Mon Nov 18 2024 06:44:30 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు తనయుడు తన తండ్రి తరపున భారతరత్న అందుకుంటున్నప్పుడు కాంగ్రెస్ నేత ఖర్గే చప్పట్లు కొట్టలేదు.
రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరీ ఠాకూర్లకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు
Claim :
పివి నరసింహారావు కుమారుడు తన తండ్రి తరపున భారతరత్న అందుకున్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చప్పట్లు కొట్టలేదుFact :
అవార్డు ఇచ్చినప్పుడు ఖర్గే చప్పట్లు కొట్టిన వీడియోలు ఉన్నాయి
రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరీ ఠాకూర్లకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి ప్రధాని మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తదితర రాజకీయ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు అవార్డు ప్రదానం చేస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే చప్పట్లు కొట్టడం లేదని ప్రచారం జరుగుతోంది. పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్రావుకు అధ్యక్షుడు ముర్ము అవార్డును అందజేశారు.
“Wondering why @kharge is not clapping for the Bharat Ratna award conferred to P.V.Narsimha Rao while everyone in the front row is clapping. Fear of Dynasty” అనే వాదనతో పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఖర్గే ఎందుకు చప్పట్లు కొట్టడంలేదో మాకు అర్థం అవ్వడం లేదు.. నరసింహారావుకి అవార్డు ఇచ్చినప్పుడు అందరూ చప్పట్లు కొట్టినా.. ఖర్గే మాత్రం కొట్టడం లేదనే విషయాన్ని మనం చూడొచ్చు అనే విధంగా పోస్టు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. పీవీ.నరసింహారావు కుమారుడికి అవార్డును అందజేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు చప్పట్లు కొడుతూ కనిపించారు.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించి అడిగాము. భారత ప్రధాని నరేంద్ర మోదీ X (ట్విట్టర్) ఖాతాలో కూడా ఈ విజువల్స్ షేర్ చేశారని మేము కనుగొన్నాము. “మన దేశం కోసం PV నరసింహారావు గారు ఏమి చేసారో తెలిసి ప్రతి భారతీయుడు ఎంతో గౌరవిస్తాడు. ఆయనకు భారతరత్న లభించినందుకు గర్వపడుతున్నాను. మన దేశ పురోగతికి, ఆధునీకరణను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆయన విస్తృతంగా కృషి చేశారు. ” అనే పోస్టును కూడా మేము చూశాం.
“Live: President Droupadi Murmu presents Bharat Ratna awards at Rashtrapati Bhavan” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. అందులో ఖర్గే చప్పట్లు కొట్టడం మనం గమనించవచ్చు.
డిడి న్యూస్ అప్లోడ్ చేసిన మరో వీడియోలో దివంగత ప్రధాని తనయుడు పివి ప్రభాకర్ రావు అవార్డును అందుకోవడానికి వెళుతున్నప్పుడు మల్లికార్జున్ ఖర్గే చప్పట్లు కొట్టారు.
‘భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు మరణానంతరం భారతరత్న అవార్డును అందుకున్నారు’ అనే శీర్షికతో ది ఎకనామిక్ టైమ్స్ యూట్యూబ్ లో ప్రచురించిన వీడియోలో కూడా ఖర్గే చప్పట్లు కొట్టడం గమనించవచ్చు.
వీడియో కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను మీరు గమనించవచ్చు.
మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు తనయుడు తన తండ్రి తరపున భారతరత్న అందుకుంటున్నప్పుడు కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే చప్పట్లు కొట్టారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Congress President Kharge was not applauding when PV Narasimha Rao’s son received Bharat Ratna on his father’s behalf
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story