Mon Dec 23 2024 11:22:21 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ ఫోటోలో ఉన్నది ఝాన్సీ లక్ష్మీ బాయి కాదు
ధైర్యసాహసాలకు ప్రతిరూపమైన రాణి లక్ష్మీ బాయి నవంబర్ 19, 1835న జన్మించారు. ఆమె 1857 నాటి భారతీయ తిరుగుబాటులో కీలక పాత్ర
Claim :
ఫోటోగ్రాఫర్ హాఫ్మన్ 159 సంవత్సరాల క్రితం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఫోటోను తీశారని, నిజమైన ఛాయాచిత్రం వైరల్ ఫోటోలో ఉందిFact :
వైరల్ చిత్రంలో ఉన్నది ఝాన్సీ లక్ష్మీబాయి నిజమైన ఛాయాచిత్రం కాదని చరిత్రకారులు ధృవీకరించారు.
ధైర్యసాహసాలకు ప్రతిరూపమైన రాణి లక్ష్మీ బాయి నవంబర్ 19, 1835న జన్మించారు. ఆమె 1857 నాటి భారతీయ తిరుగుబాటులో కీలక పాత్ర పోషించింది. ఆమె భారతదేశంలోని గొప్ప స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. ఝాన్సీ మహారాజు గంగాధర్ రావును వివాహం చేసుకున్నాక, ఊహించని పరిణామాలు జరిగాయి. మహారాజ్ మరణానికి ముందు వారు ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారు. అయితే, బ్రిటీష్ ప్రభుత్వం దత్తపుత్రుడిని వారసుడిగా గుర్తించడానికి నిరాకరించింది. లాప్స్ సిద్ధాంతానికి అనుగుణంగా ఝాన్సీని బ్రిటీష్ పాలనలో చేర్చుకుంది. అయితే ఝాన్సీని బ్రిటిష్ వారికి అప్పగించేందుకు రాణి నిరాకరించింది. ఆమె చాలా ధైర్యం, దృఢ సంకల్పంతో బ్రిటిష్ వారితో పోరాడింది.
స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి లక్ష్మీబాయి చిత్రం అని, 159 ఏళ్ల క్రితం హాఫ్మన్ అనే ఫోటోగ్రాఫర్ దీన్ని తీశారంటూ సోషల్ మీడియాలో ఓ మహిళ చిత్రం వైరల్ అవుతూ ఉంది. ఆగస్టు 19న భోపాల్‌లో జరిగిన వరల్డ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్లో ఈ ఫొటో ప్రదర్శించినట్లు తెలిపారు.
చాలా సంవత్సరాలుగా ఈ చిత్రం ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, వైరల్ చిత్రం రాణి లక్ష్మీ బాయిది కాదు.
భారతదేశంలో ఫోటోగ్రాఫర్ హాఫ్మన్ తీసిన చిత్రాల కోసం వెతకగా మేము ఆర్ట్బ్లార్ట్ అనే వెబ్‌సైట్‌ను కనుగొన్నాము. అందులో జాన్స్టన్, హాఫ్మన్ ట్యాగ్‌తో ఫోటోగ్రాఫర్ హాఫ్మన్ కలెక్షన్స్ కనిపించాయి.అందులో రాణి లక్ష్మీ బాయికి సంబంధించిన వైరల్ చిత్రాన్ని మేము కనుగొనలేకపోయాము. గెట్టి, అలమీ వంటి స్టాక్ చిత్రాల వెబ్ సైట్లలో కూడా మేము వైరల్ చిత్రాన్ని కనుగొనలేకపోయాము.
“c. 1840s: The Only Photo of Rani Lakshmibai (Jhansi Ki Rani) - one of the principal leaders of the Great Uprising of 1857 (India's First War of Independence). This picture was taken by the German photographer Hoffman when she might have been around 19 years of age.” అనే శీర్షికతో ఝాన్సీ లక్ష్మీ బాయి మరో చిత్రాన్ని షేర్ చేసిన X పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము. ఇదే ఝాన్సీ లక్ష్మీ బాయి ఫోటో అంటూ అందులో చెప్పుకొచ్చారు. 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తీసిన ఫోటో అంటూ కూడా అందులో తెలిపారు.
దీన్ని క్యూగా తీసుకుని “హాఫ్మన్ క్లిక్ చేసిన “ఝాన్సీ కి రాణి” అనే శీర్షికతో ABP న్యూస్ అప్లోడ్ చేసిన YouTube వీడియోని మేము కనుగొన్నాము. వీడియోలో, భోపాల్‌కు చెందిన ఒక ఫోటోగ్రాఫర్, వామన్ థాక్రే ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్లో ఒక ఫోటోను ప్రదర్శించారు, తన స్నేహితుడు అమీత్ అంబాలాల్ నుండి ఈ ఫోటోను 1,50,000 రూపాయలకు కొనుగోలు చేసినట్లు తేల్చి చెప్పారు. చిత్రం వెనుక దేవనాగరి, ఉర్దూలో రాణి పేరు ఉంది.
అయితే, జూన్ 2010లో ఇండియా టుడేలో ప్రచురించిన ఒక నివేదికను కూడా మేము కనుగొన్నాము, ఇది రాణి లక్ష్మీ బాయి అసలు చిత్రం అంటూ జరిగిన చర్చ గురించి ఉంది. ఆమెపై విస్తృత పరిశోధన చేసిన పలువురు చరిత్రకారుల ప్రకటనలు ఇందులో ఉన్నాయి. ఝాన్సీ లక్ష్మీబాయి ఫోటోలు తీయలేదని కొందరు వాదిస్తున్నారు. ఛాయాచిత్రాలు 1850 లలో తీయడం సాధారణమైన విషయమైతే కాదని పలువురు అభిప్రాయపడ్డారు.
తదుపరి పరిశోధనలో, లండన్‌లో ఝాన్సీ లక్ష్మీబాయి తరపున వాదించిన వృత్తిరీత్యా న్యాయవాది జాన్ లాంగ్ రాసిన పుస్తకం గురించిన కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. రాణిని ఒకసారి దగ్గరగా చూసి మాట్లాడే అవకాశం దొరికిందని జాన్ లాంగ్ తన ‘వాండరింగ్స్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో రాణి గురించి వివరించినట్లు కథనం పేర్కొంది.
అతను తన మాటలలో రాణి గురించి వివరించిన పుస్తకం పేజీల స్క్రీన్‌షాట్‌ను ఇక్కడ చూడవచ్చు.
కొన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు వైరల్ ఇమేజ్‌కి సంబంధించిన వాదనలను ఖండిస్తూ వాస్తవ తనిఖీలను కూడా ప్రచురించారని మేము కనుగొన్నాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చరిత్రకారుల ప్రకారం, వైరల్ చిత్రం ఝాన్సీ లక్ష్మీ బాయికి సంబంధించింది కాదు.
Claim : ఫోటోగ్రాఫర్ హాఫ్మన్ 159 సంవత్సరాల క్రితం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఫోటోను తీశారని, నిజమైన ఛాయాచిత్రం వైరల్ ఫోటోలో ఉంది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story