Thu Dec 19 2024 18:27:07 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బీజేపీతో టీడీపీ పొత్తుపై చంద్రబాబు నాయుడు తన మద్దతుదారులకు ఎలాంటి లేఖ రాయలేదు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రూపకల్పన, ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్సీ పార్టీని ఎదుర్కొనేందుకు
Claim :
బీజేపీతో పొత్తు ఎన్నికల వరకు మాత్రమే ఉంటుందని చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యకర్తలకు, అనుచరులకు లేఖ రాశారుFact :
చంద్రబాబు నాయుడు అలాంటి లేఖ ఏదీ రాయలేదు. చలామణిలో ఉన్న లేఖ నకిలీది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రూపకల్పన, ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్సీ పార్టీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకుంది. తాజాగా పల్నాడు జిల్లాలో జరిగిన ప్రజా గళం బహిరంగ సభలో మూడు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఎన్డిఏ కూటమికి దూరంగా ఉన్నారు. అయితే 2024 ఎన్నికల సమయంలో బీజేపీతో చంద్రబాబు నాయుడు చేరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుచరులను ఉద్దేశించి రాసిన ఒక లేఖ అంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. టీడీపీకి- బీజేపీతో పొత్తు ఎన్నికల వరకు మాత్రమే ఉంటుందంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్లో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది.
BREAKING: ఎన్నికల వరకే భాజపాతో పొత్తు, తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు లేఖ.. అంటూ ఫేస్ బుక్ లో కూడా ఈ లెటర్ వైరల్ అవుతుంది.

ఎన్నికల వరకే భాజపాతో పొత్తు.
పోలవరానికి నిధులు ఇవ్వని కేంద్రాన్ని నిలదీస్తాం.. ఏపీకి ప్రత్యేక హోదాను ఎగ్గొట్టిన భాజపాను కడిగేస్తాం తెలుగు తమ్ముళ్లు సంయమనం పాటించాలి.. భాజపాతో పొత్తు విషయంలో ఎలాంటి ఆందోళన వద్దు.
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే విషయంలో పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. సీట్ల పంపకాలపై తుది చర్చలు ముగిసిన దృష్ట్యా.. ఎన్నికల ప్రచారంపై దృష్టిసారించాలి. గతంలో మనం విభేదించిన భారతీయ జనత పార్టీతో పొత్తు అనవసరం అని కొందరు భావిస్తున్నారు. కానీ, ఎన్నికల వరకే భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో తిరిగి ఎన్డీఏ కూటమి ఏర్పడితే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విభేదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏపీకి తలమానీకమైన పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వని భాజపా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పదేండ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తాం. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చకుండా భాజపా తీరని అన్యాయం చేసింది. తెలుగుదేశం పార్టీ స్పెషల్ ప్యాకేజీని ఒప్పుకోలేదు. చివరి వరకు ప్రత్యేక హోదా కోసమే పోరాటం చేసింది. హైదరాబాద్ వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజీ పేరుతో రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టిన కేంద్రాన్ని ఆంధ్రా ప్రజలు మర్చిపోలేదు. మూడు పార్టీల మధ్య స్నేహపూర్వక బంధం ఎన్నికల వరకు మాత్రమే కొనసాగుతుంది. తెదేపా శ్రేణులు, తెలుగు తమ్ముళ్లు కూటమి గెలుపు కోసం కృషి చేయాలి.
బీజేపీతో పొత్తు 2024 అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు మాత్రమే ఉంటుందని అందులో ఉంది.
టీడీపీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో లేఖ కోసం వెతికాము. మాకు అలాంటి పోస్ట్లు కనిపించలేదు. లేఖలో పేర్కొన్నట్లు టీడీపీ నేతలకు చంద్రబాబు నాయుడు నుండి ఎలాంటి లేఖ రాలేదు.
చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ను వెతికితే, బీజేపీకి మద్దతు తెలిపే పలు ట్వీట్లు కనిపించాయి. ఒక ట్వీట్లో ఎన్నికల తర్వాత కూడా కలిసి పనిచేస్తామని తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

మరో ట్వీట్ లో “మోదీ గారి నాయకత్వంలో ఎన్డీయే దేశంలో 400 సీట్లను గెలుచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని 25 సీట్లలో గెలిపించి మోదీ గారి సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోడానికి ప్రజలు సంకల్పించాలి.” అని తెలిపారు.
సర్క్యులేషన్లో ఉన్న లేఖకు సంబంధించిన లొకేషన్ కు సంబంధించిన వివరాలు ఏవీ లేవు. జాగ్రత్తగా గమనించినప్పుడు, లేఖలో 20-23-2024 తేదీ ఉందని, తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రచురించలేదని నకిలీదని నిర్ధారిస్తుంది.
బీజేపీతో పొత్తు ఎన్నికల వరకు మాత్రమే ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుచరులకు లేఖ రాశారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. చలామణిలో ఉన్నది ఫేక్ లెటర్.

Claim : Chandrababu Naidu wrote a letter to his followers that the alliance with BJP will last only till the elections
Claimed By : Facebook User
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story