Sun Dec 22 2024 16:11:59 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మీద చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ కు ఆపాదించారు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మీద చేసిన
Claim :
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల మీద రూపాయి పెట్టి వేలం వేస్తే పైసాకు పోడు అని సీఎం చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యలు చేశారుFact :
వైరల్ వీడియోలో వైఎస్ జగన్ ను సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక గ్రామ సభలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. ‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన వీటిని నిర్వహించారు. కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు మండలం మైసూరావారిపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
గ్రామసభల్లో మరుగుదొడ్లు, విద్యుత్, కుళాయి, వంటగ్యాస్ కనెక్షన్లు, మురుగునీరు-ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రహదారులు, గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాలకు లింక్ రోడ్లు, ఇంకుడు గుంతలు, పంటకుంటల నిర్మాణం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణానికి సహకారం వంటి విషయాలపై చర్చించారు.
అన్నమయ్య జిల్లా మైసూరివారిపల్లిలో ఆగస్టు 23 నిర్వహించిన గ్రామసభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని, తనకు సినిమాల కంటే సమాజమే ముఖ్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే కూటమి లక్ష్యమని అన్నారు. దేశ అభివృద్ధిలే గ్రామ పంచాయతీలే కీలకమని చెప్పారు.
ఇంతలో ఓ సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం ఆ వీడియోలో మనం చూడొచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల మీద రూపాయి పెట్టి వేలం వేస్తే పైసాకు పోడు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసినట్లుగా అందులో ఉంది.

ఇన్స్టాగ్రామ్ లోనే కాదు.. పలు సోషల్ మీడియా సైట్లలో కూడా ఈ వీడియో వైరల్ అయింది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయలేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి ఇటీవల గ్రామ సభలకు సంబంధించిన మీడియా కథనాలను పరిశీలించాం. అయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసినట్లు కథనాలు రాలేదు.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని, నేరుగా నిధులను వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. రాబోయే ఐదేళ్లలో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామని.. పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమ హయాంలో వేసిన వీధి దీపాలను కూడా వైసీపీ నేతలు దొంగిలించుకుపోయారని విమర్శించారు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు విమర్శలు చేయలేదు. పవన్ కళ్యాణ్ 'గ్రామ సభలు' పెట్టాలని సూచించారని అన్నారు.
Friday Culture అనే యూట్యూబ్ ఛానల్ లో 'Chandrababu Naidu Goosebumps Elevations On Pawan Kalyan For Introducing Grama Sabha Program' అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
ABN ఆంధ్రజ్యోతి యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోలో చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ ను విమర్శించారని తెలిపారు. 'పవన్ కళ్యాణ్ కంటే గొప్పోడా జగన్..' అంటూ చంద్రబాబు నాయుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శించారని తెలుస్తోంది.
'LIVE: కోనసీమ జిల్లాలో 'గ్రామసభ' - పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu IN GRAMA SABHA' అంటూ ఈటీవీ భారత్ కు సంబంధించిన వీడియోను కూడా మేము గుర్తించాం. అందులో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించినట్లు లేదు.
https://www.etvbharat.com/te/!videos/chandrababu-participated-in-grama-sabha-in-konaseema-district-vanapalli-aps24082301705
TV5 న్యూస్ ఛానల్ పోస్టు చేసిన లైవ్ వీడియోను కూడా మేము నిశితంగా గమనించాం. LIVE : CM Nara Chandrababu Naidu will Participate " Gram Sabha " at Konaseema District | TV5 News అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియోలో 57:30 దగ్గర మిత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ జగన్ పై చేసిన విమర్శలంటూ సోషల్ మీడియాలో పోస్టుల్లా సృష్టించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీని భూస్థాపితం చేయాలి అని చెబుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో అక్రమాలను ఖండించారు. 'వైఎస్ జగన్ మాకంటే గొప్ప వ్యక్తా, చదువుకున్నాడా' అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అంతే తప్ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అనలేదు.
కాబట్టి, పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించలేదు. వైఎస్ జగన్ మీద చేసిన విమర్శలను.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆపాదిస్తూ పోస్టులు పెట్టారు.
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల మీద రూపాయి పెట్టి వేలం వేస్తే పైసాకు పోడు అని సీఎం చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యలు చేశారు
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : Misleading
Next Story