Sat Nov 23 2024 04:18:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌పై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చండీగఢ్ విమానాశ్రయంలో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ని 2024 జూన్‌లో చెంపదెబ్బ కొట్టారు. విమానాశ్రయంలోని సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో ఆమె కంగనాపై చేయి చేసుకుంది.
Claim :
కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ను విధుల్లోకి తీసుకున్నారుFact :
కుల్విందర్ కౌర్‌ను సీఐఎస్ఎఫ్ విధుల్లోకి తీసుకోలేదు. వైరల్ అవుతున్న వాదనలు అవాస్తవం
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చండీగఢ్ విమానాశ్రయంలో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ని 2024 జూన్‌లో చెంపదెబ్బ కొట్టారు. విమానాశ్రయంలోని సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో ఆమె కంగనాపై చేయి చేసుకుంది.
కంగనా రనౌత్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ పని చేశానని కుల్విందర్ కౌర్ తెలిపారు. రైతుల నిరసన సందర్భంగా కంగనా చేసిన ప్రకటనల కారణంగా కౌర్ ఆమెపై దాడి చేశారు. ఘటన అనంతరం కౌర్‌పై దాడి కేసు నమోదు చేసి ఆమెను సస్పెండ్ చేసి అంతర్గత విచారణ చేపట్టారు.
వీటన్నింటి మధ్య, కౌర్‌ను CISFలోకి తిరిగి చేర్చుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు ప్రచారంలో ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను ఇంకా తిరిగి విధుల్లోకి చేర్చలేదు.
మేము ఈ సమస్య గురించి సంబంధిత వార్తా కథనాన్ని వెతకగా.. CISF ఈ వదంతులను ఖండించింది. ఆమె ఇప్పటికీ సస్పెన్షన్ లో ఉందని.. శాఖాపరమైన విచారణ ఇంకా కొనసాగుతోందని మేము కనుగొన్నాము.
ANI X ఖాతాలో CISF ప్రకటనను ప్రచురించింది. “CISF constable Kulwinder Kaur, who allegedly slapped BJP MP Kangana Ranaut, is still suspended and a departmental inquiry against her is still on: CISF” అంటూ పోస్టు ఉంది. "BJP MP కంగనా రనౌత్‌ను కొట్టిన CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఇప్పటికీ సస్పెన్షన్ లోనే ఉంది. ఆమెపై శాఖాపరమైన విచారణ ఇంకా కొనసాగుతోంది: CISF" అంటూ సిఐఎస్ఎఫ్ ప్రకటన ఉంది.
కౌర్‌ని బెంగళూరుకు బదిలీ చేసినట్లు కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయని.. అయితే కౌర్‌ను విధుల్లోకి తిరిగి చేర్చుకోలేదని.. ఆమె సస్పెన్షన్‌లో ఉందని, శాఖాపరమైన విచారణ ఇంకా కొనసాగుతోందని CISF స్పష్టం చేసిందని బిజినెస్ స్టాండర్డ్‌లో ఓ కథనం పేర్కొంది.
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చెంప దెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ని తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్నారనే వాదన అవాస్తవం. ఆమె ఇప్పటికీ సస్పెన్షన్ లోనే ఉంది. ఆమె చర్యలకు సంబంధించి విచారణ జరుగుతోంది.
Claim : కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ను విధుల్లోకి తీసుకున్నారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story