నిజ నిర్ధారణ: భారత దేశంలోని మొబైల్ సర్వీస్ కస్టమర్లందరికీ ఉచిత రీఛార్జ్ అందిస్తున్నామని నకిలీ వార్తలతో బీజేపీ ప్రభుత్వం వినియోగదారులను మోసం చేస్తోంది అన్న మాట అవాస్తవం
భారత దేశంలోని మొబైల్ సర్వీస్ కస్టమర్లందరికీ ఉచిత రీఛార్జ్ అందిస్తున్నామని నకిలీ వార్తలతో బీజేపీ ప్రభుత్వం వినియోగదారులను మోసం చేస్తోంది అన్న మాట అవాస్తవం
Claim :
భారతీయ మొబైల్ సర్వీస్ కస్టమర్లకు బీజేపీ ప్రభుత్వం మూడు నెలల ఉచిత రీఛార్జ్‌ను అందించనుందిFact :
బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ఉచిత రీచార్జ్‌ను అందించడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నకలిది.
భారతీయ జనతా పార్టీ 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ మొబైల్ సర్వీస్ కస్టమర్లందరికీ మూడు నెలల ఉచిత రీఛార్జ్‌ను అందజేస్తోందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాట్స్ ఆప్ లో ప్రచారం అవుతన్న ఈ సందేశం చివరిలో ఒక వెబ్సైట్ లింక్ కూడా ఉంది.
2024 ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించి బీజేపీకి ఓటు వేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలోని మొబైల్ వినియోగదారులందరికీ 3 నెలల ఉచిత రీఛార్జ్‌ను అందిస్తున్నారనే సందేశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 'ఉచిత రీఛార్జ్ పొందడానికి క్రింది లింక్‌ను క్లిక్ చేయండి' అని క్యాప్షన్ ఇచ్చి, ఈ సదుపాయాన్ని పొందేందుకు చివరి తేదీ 16 నవంబర్ 2023 అని పోస్ట్‌లో రాశారు.
ఫ్యాక్ట్ చెక్
భారతీయ మొబైల్ సర్వీస్ కస్టమర్లకు మూడు నెలల పాటు ఉచిత రీఛార్జ్ అందించడం గురించి కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రచారమవుతున్న వార్త అబద్ధం.
మేము "బీజేపి ఫ్రీ రీఛార్జ్ యోజన" అనే కీవర్డ్ ద్వారా వార్తలో ఏమైనా నిజం ఉందా అని శోధించాము. మేము శోధించినప్పుడు అలాంటి వార్తలేవి కనబడలేదు.
బీజేపి అధికారిక వెబ్సైట్ "". అయితే, రీఛార్జ్ ఆఫర్ సందేశంతో వెబ్సైట్ యొక్క ఊఋళ్ భిన్నంగా ఉంటుంది. కనీసం బీజేపి అధికారిక పేజీలో ఏమైనా వార్తలు దొరుకుతాయా అని వెతికినా ఫలితం లేకపోయింది. అంతే కాదు ప్రకటనలో ఉన్న లింక్ "" ని క్లిక్ చెస్తే వేరొక పేజీ వచ్చింది. ఆ పేజిలో ఉన్న బీజేపి బ్యానర్‌ని ఫోటోషాప్ లో ఎటిట్ చేసి అక్కడ అమర్చారు. ఇది మాత్రమే కాదు, ప్రచారణలో పేర్కొన్న వెబ్సైట్ డొమైన్ పేరు భారతదేశానికి చెందినది కాదు. ప్రకటనలో కనబడుతున్న వెబ్సైట్ డొమైన్ నేమ్ యూఎస్ కు చందినది.
ఇలాంటి తప్పుడు సందేశాల వల్ల డేటా దొంగతనం జరిగే అవకాశాలు ఉన్నాయి, అలాగే మన ప్రైవేట్ సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్త వహించండి. అలాంటి సందేశాలను ఎవరికీ పంపవద్దని ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ (పీఐబీ) సూచించింది. ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ తన అధికారిక X ఖాతాలో దీనికి సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని, అన్ని చోట్లా వ్యాపిస్తున్న వార్తలు అవాస్తవం అనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటన విడుదల చేసారు.
కాబట్టి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సందేశం అబద్దం. బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ఉచిత రీచార్జ్‌ను అందించడం లేదు.