నిజ నిర్ధారణ: లేదు, తూర్పు ఆఫ్రికా దేశం ఎరిట్రియా దేశంలో బహుభార్యత్వాన్ని అమలు చేయలేదు.
ఎరిట్రియన్ ప్రభుత్వం, దేశంలోని పురుషులు కనీసం ఇద్దరు మంది మహిళలను వివాహం చేసుకోవాలని చట్టాన్ని ఆమోదించిందని లేదా వారు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంటూ ఒక చిత్రంతో కలిపి పోస్ట్ ని సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడీయా లో కూడా వైరల్‌గా మారింది.
ఎరిట్రియన్ ప్రభుత్వం, దేశంలోని పురుషులు కనీసం ఇద్దరు మంది మహిళలను వివాహం చేసుకోవాలని చట్టాన్ని ఆమోదించిందని లేదా వారు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంటూ ఒక చిత్రంతో కలిపి పోస్ట్ ని సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడీయా లో కూడా వైరల్‌గా మారింది.
తెలుగు లో ఉన్న ఈ క్లెయిమ్ రెండు రోజుల నుంచి వైరల్ అవుతోంది " తూర్పు ఆఫ్రికా దేశం ఎరిత్రియా ప్రభుత్వం వినూత్న చట్టాన్ని అమలు చేస్తోంది. ప్రతి పురుషుడు కచ్చితంగా ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేసింది. లేకుంటే అతడికి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది. అంతర్యుద్ధం కారణంగా పురుషుల జనాభా తగ్గింది. దీంతో పురుషుల కంటే అక్కడ స్త్రీల జనాభా ఎక్కువగా ఉండటంతో ఎళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసి, చట్టంగా మార్చింది"
ఈ క్లెయిమ్ సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలోనే కాకుండా ప్రధాన మీడియా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా వైరల్ అయ్యింది. క్లెయిమ్ గత కొన్ని వారాలుగా హిందీతో పాటు తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా పోర్టల్స్‌లో షేర్ అవుతోంది.
కానీ ఈ క్లెయిం ఇటీవలది కాదు, 2016 సంవత్సరం నుండి అడపాదడపా షేర్ అవుతూనే ఉంది.
నిజ నిర్ధారణ:
తూర్పు ఆఫ్రికా దేశం ఎరిట్రియా తమ దేశంలోని ప్రతి పురుషుడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకోవడాన్ని తప్పనిసరి చేసిందని, లేకుంటే అతనికి జీవిత ఖైదు తప్పదన్న వాదన అవాస్తవం.
వ్యంగ్యం కోసం ప్రచురించిన కథనాన్ని నిజమైనదిగా అనేక మాధ్యమాలు ప్రచురించాయి.
కీవర్డ్లను ఉపయోగించి శోధించినప్పుడు, బిబిసి.కాం లో ప్రచురితమైన ఒక కథనం లభించినది, అందులో 'క్రేజీ మడే' అనే వ్యంగ్య పత్రిక లో ఈ కధనం మొదటి సారి ప్రచురించారనీ, దినపత్రిక అయిన 'ది స్టాండర్డ్' అనుబంధిత పత్రిక ఇది అనీ, యువ పాఠకులను ఆకర్షించే ప్రయత్నంలో వ్యంగ్య కథలు, గాసిప్లను ప్రచురించే పత్రిక అని ఉంది.
క్రేజీ మండే ప్రచురణలో లేనప్పటికీ, జనవరి 26, 2016న ఎరిత్రియా గురించి ప్రచురించిన కథనం ఆర్కైవ్ ఎడిషన్ లభించింది.
ఇది బూటకపు వార్త అంటూ 2016లో ప్రపంచవ్యాప్తంగా అనేక కథనాలు ప్రచురించబడ్డాయి. ఒక కథనంలో ఎరిట్రియా సమాచార మంత్రి 'యెమనే జి మెస్కెల్' ట్వీట్‌ను షేర్ చేసారు, ఆ ట్వీట్ లో ఆయన ఇటువంటి వార్తల వ్యాప్తి భయంకరం అంటూ ఉందని వ్యాఖ్యానించారు.
మినిస్టర్ ట్వీట్:
ఎరిట్రియా దేశంలోని శిక్షా స్మృతి కోడ్లను కూడా శోధించగా, 2015లో ప్రచురించబడిన శిక్షాస్మృతిని లభించింది. ఎరిట్రియా శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 322 ప్రకారం, ఎరిట్రియాలో బహుభార్యాత్వం చట్టవిరుద్ధం.
అందువల్ల, ఒక వ్యంగ్య వెబ్సైట్ సృష్టించిన బూటకపు కథ నిజమైన వార్తగా చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉంది. తూర్పు ఆఫ్రికా దేశమైన ఎరిట్రియా తమ దేశంలోని ప్రతి పురుషుడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకోవడాన్ని తప్పనిసరి చేసిందని, లేకుంటే అతనికి జీవిత ఖైదు విధిస్తారనీ ప్రచారంలో ఉన్న వాదన అవాస్తవం.