Mon Dec 23 2024 11:32:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అదానీ అరెస్ట్ అంటూ వైరల్ అంటూ పోలీసులు పట్టుకున్న ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు
అదానీని అమెరికా పోలీసులు అదుపులోకి
Claim :
అదానీని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారుFact :
వైరల్ అవుతున్న ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు
అదానీ గ్రూప్ ను వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి. 2023 జనవరిలో హిండెన్బర్గ్ షార్ట్ సెల్లర్ సంస్థ చేసిన ఆరోపణల కారణంగా అప్పట్లో షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇప్పుడు మరోసారి అదానీ గ్రూప్పై ఆరోపణలు వచ్చాయి. అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందంటూ ఇప్పుడు కేసు నమోదైంది. అది కూడా అమెరికాలో!!
అదానీ గ్రూప్ సంస్థలు అమెరికా పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించి, ఆ నిధులను భారత్లోని అధికారులకు లంచాలు ఇవ్వడానికి ఉపయోగించారని ఆరోపణలు చేశారు. 2020-2024 మధ్య అదానీ గ్రూప్ అమెరికా సంస్థల ద్వారా దాదాపు 2 బిలియన్ డాలర్లు నిధులు సేకరించిందని అభియోగాలు నమోదయ్యాయి.
గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే ఆయనపై అక్కడ కేసు నమోదయిందని రాహుల్ అన్నారు. అదానీని రక్షించేందుకు మోదీ నిరంతరం శ్రమిస్తున్నారన్న రాహుల్ గాంధీ లంచాలు ఇవ్వచూపిన కేసులో విచారణ చేసి అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నామని, చట్టప్రకారం వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని తెలిపింది.
ఇంతలో గౌతమ్ అదానీని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నట్లుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పలువురు ఈ ఫోటోను షేర్ చేస్తూ ఉన్నారు.
"బిగ్ బ్రేకింగ్:
గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీలకు అమెరికా ఫెడరల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
ఈ అరెస్ట్ వారెంట్ విదేశీ చట్ట అమలు సంస్థలకు కూడా పంపబడుతుంది.
మోడీ ప్రభుత్వానికి భారీ అవమానం." అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటోను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా సృష్టించారని మేము గుర్తించాం. వైరల్ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా అదానీని అరెస్టు చేయలేదని గుర్తించాం. అదానీని అరెస్టు చేసి ఉంటే తప్పనిసరిగా అది వార్తల్లో హెడ్ లైన్స్ గా నిలిచి ఉండేది. అలాంటిదేదీ జరగలేదు.
ఇక అమెరికా కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ పై అదానీ గ్రూప్ స్పందనను కూడా మేము చూశాం. తమ గ్రూప్ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, దీనిపై న్యాయ వ్యవస్థలతో పోరాడుతామని అదానీ గ్రూప్ చేసిన ప్రకటన ఇక్కడ మీరు చూడొచ్చు.
మేము వైరల్ పోస్టుల కింద కామెంట్స్ ను కూడా గమనించాం. వాటి కింద పలువురు ఇది ఏఐ సృష్టి అంటూ కామెంట్లు చేశారు.
పలువురు వ్యక్తులు వైరల్ ఫోటోలో ముఖాలు తేడాగా ఉన్నాయంటూ మార్క్ చేసి మరీ చూపించారు.
దీన్ని మేము క్యూగా తీసుకుని https://hivemoderation.com లో ఫోటో ఏఐ ద్వారా సృష్టించారా లేదా అని తెలుసుకోడానికి ప్రయత్నించగా.. 99.9 శాతం ఇది ఏఐ సృష్టి అంటూ తేలింది.
వైరల్ ఫోటో ను ఒరిజినల్ అంటూ మొదట పోస్టు చేసిన వారు చెప్పలేదు. అయితే ఇది కేవలం అవగాహన కోసం తీసుకొచ్చిన ఫోటో అని మాత్రమే తెలిపారు. కానీ ఇది నిజమైన ఫోటో అంటూ పలువురు వైరల్ చేస్తున్నారు. అదానీని అరెస్టు చేయాలంటే ఎన్నో లీగల్ సవాళ్లు ఉన్నాయి. ఇంకా కోర్టులలోనే ఈ ఆరోపణలకు సంబంధించిన వాదనలు జరుగుతూ ఉన్నాయి
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టు ఏఐ సృష్టి అని స్పష్టంగా తెలుస్తోంది.
Claim : అదానీని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story