ఫ్యాక్ట్ చెక్: ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువును పొడిగించలేదు
జూలై 31, 2024 గడువు కంటే ముందే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్‌లను దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు సూచించింది. AY 2024-25కి సంబంధించిన 6.5 కోట్ల ఐటీఆర్‌లు జూలై 30 నాటికి ఫైల్ అయ్యాయని డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.
Claim :
ఆదాయపు పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడానికి గడువు తేదీ పొడిగించారుFact :
ITR సమర్పణకు గడువు తేదీ పొడిగించలేదు, వైరల్ చిత్రం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సలహాను చూపుతుంది
జూలై 31, 2024 గడువు కంటే ముందే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్‌లను దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు సూచించింది. AY 2024-25కి సంబంధించిన 6.5 కోట్ల ఐటీఆర్‌లు జూలై 30 నాటికి ఫైల్ అయ్యాయని డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. జూలై 30న రోజు నాటికి ఐటీఆర్ దాఖలు చేసిన వారి సంఖ్య 45 లక్షలు దాటింది. గడువు తేదీ ఆఖరి రోజైన జూలై 31న భారీగా పన్ను చెల్లిస్తారని అంచనా వేస్తున్నారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది గడువును ప్రభుత్వం పొడిగించలేదు. అయితే, వెబ్సైట్లో లాగిన్‌లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సోషల్ మీడియాలో గడువును పొడిగించడంపై చాలా ఊహాగానాలు ఉన్నాయి.
సోషల్ మీడియా వినియోగదారులు, ముఖ్యంగా X, వాట్సాప్ వినియోగదారులు.. ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును ఆగస్టు 31, 2024 వరకు పొడిగించినట్లు చూపిస్తూ ఒక మెసేజీని షేర్ చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు "ITR తేదీని పొడిగించండి" అనే శీర్షికతో డిప్యూటీ ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ రంజిత్ చందన్ సంతకం చేసిన అడ్వైజరీని పంచుకున్నారు.