Fri Nov 15 2024 02:02:40 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ పతిరానా ధోని ఆశీర్వాదం తీసుకోలేదు. మతీష పతిరానా కిందకు వంగి బౌలింగ్ మార్కర్ ను తీసుకున్నాడంతే!!
ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మతీషా పతిరానా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది
Claim :
మ్యాచ్ సమయంలో మతిష్ పతిరానా ధోని పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడుFact :
MS ధోని పాదాల దగ్గర ఉన్న బౌలింగ్ మార్కర్‌ని తీయడానికి మతీష పతిరానా కిందకు వంగాడు
మహేంద్ర సింగ్ ధోని అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టం. ఇక పలువురు ఆటగాళ్లకు కూడా ధోని అంటే చాలా అభిమానం. ఆయనను ఒక ఐకాన్ లా భావిస్తారు. “ఐపీఎల్ మ్యాచ్‌లో మతీషా పతిరానా ఎమ్ఎస్ ధోని పాదాలను తాకాడు” అనే వాదనతో సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతూ ఉంది.
IPL ఫీవర్ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. తమ ఫేవరెట్ ఆటగాళ్ళను, జట్లను వారిని ప్రోత్సహించడానికి మద్దతును తెలియజేయడానికి పలు వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు.
ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మతీషా పతిరానా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. MS ధోని పాదాలను తాకి, ఆశీర్వాదం స్వీకరించాడనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వివిధ సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్ చేసిన వీడియో క్లిప్‌లను జాగ్రత్తగా పరిశీలించాక.. మేము వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొన్నాము.
MS ధోని పాదాలకు దగ్గరగా ఉన్న బౌలింగ్ మార్కర్‌ని తీయడానికి పతిరానా కిందకు వంగాడు.
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేశాం. ఈ వీడియోను పలువురు వేరే కోణంలో చిత్రీకరించారని గుర్తించాం. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను అప్లోడ్ చేశారు. పతిరానా తన బౌలింగ్ మార్కర్‌ని తీయడానికి క్రిందికి వంగి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
మరొక ఫేస్బుక్ వినియోగదారుడు కూడా ఈ సంఘటనకు సంబంధించిన రెండు వీడియోలను పంచుకున్నాడు. అందులో వైరల్ వీడియోలో ధోని క్రీజ్‌లోకి ప్రవేశించిన వెంటనే పతిరనా వంగి ఉన్నట్లు చూడొచ్చు. రెండు వీడియోలకు మధ్య తేడాలను మనం చూస్తే అసలు అక్కడ ఏమి జరిగిందో అర్థం అవుతుంది.
https://www.facebook.com/reel/979503746842813
మరింత పరిశోధించగా క్రీడలకు సంబంధించిన వార్తలను అందించే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ 'స్పోర్ట్స్ కీడా' లో మార్చి 29, 2024న ప్రచురించిన ఒక కథనాన్ని కనుగొన్నాం. “CSK vs GT IPL 2024 మ్యాచ్‌లో మతీషా పతిరానా MS ధోని పాదాలను తాకలేదు. ” అని అందులో చూశాం.
NDTV స్పోర్ట్స్ ప్రకారం.. “CSK స్టార్ MS ధోని పాదాలను తాకలేదు. మరో వీడియో నిజమైన స్టోరీ ఏమిటో తెలియజేస్తుంది” అని అందులో ఉంది.
కాబట్టి, CSK బౌలర్ మతీషా పతిరానా MS ధోని పాదాలను తాకలేదని, అతను ధోని పాదాలకు దగ్గరగా ఉన్న బౌలింగ్ మార్కర్‌ని తీయడానికి వంగాడని మేము నిర్ధారించాము.
Claim : CSK bowler Matheesha Pathirana bent down to touch MS Dhoni’s feet to take his blessings
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story