Fri Nov 22 2024 15:42:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఇండోనేషియా కరెన్సీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి
ఇండోనేషియా కరెన్సీపై వినాయకుడి బొమ్మ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినాయకుడి చిత్రాలతో కూడిన కరెన్సీ నోట్లను పంచుకుంటున్నారు. 20,000 ఇండోనేషియా రూపాయి (IDR) కరెన్సీ నోటు అని తెలుస్తోంది.
ఇండోనేషియా కరెన్సీపై వినాయకుడి బొమ్మ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినాయకుడి చిత్రాలతో కూడిన కరెన్సీ నోట్లను పంచుకుంటున్నారు. 20,000 ఇండోనేషియా రూపాయి (IDR) కరెన్సీ నోటు అని తెలుస్తోంది.
అక్టోబర్ 26, 2022 న, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారత కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు వినాయకుడు, లక్ష్మీ దేవి చిత్రాలను చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్రానికి లేఖ రాశారు. ఇండోనేషియా కరెన్సీ నోటుపై వినాయకుడి చిత్రం ఉందని.. మన దేశంలో ఎందుకు ఉండకూడదు అని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
ఇండోనేషియా ముస్లిం దేశమని.. అక్కడి జనాభాలో 85 శాతం ముస్లింలు, 2 శాతం హిందువులు ఉన్నప్పటికీ వారి కరెన్సీపై గణేష్ చిత్రాన్ని ముద్రించారు. అందుకే భారత కరెన్సీపై కూడా గాంధీజీ బొమ్మతో పాటూ లక్ష్మీ, గణేష్ బొమ్మలు ముద్రించాలని ప్రధాని నరేంద్ర మోదీని కేజ్రీవాల్ కోరారు.
https://twitter.com/i/broadcasts/1MYGNgaMBlZJw
పలువురు కూడా ఇదే తరహా పోస్టులు అప్లోడ్ చేశారు.
ఇండోనేషియా ముస్లిం దేశమని.. అక్కడి జనాభాలో 85 శాతం ముస్లింలు, 2 శాతం హిందువులు ఉన్నప్పటికీ వారి కరెన్సీపై గణేష్ చిత్రాన్ని ముద్రించారు. అందుకే భారత కరెన్సీపై కూడా గాంధీజీ బొమ్మతో పాటూ లక్ష్మీ, గణేష్ బొమ్మలు ముద్రించాలని ప్రధాని నరేంద్ర మోదీని కేజ్రీవాల్ కోరారు.
https://twitter.com/i/
పలువురు కూడా ఇదే తరహా పోస్టులు అప్లోడ్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
మేము నామిస్మాటిక్స్ వెబ్సైట్ Numistaలో కరెన్సీ నోట్‌పై సమాచారం దొరుకుతుందేమోనని వెతికాము. నుమిస్టా ప్రకారం, 20,000 రుపియా (IDR) పై హిందూ దేవత గణేశుడి చిత్రం ఉంటుంది.నోటుకు వెనుక భాగంలో మాజీ విద్యాశాఖ మంత్రి కి హడ్జర్ దేవంతరా చిత్రం, తరగతి గదిలో చదువుతున్న పిల్లల చిత్రాలు ఉన్నాయి. IDR బ్యాంక్ నోట్ సిరీస్ 1998లో ప్రవేశపెట్టారు.
మరింత పరిశోధన చేయగా.. IDR 20,000తో పాటు మరో మూడు బ్యాంక్ నోట్ల సిరీస్' (1998లో జారీ చేయబడిన IDR 10,000, 1999లో జారీ చేయబడిన IDR 50,000 మరియు 1999లో జారీ చేయబడిన IDR 100,000) కూడా డీమోనిటైజ్ చేయబడిందని బ్యాంక్ ఇండోనేషియా పత్రికా ప్రకటనను మేము కనుగొన్నాము.
"ఈ నోటు మూడు ఇతర నోట్ల సిరీస్‌లతో పాటుగా రద్దు చేశారు' (1998లో జారీ చేసిన IDR 10,000, 1999లో జారీ చేసిన IDR 50,000 మరియు 1999లో జారీ చేసిన IDR 100,000)" అని మనీ సర్క్యులేషన్ డిప్యూటీ గవర్నర్ S. బుడి రోచాడి తెలిపారు.
https://www.bi.go.id/en/
అయితే, ఈ నోట్లను కొత్త వాటితో మార్చుకోవడానికి ప్రభుత్వం 10 సంవత్సరాల గడువును ఇచ్చింది, అంటే 31 డిసెంబర్ 2008 వరకు ఈ నోట్లు చెలామణీ అయ్యాయి. గడువు సమీపిస్తున్నందున, రద్దు చేసిన బ్యాంక్ నోట్లను మార్చుకోవడానికి పౌరులకు బ్యాంక్ ఇండోనేషియా సమాచారాన్ని ఇచ్చింది.
https://www.bi.go.id/en/
ఇండోనేషియాలో చెలామణీలో ఉన్న 20,000 రూపాయల బ్యాంక్ నోట్ల ప్రస్తుత చిత్రాలను తనిఖీ చేసాము. కరెన్సీ నోట్లు ఏవీ వైరల్ వాటిని పోలి లేవు.
https://www.bi.go.id/en/
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. 20,000 రూపాయి (IDR) విలువ ఉన్న ఇండోనేషియా కరెన్సీ నోటు 1998లో ప్రవేశపెట్టారు. అయితే కరెన్సీ నోట్ల డీమానిటైజేషన్ లో భాగంగా 2008లో ఉపసంహరించుకున్నారు.
Claim : Currency note with Lord Ganesh image on it, users claim that it is an Indonesian currency note of denomination 20,000 Indonesian Rupiah (IDR).
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story