"ఈ రోజు తెల్లవారుజాము వరకు మిలాద్ బందోబస్త్, జులూస్ లో పాల్గొన్న వారు తిరిగి తమ ప్రాంతాలు చేరుకునే సమయంలో ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టాం. మన నగరంలో ఉన్న మిశ్రమ సంస్కృతి, మత సామరస్యం ప్రతిభంబిస్తూ - అతి పెద్ద ఊరేగింపులు కలిగిన ఈ రెండు పండగలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రజలందరికి మరియు 15 రోజులుగా మాతో కలిసి సహకరించిన ఇతర డిపార్ట్ మెంట్స్ వారికి సిటి పోలీస్ తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. సిటి పోలీస్ లో ఉన్న అధికారులు, సిబ్బంది పూర్తి అలిసిపోయినందున కొంత విశ్రాంతి అవసరం" అంటూ హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ చేసిన ట్వీట్ ను కూడా మేము గుర్తించాం.
భాగ్యలక్ష్మి ఆలయానికి మంటలు అంటుకున్నట్లుగా ఎలాంటి మీడియా కథనాలు కూడా మాకు కనిపించలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : మిలాద్ ఊరేగింపు సందర్భంగా చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి మంటలు వ్యాపించాయి
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story