Fri Nov 22 2024 15:18:01 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఇండియా కూటమి 200 సీట్లు దాటుతుందని దైనిక్ భాస్కర్ ఎలాంటి పోల్ సర్వే నివేదికను ప్రచురించలేదు.
వార్తాపత్రిక క్లిప్‌ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. వైరల్ అవుతున్న వాదనలో
Claim :
దైనిక్ భాస్కర్-నెల్సన్ సర్వే: 10 రాష్ట్రాల్లో, ఇండియా కూటమి ఆధిక్యం సాధిస్తుంది. ఈ 10 రాష్ట్రాల్లోనే 200 సీట్లు దాటవచ్చు. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఓట్లు పడేందుకు మోదీ ఇమేజ్ సరిపోదని సర్వేలో తేలింది.Fact :
వైరల్ అవుతున్న చిత్రంలో ఎలాంటి నిజం లేదు. దైనిక్ భాస్కర్ కు సంబంధించిన నిర్దిష్ట ఎడిషన్ లో అటువంటి సర్వే నివేదికను ప్రచురించలేదు
దేశంలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తూ ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా నకిలీ సమాచారం షేర్ చేస్తున్నారు. దైనిక్ భాస్కర్ వార్తాపత్రిక క్లిప్పింగ్ లాగా ఉన్న చిత్రం పోల్ సర్వేతో ప్రచారం చేస్తున్నారు.
సోషల్ మీడియా వినియోగదారులు “దైనిక్ భాస్కర్-నెల్సన్ సర్వే: 10 రాష్ట్రాల్లో ఇండియా కూటమి ముందంజలో ఉంది. ఈ 10 రాష్ట్రాల్లోనే 200 సీట్లు దాటవచ్చు. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఓట్లు పడేందుకు మోదీ ఇమేజ్ సరిపోదు. బీహార్, బెంగాల్, మహారాష్ట్ర లో ఎన్డీఏ వాష్అవుట్ అవుతుంది." అని పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్ట్‌ను సామాన్య ప్రజలతో పాటు పలువురు రాజకీయ నేతలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వార్తాపత్రిక క్లిప్‌ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. ఏప్రిల్ 13, 2024న సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టును దైనిక్ భాస్కర్ ప్రచురించలేదు.
మేము ఏప్రిల్ 13 వార్తాపత్రిక, దైనిక్ భాస్కర్ యొక్క భోపాల్ ఎడిషన్ ను వెతికాం. అందులో మాకు ఎటువంటి సర్వే నివేదిక కనిపించలేదు.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ప్రకారం, ఏప్రిల్ 13, 2024న దైనిక్ భాస్కర్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఇదొక ఫేక్ న్యూస్ అంటూ
“#FakeNews : यह सर्वे फेक है, जिसे कुछ असामाजिक तत्वों ने तैयार किया है... दैनिक भास्कर ऐसे किसी भी कंटेंट का दावा नहीं करता है... ऐसे लोगों पर सख्त कार्रवाई होनी चाहिए” పోస్టు పెట్టారు. ఈ సర్వే ఫేక్ అని.. కొందరు సంఘ వ్యతిరేకులు దీనిని తయారు చేశారని ఆ పోస్టు ద్వారా తెలిపారు. దైనిక్ భాస్కర్ అటువంటి కంటెంట్‌ను రూపొందించలేదు. ఈ తప్పుడు సర్వే పోల్‌ను రూపొందించి షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దైనిక్ భాస్కర్ (డిజిటల్) రాజస్థాన్ స్టేట్ ఎడిటర్ కిరణ్ రాజ్‌పురోహిత్ కూడా ఈ పేపర్ క్లిప్‌ను ఫేక్ న్యూస్ అని తెలిపారు. భాస్కర్ పేరుతో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఫేక్ సర్వే వైరల్ అవుతూ ఉందని అన్నారు.
మేము కిరణ్ రాజ్‌పురోహిత్ షేర్ చేసిన లింక్‌ను క్లిక్ చేశాము. వైరల్ ఫోటో ఫేక్ అని వివరిస్తూ.. దైనిక్ భాస్కర్ ప్రచురించిన వివరణాత్మక కథనాన్ని మేము కనుగొన్నాము.
కాబట్టి, వైరల్ అవుతున్న పేపర్ క్లిప్ ఫేక్ అని తేలింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పోల్ సర్వే నివేదికను దైనిక్ భాస్కర్ ప్రచురించలేదు.
Claim : దైనిక్ భాస్కర్-నెల్సన్ సర్వే: 10 రాష్ట్రాల్లో, ఇండియా కూటమి ఆధిక్యం సాధిస్తుంది.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story