Fri Nov 15 2024 11:51:19 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అమెరికా వంటి దేశాలు వద్దనుకున్న పోలియో డ్రాప్స్ ను గాజాలోని పిల్లలకు ఇచ్చారనే వాదన నిజం కాదు
పాలస్తీనా ఆరోగ్య అధికారులు, ఐక్యరాజ్యసమితి సంస్థలు గాజా స్ట్రిప్‌లో పోలియోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీకాల ప్రచారాన్ని ప్రారంభించాయి. పిల్లలు పోలియో బారిన పడకుండా చేయడానికి పలు సంస్థలు ఈ పోలియో డ్రైవ్ లో భాగమయ్యాయి.
Claim :
అమెరికా, ఇతర దేశాలు తిరస్కరించిన పోలియో చుక్కలను గాజాలోని పిల్లలకు అందించారుFact :
గాజాలోని పిల్లలు nOPV2 వ్యాక్సిన్‌ను స్వీకరించారు. ఇది ఓరల్ పోలియో వైరస్ వ్యాక్సిన్
పాలస్తీనా ఆరోగ్య అధికారులు, ఐక్యరాజ్యసమితి సంస్థలు గాజా స్ట్రిప్‌లో పోలియోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీకాల ప్రచారాన్ని ప్రారంభించాయి. పిల్లలు పోలియో బారిన పడకుండా చేయడానికి పలు సంస్థలు ఈ పోలియో డ్రైవ్ లో భాగమయ్యాయి.
ఈ ప్రచారాన్ని మరింత మందికి చేరవేయడానికి ఇజ్రాయెల్ పోరాటాన్ని నిలిపివేయడానికి అంగీకరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గాజా 25 సంవత్సరాలలో మొదటి పోలియో కేసును చూసింది, 10 నెలల బాలుడు ఒక కాలు పక్షవాతానికి గురైనందున WHO పోలియో డ్రాప్స్ పిల్లలకు తప్పకుండా ఇవ్వాలని సూచించింది. ఇప్పుడు ఒక్క కేసు మాత్రమే బయట పడి ఉందని అనుకుంటూ ఉండగా.. కొన్ని వందల మంది పిల్లలు పోలియో వ్యాధి బారిన పడి ఉండవచ్చని WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది.
WHO, UNICEF, పాలస్తీనా శరణార్థుల కోసం UN యొక్క ఏజెన్సీ UNRWA ద్వారా టీకా ప్రచారం ప్రారంభించారు. సెప్టెంబర్ 1, 2024 న గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో, చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ముఖ్యంగా X వినియోగదారులు టీకాలకు సంబంధించి పలు పోస్టులు పెట్టారు.
'గాజా పిల్లలు USA వంటి దేశాలు తిరస్కరించిన ఒక రకమైన పోలియో వ్యాక్సిన్‌ని స్వీకరిస్తున్నారు. ఎందుకంటే ఇది పోలియోతో సహా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.' అంటూ ఆ పోస్టుల్లో తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. గాజాలోని పిల్లలకు nOPV2 (నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ రకం 2) అందిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాలో ఉపయోగించిన వ్యాక్సిన్ nOPV2 అని ప్రకటించింది. ఇది మునుపటి OPVలో ఉపయోగించిన బలహీనమైన వైరస్ మ్యుటేషన్‌గా పోలియో వ్యాప్తి చెందే ప్రమాదాన్ని అధిగమించడానికి ప్రత్యేకంగా రూపొందించారు, కొత్తగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అని తెలిపారు.
WHO వెబ్సైట్లో ఆగస్టు 16, 2024న ప్రచురించిన ప్రకటన ప్రకారం వ్యాక్సిన్ వేసే పరిస్థితుల్లో ప్రతి రౌండ్ సమయంలో, పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఐక్యరాజ్యసమితి పిల్లల నిధి (UNICEF) సహకారంతో, యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (UNRWA) ఆధ్వర్యంలో పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 640 000 మంది పిల్లలకు రెండు చుక్కల nOPV2 వ్యాక్సిన్ ని అందజేస్తుంది.
BBC ఆగష్టు 30, 2024న ప్రచురించిన కథనాన్ని కూడా పరిశీలించాం. nOPV2 వ్యాక్సిన్ కు సంబంధించిన దాదాపు 1.26 మిలియన్ డోస్‌లు ఇప్పటికే గాజాలో ఉన్నాయని, 400000 అదనపు డోసులు త్వరలో రానున్నాయని పేర్కొంది. గాజాలో వైరస్ వ్యాప్తిని ఆపడానికి అవసరమైన 90% వ్యాక్సిన్ కవరేజీని సాధించాలని WHO లక్ష్యంగా పెట్టుకుంది. టీకాల కోసం అదనంగా ఒకరోజు యుద్ధానికి విరామం కూడా ఇస్తామని ఒప్పందంలో ఉందని తెలుస్తోంది.
సెప్టెంబర్ 1, 2024న నుసిరత్‌లో ప్రారంభమైన టీకా ప్రచారానికి సంబంధించిన అనేక చిత్రాలను కూడా URWA షేర్ చేసింది.
ఐక్యరాజ్యసమితి వ్యాక్సినేషన్ ప్రచారానికి సంబంధించిన కొన్ని చిత్రాలను “Children in Gaza children have begun receiving the life-saving polio vaccine. Teams are administrating vaccines in 28 @UNRWA facilities in the middle area of Gaza. Health workers are also going tent to tent as they attempt to reach vulnerable” క్యాప్షన్‌తో షేర్ చేసింది. గాజాలోని పిల్లల ప్రాణాలను రక్షించే పోలియో వ్యాక్సిన్‌ను అందుకోవడం ప్రారంభించారు. గాజా మధ్య ప్రాంతంలో ఉన్న 28 UNRWA ఫెసిలిటీ సెంటర్లలో బృందాలు టీకాలు అందిస్తూ ఉన్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
గాజాలోని పిల్లలు అందుకున్న పోలియో వ్యాక్సిన్‌ను USA మొదలైన దేశాలు తిరస్కరించాయనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్తగా అభివృద్ధి చేసిన nOPV2 పోలియో వ్యాక్సిన్‌ను గాజాలోని పిల్లలకు అందిస్తున్నాయి.
Claim : అమెరికా, ఇతర దేశాలు తిరస్కరించిన పోలియో చుక్కలను గాజాలోని పిల్లలకు అందించారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story