Thu Nov 07 2024 10:30:09 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కేరళలోని ఏ హిందూ దేవాలయాన్ని కూడా రాహుల్ గాంధీ సందర్శించలేదని బీజేపీ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమైంది. ఫిబ్రవరి 2023 నాటికి 12 రాష్ట్రాల గుండా వెళుతుంది. పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రముఖులు ఈ పాదయాత్రలో భాగమయ్యారు.

ఈ యాత్రకు సంబంధించి పలు కథనాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ యాత్రను చుట్టుముట్టిన పలు వివాదాలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అమిత్ మాల్వియా, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కేరళ-తమిళనాడు రాష్ట్రాలలో ఒక్క హిందూ దేవాలయాన్ని కూడా సందర్శించలేదని ట్వీట్ చేశారు.
కాథలిక్ తల్లి, పార్సీ తండ్రి కొడుకు అయిన రాహుల్ గాంధీ హిందువుగా ఫ్యాన్సీ డ్రెస్సింగ్ డ్రామాను ఆపాలని, యాత్ర సమయంలో కేరళ, తమిళనాడుల్లో ఉన్నప్పుడు ఒక్క హిందూ దేవాలయాన్ని కూడా సందర్శించ లేదని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ మత స్థలాలను మాత్రమే సందర్శించారని అన్నారు. (Rahul Gandhi, son of a Catholic mother and a Parsi father, should stop this fancy dress drama in Hindi heartland. When in Kerala or TN, he never bothered to visit a single Hindu temple. Visited minority religious places though. His beliefs change depending on electoral maths…)

ఫ్యాక్ట్ చెకింగ్:
భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. కన్యాకుమారిలోని వివేకానంద స్మారకాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో షేర్ చేసింది.
రాహుల్ గాంధీ పాస్టర్ జార్జ్ పొన్నయ్యను, పులియూర్కురిచిలో మరికొందరు ఫాదర్లు, ఆర్చ్ బిషప్‌లను కలిశారు. ఎర్నాకులంలోని అలువాలోని పరంబయం జుమా మసీదును, త్రిస్సూర్‌లోని వడక్కంచెరిలోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ ఫోరేన్ చర్చ్‌ను కూడా ఆయన సందర్శించారు.
గాంధీ తమిళనాడులోని హిందూ దేవాలయాలను సందర్శించిన ఇతర చిత్రాలు లేదా వీడియోలు మాకు కనిపించలేదు.
సెప్టెంబర్ 10న భారత్ జోడో యాత్ర కేరళకు చేరుకోగా.. ఇక్కడ, గాంధీ తిరువనంతపురంలోని కన్నమ్మూల చట్టంబి స్వామి ఆలయాన్ని, అలప్పుజలోని చేరాలలోని తురవూర్ మహాక్షేత్రం ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్‌లో షేర్ చేసింది.
https://www.youtube.com/shorts/HKr2mu6ulcs
కొల్లాంలోని వల్లిక్కవులోని మాతా అమృతానందమయి ఆశ్రమంను సందర్శించారు. శివగిరి మఠానికి చెందిన స్వాములను కూడా గాంధీ కలిశారు
దీంతో రాహుల్ గాంధీ కేరళలోని హిందూ దేవాలయాలను సందర్శించడం లేదన్న వాదనలు అబద్ధమని తేలిపోయింది. రాహుల్ గాంధీ తమిళనాడులోని హిందూ దేవాలయాలను సందర్శించిన వీడియోలు లేదా చిత్రాలు మేము గుర్తించలేకపోయాం, అయితే కేరళలో కొన్ని హిందూ దేవాలయాలను సందర్శించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అమిత్ మాలవీయ చేసిన వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
https://www.youtube.com/

Claim : Rahul Gandhi did not visit a single Hindu temple in Kerala or Tamil Nadu during the Bharat Jodo Yatra
Claimed By : BJP IT head Amit Malviya
Claim Reviewed By : Telugupost Network
Claim Source : BJP IT head Amit Malviya
Fact Check : Misleading
Next Story