ఫ్యాక్ట్ చెక్: టెక్సాస్ లో నిర్వహించిన డ్రోన్ షోను ప్రయాగ్ రాజ్ కు చెందినదిగా ప్రచారం
మహా కుంభమేళాలో భాగంగా జనవరి 23, 2025 నాటికి 10 కోట్ల మందికి పైగా భక్తులు, సందర్శకులు ప్రయాగ్ రాజ్ కు వచ్చి వెళ్లారు.

Claim :
ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో వేలాది డ్రోన్లతో జరిగిన డ్రోన్ షో ను వైరల్ వీడియో లో చూడొచ్చుFact :
వైరల్ వీడియోలో ఉన్నది నవంబర్ 2024లో 5000 డ్రోన్లతో టెక్సాస్‌లో నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన
మహా కుంభమేళాలో భాగంగా జనవరి 23, 2025 నాటికి 10 కోట్ల మందికి పైగా భక్తులు, సందర్శకులు ప్రయాగ్ రాజ్ కు వచ్చి వెళ్లారు. మొత్తం 45 కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలోని పవిత్ర జలాల్లో స్నానం చేసే అవకాశాలు ఉన్నాయని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. యాత్రికుల రద్దీకి అనుగుణంగా, అధికారులు 150000 టెంట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలు, మెరుగైన రవాణా సేవలతో తాత్కాలిక నగరాన్ని ఏర్పాటు చేశారు. 40,000 మందికి పైగా పోలీసు అధికారులను ఏఐ-శక్తితో కూడిన నిఘా వ్యవస్థలతో ఆ ప్రాంతంలో మోహరించారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
హిందూస్తాన్ టైమ్స్ కూడా ఒక కథనాన్ని షేర్ చేసింది, ‘ఖచ్చితత్వం, సమన్వయంతో, డ్రోన్లు గాల్లోకి ఎగిరి, ప్రేక్షకులను అబ్బురపరిచే భారీ, ప్రకాశవంతమైన చిత్రాలను తయారు చేసాయి. శాంటా కనపడగానే కనిపించిన క్షణం, జనం చప్పట్లతో మార్మోగారు.’