Fri Dec 27 2024 11:23:34 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఐపీఎల్ వేలంపాటలో 10 కోట్లకు అమ్ముడుపోగానే క్రికెటర్ షమీ మాజీ భార్య ఆనందంతో డ్యాన్స్ చేయలేదు
ఇటీవలి ఐపీఎల్ మెగా వేలంలో మహమ్మద్ షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్10 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. IPL 2025లో షమీ కొత్త
Claim :
ఐపీఎల్ వేలంలో 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగానే మహ్మద్ షమీ మాజీ భార్య డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది.Fact :
IPL వేలానికి ముందే ఈ వీడియోను పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది
ఇటీవలి ఐపీఎల్ మెగా వేలంలో మహమ్మద్ షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్10 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. IPL 2025లో షమీ కొత్త జెర్సీలో ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. 2 కోట్ల రూపాయల బేస్ ధరతో వేలంలోకి ప్రవేశించిన షమీని దక్కించుకోడానికి పలు జట్లు బిడ్డింగ్ వేయగా ఆఖరికి హైదరాబాద్ జట్టు షమీని దక్కించుకుంది.
షమీని ఇటీవలి కాలంలో గాయాలు వెంటాడాయి. కొన్ని నెలల పాటూ షమీ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. త్వరలోనే అతడిని భారత జట్టులో భాగం చేయనున్నారు. అయితే షమీ పర్సనల్ లైఫ్ లో ఎన్నో వివాదాలు వెంటాడాయి. అతని మాజీ భార్య హసిన్ జహాన్‌తో చెదిరిన సంబంధం కారణంగా అతని వ్యక్తిగత జీవితం మీడియా దృష్టిని ఆకర్షించింది. తీవ్రమైన ఆరోపణలు, న్యాయ పోరాటాల మధ్య వీరి వివాహం ముగిసింది. 2018లో హసిన్ జహాన్ మహ్మద్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్, తనను హింసించారంటూ ఆరోపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా వారు విడిపోవడానికి దారితీసింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, జనవరి 2023న ఆమెకు నెలకు రూ. 1.30 లక్షలు భరణంగా చెల్లించాలని మహ్మద్ షమీని కోర్టు ఆదేశించింది.
వివాహానికి ముందు మోడల్, నటి అయిన హసిన్ జహాన్ తన వృత్తిని కొనసాగిస్తోంది. ప్రస్తుతానికి, మహ్మద్ షమీ, హసిన్ జహాన్ విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ విడివిడిగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. షమీ క్రికెట్లో కొనసాగుతుండగా, జహాన్ మోడలింగ్, యాక్టింగ్ లో భాగమైంది.
2024 ఐపీఎల్ వేలంలో, షమీని 10 కోట్ల రూపాయలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొన్నది. ఈ వేలం తర్వాత, కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు మహ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్ డ్యాన్స్ వీడియోను షేర్ చేయడం ప్రారంభించారు, 2025 సంవత్సరానికి ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షమీ 10 కోట్లకు అమ్ముడు పోవడంతో ఆ రీల్‌ను పోస్ట్ చేశారు. “No way Mohammad Shami's ex wife posted this reel after he got sold for 10cr to SRH #IPLAuction #IPLAuction2025” అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేస్తున్నారు.
క్లెయిం స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. వీడియో నవంబర్ 14, 2024న పోస్ట్ చేశారు, అయితే IPL 2025 వేలం నవంబర్ 24, 2024న జరిగింది.
మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్‌ని ఉపయోగించి వెతకగా ఈ వీడియో నవంబర్ 14, 2024న #womanpower, #womenempowerment అనే హ్యాష్‌ట్యాగ్‌లతో హసిన్ జహాన్ అధికారిక Instagram హ్యాండిల్ లో అప్లోడ్ చేశారని మేము కనుగొన్నాం.
వీడియో రీల్‌ను నవంబర్ 14, 2024న హసిన్ జహాన్ అప్లోడ్ చేశారని తెలిపే నివేదికను కూడా మేము కనుగొన్నాము. ఆమెకు 2 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని నివేదిక పేర్కొంది. ఫాలోవర్లు కామెంట్లు కూడా చేశారని తెలుస్తోంది.
మేము ఇండియన్ ప్రీమియర్ లీగ్ X హ్యాండిల్‌ని తనిఖీ చేయగా.. వేలం నవంబర్ 24, 2024న జరిగినట్లు మేము కనుగొన్నాము. సన్ రైజర్స్ మొహమ్మద్ షమీని దక్కించుకుందని ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వీడియోను మేము చూశాం. “You want pace, you get pace! Mohammad Shami joins #SRH for INR 10 Crore #TATAIPLAuction, #TATAIPL, @MdShami11, | @SunRisers” అంటూ పోస్టులు పెట్టారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయిన హసిన్ జహాన్ గతంలో చేసిన డ్యాన్స్ వీడియోను ఐపీఎల్ వేలంపాటకు లింక్ చేశారు. మహ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్ వీడియో రీల్ IPL వేలానికి ముందు పోస్ట్ చేశారు. వీడియో నవంబర్ 14, 2024న పోస్ట్ చేశారు. IPL వేలం నవంబర్ 24, 2024న జరిగింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : ఐపీఎల్ వేలంలో 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగానే మహ్మద్ షమీ మాజీ భార్య డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story