Thu Dec 19 2024 14:54:34 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బెంగుళూరు లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని రాలేదు
కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించింది. జూన్ 1, 2023 నుంచి ప్రభుత్వ బస్సుల్లో మహిళలందరూ ఉచితంగా ప్రయాణించవచ్చని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు.

అయితే బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన బస్సు చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కర్ణాటకలో పురుషుల కోసం ప్రత్యేక బస్సు సర్వీస్ ప్రారంభించచారని సోషల్ మీడియాలో పోస్టులు విస్తృతంగా వైరల్ అవుతూ ఉన్నాయి.
ఈ ఫొటో వాట్సాప్‌లో వైరల్ అవుతోంది “బెంగుళూరు లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు” అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇంగ్లీషులో కూడా అదే క్లెయిమ్‌తో ట్విట్టర్లో కొంతమంది షేర్ చేశారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. బెంగళూరు, కర్ణాటకలో అలాంటి కొత్త రూల్ ఏదీ రాలేదు.
‘కర్ణాటకలో పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు’ గురించి ఇంటర్నెట్ వెతికినప్పుడు, అందుకు సంబంధించి మాకు ఎటువంటి వార్త కూడా కనిపించలేదు. మహిళా ప్రయాణీకులకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇటీవలి ప్రకటనలను మేము కనుగొన్నాము, కానీ పురుషుల కోసం ప్రత్యేక బస్సు సేవల గురించి ఎటువంటి వార్తలు లేవు.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వైరల్ ఇమేజ్‌ని సెర్చ్ చేయగా.. 2017లో కూడా అనేక కథనాలలో కూడిన అదే చిత్రాన్ని మేము కనుగొన్నాము. పురుషుల కోసం ప్రత్యేక బస్సు సేవల ప్రస్తావన లేదు. బస్సు చిత్రంపై 'పురుషులు మాత్రమే' అని కూడా లేదని గుర్తించాం.
వైరల్ ఇమేజ్‌కి సంబంధించిన ఒరిజినల్ ఫోటోను tatamotors.com వెబ్సైట్లో చూశాం. అందులో ప్రచురించిన కథనం ప్రకారం, టాటా మోటార్స్ BMTC (బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్)కి 30 కొత్త బస్సులను పంపిణీ చేసింది.

డెక్కన్ హెరాల్డ్ 2018లో ప్రచురించిన కథనంలో కూడా అదే చిత్రాన్ని ఉంచారు. దీన్ని ఫైల్ ఫోటోగా ట్యాగ్ చేశారు.
ఈ చిత్రం 2020లో oneindia.comలో ప్రచురించబడిన మరొక కథనంలో కూడా ఉంది. ఆ కథనంలో BMTC బస్సు ఛార్జీల గురించి ప్రస్తావించారు.
జాగ్రత్తగా గమనించినప్పుడు, బస్సు రంగు, అలంకరించిన పూల మాలతో పాటు వైరల్ ఇమేజ్‌తో సరిపోతాయి. బస్సు నంబర్ ప్లేట్ కూడా వైరల్ ఇమేజ్‌తో సరిపోతుంది. అన్ని వైరల్ చిత్రాలలో టాటా మోటార్స్ లోగో కూడా ఒకదానితో ఒకటి సరిపోలుతుంది.
పాత చిత్రాన్ని తీసుకుని మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వం మగవాళ్ల కోసం ప్రత్యేకంగా బస్సులను తీసుకుని రాలేదు. బెంగళూరు లేదా కర్ణాటకలోని మరే ఇతర ప్రాంతాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించబడలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Special bus service for men in Karnataka
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story