Wed Nov 13 2024 02:31:25 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కమ్మసామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఎలాంటి లేఖ రాయలేదు
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. 2014లో తెలంగాణ ఆవిర్భవించిన
Claim :
తెలంగాణలోని కమ్మ సామాజికవర్గం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు లేఖ రాశారుFact :
వైరల్ అవుతున్న లేఖలో ఎలాంటి నిజం లేదని టీడీపీ తెలిపింది
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రజలు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖ ఒకటి ప్రచారంలో ఉంది.
“*కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు లేఖ*” అంటూ ఈ లేఖకు సంబంధించి పలువురు పోస్టులు పెట్టారు.
“*కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు లేఖ*” అంటూ ఈ లేఖకు సంబంధించి పలువురు పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు నాయుడు లేఖలేవీ రాయలేదు.‘జగన్ కి ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ ఫేక్ లెటర్ చెబుతోంది. కుల అహంకారంతో విర్రవీగే జగన్ రెడ్డి... రాజకీయ ప్రయోజనాల కోసం అదే కులాలను రెచ్చగొడతాడు. ప్రజలారా! ఈ ఫేక్ గాళ్ళ మాటలను, చేతలను నమ్మకండి.’ అంటూ తెలుగుదేశం పార్టీ ఈ లేఖను ఖండిస్తూ పోస్టు చేసింది.
తెలుగులో ప్రచురితమైన వార్తాకథనాల ప్రకారం.. నకిలీ లేఖ సర్క్యులేషన్పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సైబర్ పోలీసులను డిమాండ్ చేశారు. టీడీపీ ప్రతినిధి ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవితను కలిసి ఫిర్యాదు చేశారు.
2023 నవంబర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో చెలామణిలో ఉన్న లేఖ ఫేక్. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Chandrababu Naidu writes a letter to the Kamma community in Telangana to support the Congress party during the elections
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story