Mon Dec 23 2024 13:16:11 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మోదీ ప్రభుత్వం 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' కి 1000కోట్ల రూపాయలను సహాయం చేసిందా..?
ఇటీవల హైదరాబాద్లో ఆవిష్కరించిన 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వైరల్ ఫోటోలో విగ్రహం మాత్రమే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో కూడా ఉండి వైరల్ అవుతూ ఉంది.
క్లెయిమ్: మోదీ ప్రభుత్వం 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' కి 1000కోట్ల రూపాయలను సహాయం చేసింది.
ఫాక్ట్: 1,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్ట్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూర్చబడ్డాయి.
ఇటీవల హైదరాబాద్లో ఆవిష్కరించిన 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వైరల్ ఫోటోలో విగ్రహం మాత్రమే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో కూడా ఉండి వైరల్ అవుతూ ఉంది.
తెలంగాణలోని రంగారెడ్డి శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో 45 ఎకరాల స్థలంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు 2014లో శంకుస్థాపన చేశారు చిన్నజీయర్ స్వామి. ప్రవేశద్వారం రూపకల్పన తెలంగాణలోని ప్రసిద్ధ 'కగాడియా' శైలిలో రూపొందించారు. ప్రధాన ద్వారం వద్ద 18 అడుగుల ఎత్తైన హనుమాన్, గరుడ విగ్రహాలను కూడా ఉంచారు. ఆలయ గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహన్ని ఏర్పాటు చేశారు.
కొద్దిరోజుల కిందట హైదరాబాద్, ముచ్చింతల్ లోని ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం 216 అడుగుల ఎత్తైన 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' ని ప్రధాని ఆవిష్కరించారు. శ్రీభగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఫిబ్రవరి 2 న ప్రారంభమైన సహస్రాబ్ది ఉత్సవాలు 13 రోజుల పాటు అంగరంగవైభవంగా జరిగాయి. సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 5న ఆధ్యాత్మిక విప్లవ మూర్తి భగవద్రామానుజాచార్యుల 216 అడుగుల భారీ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. చివరి రోజు సోమవారం శ్రీలక్ష్మీ నారాయణ యజ్ఞానికి మహా పూర్ణాహుతి నిర్వహించారు. 120 కిలోల శ్రీభగవద్రామానుజాచార్యుల సువర్ణమూర్తికి చిన్నజీయర్స్వామీజీ ప్రాణప్రతిష్ఠ చేశారు. చివరిరోజు వందలాది మంది భక్తుల సమక్షంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్వహించారు. ఉదయం చిన్నజీయర్స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞగుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని మహాపూర్ణాహుతి నిర్వహించారు. సమతా మూర్తి విగ్రహాన్ని 'పంచలోహాల'తో తయారు చేశారు. ప్రపంచంలోని కూర్చున్న స్థితిలో ఉన్న ఎత్తైన విగ్రహాలలో ఒకటి.

ఈ విగ్రహాన్ని మోదీ ప్రభుత్వం నిర్మించిందని చెబుతూ పలు భాషల్లో పోస్టులు పెట్టారు. బెంగాలీలో ఉన్న ఒక పోస్టు అనువాదం ఇలా ఉంది. "వృథా ఖర్చుల జాబితాలో మోదీ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది.. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' నిర్మాణానికి మోదీ ప్రభుత్వం రూ. 1,000-కోట్లు ఖర్చు చేసింది. ఇంతకు ముందు 2700 కోట్ల రూపాయలతో ఐక్యతా విగ్రహాన్ని నిర్మించారు. కానీ మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు GST చెల్లింపులు, పెట్రోలియం అప్పులను తిరిగి చెల్లించడం లేదు" అని వైరల్ పోస్టుల్లో ఉంది.
ఫ్యాక్ట్:
మా బృందం ఈ విగ్రహానికి ఫండింగ్ ఎవరు చేశారనే విషయమై కీవర్డ్ సెర్చ్ చేసాము. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' వెనుక ఉన్న నిధులకు సంబంధించిన కీవర్డ్ శోధనలో అనేక ప్రధాన వార్తా నివేదికలు కనుగొనబడ్డాయి. 1,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్ట్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూర్చబడిందని ది ఎకనామిక్ టైమ్స్, ఇండియా టుడే మీడియా సంస్థలు నివేదించాయి. వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుండి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూర్చబడిందని తెలిపింది.
https://www.business-standard.com/article/current-affairs/pm-to-unveil-216-foot-statue-of-equality-in-hyderabad-on-february-5-122012001585_1.html
ఫిబ్రవరి 4, 2022 న ప్రచురించబడిన తెలంగాణ ప్రభుత్వ పత్రికా ప్రకటన ప్రకారం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు.. శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆయన అనుచరులు విగ్రహాన్ని ప్రతిష్టించడంలో అద్భుతంగా పని చేశారని కొనియాడారు. ఇది గొప్ప ప్రయత్నం అని కేసీఆర్ అన్నారు. శ్రీ చిన జీయర్ స్వామి నిధులు, ఇతర ఏర్పాట్లను సేకరించే బాధ్యతను తీసుకున్నారని, చిన జీయర్ స్వామి కృషికి సీఎం అభినందనలు తెలిపారు.
ప్రాజెక్ట్ కోసం స్వీకరించిన విరాళాలు, దాని ఖర్చులను పేర్కొన్న స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఆర్థిక నివేదికలను తనిఖీ చేసాము. డిసెంబర్ 31, 2016 నాటికి జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ USA (JET USA) Inc. ప్రచురించిన ఆర్థిక నివేదికలలో నరేంద్ర మోదీ లేదా భారత ప్రభుత్వం పేరును ప్రస్తావించలేదు.
వైరల్ పోస్ట్ ను ధృవీకరించడానికి మేము స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ కార్యాలయాన్ని సంప్రదించాము. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు సమకూర్చడం లేదని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. కాబట్టి మోదీ ప్రభుత్వం 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' కి 1000కోట్ల రూపాయలను సహాయం చేసిందనే కథనాల్లో ఎటువంటి నిజం లేదు.

క్లెయిమ్: మోదీ ప్రభుత్వం 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' కి 1000కోట్ల రూపాయలను సహాయం చేసింది
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టులు అబద్ధం
Claim : Modi government has spent Rs 1,000-crore to build the Statue of Equality.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story