ఫ్యాక్ట్ చెక్: సిబిఐ దాడిలో ప్రణయ్ రాయ్ నిజం పేరు పర్వేజ్ రజా అని తెలిసిందనే ప్రచారం నిజం కాదు
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 7 సంవత్సరాల తర్వాత, అక్టోబర్ 2024లో మాజీ ఎన్డిటివి ప్రమోటర్లు, డైరెక్టర్లు ప్రణయ్ రాయ్, రాధికా

Claim :
ఎన్డిటివి మాజీ యజమాని ప్రణయ్ రాయ్ పై సిబిఐ దాడిలో అతని పేరు పర్వేజ్ రజా అని, కరాచీలో జన్మించాడని, అతని భార్య పేరు రహిలా అని తేలింది.Fact :
CBI నివేదికలు అటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు, అన్నీ తప్పుడు వాదనలు
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 7 సంవత్సరాల తర్వాత, అక్టోబర్ 2024లో మాజీ ఎన్డిటివి ప్రమోటర్లు, డైరెక్టర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లపై మోసం చేసినట్లు ఆరోపించిన కేసును సిబిఐ మూసివేసింది. 2017లో వీరిపై నమోదు చేసిన కేసును సిబిఐ మూసివేసింది. ఏడు సంవత్సరాల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత కూడా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో సిబిఐ కేసును మూసి వేయాల్సి వచ్చింది. కేసు క్లోజర్ రిపోర్టులో కూడా ఇదే విషయాన్ని సిబిఐ అధికారులు స్పష్టం చేశారు.
ఇంతలో ప్రణయ్ రాయ్‌పై సీబీఐ దాడి తరువాత అనేక రహస్యాలను బయటపెట్టిందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఒక సందేశాన్ని పంచుకుంటున్నారు. ప్రణయ్ రాయ్ అసలు పేరు పర్వేజ్ రాజా, అతని జన్మస్థలం కరాచీ అని ఆ పోస్ట్ పేర్కొంది. ఎండిటీవి పూర్తి పేరు “నవాజుద్ దిన్ తౌఫిక్ వెంచర్”. అది రాయ్ తండ్రి పేరు అనీ, అతని భార్య రాధిక అసలు పేరు రాహిలా అంటూ ప్రచారం జరుగుతోంది. రాయ్ బెడ్రూమ్లో నరేంద్ర మోదీ ముఖంతో ఒక డార్ట్ బోర్డు ఉందని పోస్టుల్లో తెలిపారు. ఈ వాదన ట్విట్టర్లో వైరల్‌గా మారింది.
క్లెయిం ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు.