Wed Jan 15 2025 11:18:38 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సరికొత్తగా తీసుకుని వచ్చిన ప్రెగ్నెన్సీ కిట్ లలో తండ్రి ఎవరో చెప్పగలిగే టెక్నాలజీ వచ్చిందా?
ఓ ప్రెగ్నెన్సీ కిట్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా తండ్రి ఎవరో కూడా తెలుసుకోవచ్చని అంటున్నారు. ఒక వ్యక్తి ముఖాన్ని చూపించే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కు సంబంధించిన చిత్రం వైరల్గా మారింది.
ఓ ప్రెగ్నెన్సీ కిట్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా తండ్రి ఎవరో కూడా తెలుసుకోవచ్చని అంటున్నారు. ఒక వ్యక్తి ముఖాన్ని చూపించే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కు సంబంధించిన చిత్రం వైరల్గా మారింది. ఈ ప్రెగ్నెన్సీ కిట్ గర్భాన్ని నిర్ధారించడంతో పాటు తండ్రి గుర్తింపును కూడా బహిర్గతం చేస్తుందని చెబుతూ ఉన్నారు. కొందరు దీన్ని ఫన్నీగా తీసుకున్నారు. మరికొందరు అద్భుతమైన టెక్నాలజీ అని చెబుతూ పొగుడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ప్రెగ్నెన్సీ టెస్ట్లో తండ్రి ఎవరనేది తెలుస్తుందన్న వాదన అవాస్తవం. ఈ చిత్రం మార్ఫింగ్ చేశారని గుర్తించారు.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ చిత్రం తుల్సా హెల్త్ డిపార్ట్మెంట్ వంటి వెబ్సైట్లలో షేర్ చేశారని మేము కనుగొన్నాము. ఈ చిత్రాలలో తండ్రి ముఖాన్ని చూపించే స్క్రీన్ను చేర్చలేదు.
1976లో మొదటిసారి ఇంట్లోనే ఉండి ప్రెగ్నెన్సీని తెలుసుకునే కిట్లు ప్రవేశపెట్టారు. ఈ కిట్లు మానవ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (hCG)ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. మూత్రం ద్వారా ప్రెగ్నెసీని గుర్తిస్తారు.
పుట్టబోయే బిడ్డ తండ్రిని గుర్తించడానికి పూర్తిగా భిన్నమైన మార్కర్ని ఉపయోగిస్తారు. DNA పితృత్వ పరీక్షల ద్వారా తండ్రి ఎవరనే విషయం తెలుస్తుంది. నమూనాలను తండ్రి, పిల్లల నుండి విడివిడిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షను గర్భధారణ సమయంలోనూ, బిడ్డ పుట్టిన తర్వాత కూడా చేయవచ్చు.
DNA పితృత్వ పరీక్షని వివిధ పద్ధతుల్లో నిర్వహిస్తూ ఉంటారు.
కాబట్టి.. వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : New pregnancy test shows a picture of father
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story