Mon Nov 18 2024 01:22:23 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఎలాన్ మస్క్ ఫేస్ బుక్ ఫాలోవర్లకు క్రిప్టో కరెన్సీ ఇస్తానని చెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
క్రిప్టోకరెన్సీని ఉచితంగా ఇస్తామని.. అందుకు సంబంధించిన ఈవెంట్ లో పాల్గొనమని ఎలాన్ మస్క్ చేసిన ఆహ్వానం బూటకం
Claim :
ఎలోన్ మస్క్ ఉచితంగా క్రిప్టోకరెన్సీ ఇస్తానని ఫాలోవర్లను ఆహ్వానించారుFact :
క్రిప్టోకరెన్సీని సొంతం చేసుకోడానికి ఫాలోవర్లను ఎలాన్ మస్క్ కోరడం బూటకం
క్రిప్టోకరెన్సీని ఉచితంగా ఇస్తామని.. అందుకు సంబంధించిన ఈవెంట్ లో పాల్గొనమని ఎలాన్ మస్క్ చేసిన ఆహ్వానం బూటకం
Tesla Motors సంస్థ CEO, ఎలాన్ మస్క్ అధికారిక ఖాతా అని చెప్పుకునే Facebook పేజీ లో ఆయన CEO పదవి నుండి వైదొలిగినందుకు గౌరవసూచకంగా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన గివ్ అవేలో పాల్గొనమని మస్క్ ఫాలోవర్లను ఆహ్వానించినట్లు ఆన్లైన్లో ప్రచారం జరుగుతోంది.
మస్క్ టెస్లాలో CEO పదవిని విడిచిపెట్టాలని భావిస్తూ ఉండగా.. అతను ట్విట్టర్లో ప్రజలకు డిజిటల్ కరెన్సీని అందజేయాలని భావిస్తున్నారని వైరల్ పోస్ట్ పేర్కొంది. అందులో “టెస్లా డైరెక్టర్ పదవిని విడిచిపెట్టాను, మీ మద్దతు అందినందుకు అందరికీ ధన్యవాదాలు!”(“Left the post of director of Tesla, thank you all for your support!”) అంటూ పోస్టు పెట్టారు.

ఈ పోస్టులు నిజమో కాదో తెలుసుకోవాలని కోరుతూ.. మాకు కొన్ని రిక్వెస్ట్‌లు కూడా వచ్చాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఎలోన్ మస్క్ సీఈఓ పదవి నుంచి వైదొలగడంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ ప్రకటన నిజమైతే.. అనేక వార్తా సంస్థలు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనలు చేసేవి. మస్క్ క్రిప్టోకరెన్సీ ఇచ్చేస్తున్నట్లు ఎలాంటి ప్రకటనలు కూడా లేవు.
ఇంకొక విషయం ఏమిటంటే.. ఎలోన్ మస్క్‌కు ఫేస్బుక్ ఖాతా లేదు. 2018లో ఒక ట్వీట్‌కి సమాధానంగా, తాను ఫేస్‌బుక్‌ను ఉపయోగించనని మస్క్ స్పష్టం చేశాడు.
ఇంకొక విషయం ఏమిటంటే.. ఎలోన్ మస్క్‌కు ఫేస్బుక్ ఖాతా లేదు. 2018లో ఒక ట్వీట్‌కి సమాధానంగా, తాను ఫేస్‌బుక్‌ను ఉపయోగించనని మస్క్ స్పష్టం చేశాడు.
అటువంటి కాంటెస్ట్ ల కారణంగా మీ వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసే స్కామ్ అని కూడా గమనించాలి. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Elon Musk invited followers to participate in cryptocurrency giveaway
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story