Mon Dec 23 2024 04:23:10 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.46,715 ఇస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పేద కుటుంబానికి
Claim :
కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.46,715 ఇస్తోందిFact :
అందులో ఎలాంటి నిజం లేదు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ఖండించింది
కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదల కోసం పలు పథకాలను అమలులోకి తీసుకుని వస్తోంది. పేదలకు ఉచితంగా రేషన్ అందించడం, మహిళలకు వడ్డీ లేని రుణాలు మొదలైన పథకాలు ఆ కోవలోకే వస్తాయి. ఈ పథకాల గురించి సాధారణంగా సోషల్ మీడియాలో కూడా బాగా చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రజలను మోసం చేయడానికి కూడా సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. చాలా మంది ఈ ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేస్తున్నారు.
ఆర్థిక శాఖ కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. భారత పౌరులకు ప్రభుత్వం రూ.46,715 అందజేస్తోందని ప్రచారం చేస్తున్నారు. 'పేద ప్రజల ఆర్థిక సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం మీకు రూ.46715 ఇస్తోంది. వెంటనే ఈ లింక్ మీద క్లిక్ చేయండి' అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కేంద్రం అందించే సాయం పొందాలంటే ప్రతి ఒక్కరు వారి వ్యక్తి గత వివరాలను అందజేయాలంటూ ఓ లింక్ ఆ మెసేజీలో ఉంది.
'केंद्र सरकार आपकी कमजोर आर्थिक स्थिति को देखते हुए आपकी मदद के लिए दे 46715 रुपये दे रही है।' అంటూ హిందీలో కూడా ఈ మెసేజీ వైరల్ అవుతూ ఉంది. పలువురికి ఈ మెసేజీ వాట్సాప్ ద్వారా వచ్చింది.
ఆర్థిక శాఖ కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. భారత పౌరులకు ప్రభుత్వం రూ.46,715 అందజేస్తోందని ప్రచారం చేస్తున్నారు. 'పేద ప్రజల ఆర్థిక సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం మీకు రూ.46715 ఇస్తోంది. వెంటనే ఈ లింక్ మీద క్లిక్ చేయండి' అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కేంద్రం అందించే సాయం పొందాలంటే ప్రతి ఒక్కరు వారి వ్యక్తి గత వివరాలను అందజేయాలంటూ ఓ లింక్ ఆ మెసేజీలో ఉంది.
'केंद्र सरकार आपकी कमजोर आर्थिक स्थिति को देखते हुए आपकी मदद के लिए दे 46715 रुपये दे रही है।' అంటూ హిందీలో కూడా ఈ మెసేజీ వైరల్ అవుతూ ఉంది. పలువురికి ఈ మెసేజీ వాట్సాప్ ద్వారా వచ్చింది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ మెసేజీ లింక్ పై క్లిక్ చేయకండి.
కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని ఏమైనా తీసుకుని వచ్చిందా అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేశాం. మాకు ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కానీ, నిబద్ధత కలిగిన మీడియా సంస్థల నుండి ఎలాంటి కథనాలు కనిపించలేదు.
ఆర్థిక శాఖకు సంబంధించిన వెబ్ సైట్ లో కూడా దీనిపై వెతికాం. కానీ మాకు ఎలాంటి ఫలితం లభించలేదు.
https://finmin.gov.in/
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వాదన పూర్తిగా తప్పు అని ఖండిస్తూ ఓ పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అటువంటి స్కీమ్ ఏదీ భారత ప్రభుత్వం అమలు చేయడం లేదని PIB చెబుతోంది. ఇలాంటి ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ సందేశం పూర్తిగా కల్పితమని స్పష్టంగా తెలియజేసింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏ విధమైన సహాయానికి సంబంధించి అటువంటి ప్రకటన చేయలేదని వివరించింది. ఇటువంటి మోసపూరిత పథకాలకు ప్రజలు స్పందించడం మానేయాలని.. జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఉండాలని సూచించింది.
గతంలో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి వాదనలు చాలానే వైరల్ అవుతూ వచ్చాయి. సైబర్ నేరస్థులు ఇలాంటి నకిలీ పథకాల సందేశాలను పంపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వంటి వ్యక్తిగత సమాచారాన్ని అందించాలని కోరుతారు. కీలకమైన సమాచారం ఈ మోసగాళ్ల చేతికి వచ్చిన తర్వాత, వారు ఎప్పుడైనా మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయవచ్చు. ఇలాంటి ఉదంతాలు దేశంలో ఇప్పటికే చాలా జరిగాయి.
2023లో కూడా ఇలాంటి ఓ మెసేజీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా దాన్ని ఖండిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా పోస్టును పెట్టింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ. 32,849 ప్రయోజనాన్ని ప్రజలకు అందజేస్తోందని ఓ సందేశం వైరల్ అయింది. ఆ మెసేజీలో లింక్ ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు సహాయం అందిస్తోంది, గ్రహీతల వ్యక్తిగత వివరాలను కూడా కోరుతోంది. "భారతీయ ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత, సంక్షోభం తీవ్రతను తగ్గించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి పౌరుడికి (రూ. 32849) మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించింది." అన్నది మెసేజీ సారాంశం.
ఆ మెసేజ్‌లో ప్రజలు రిజిస్టర్ చేసుకోవడానికి లింక్ కూడా ఉంది. అయితే, పిఐబి ఫ్యాక్ట్ చెక్ మెసేజ్ 'ఫేక్' అని పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అటువంటి ప్రయోజనం ఏమీ ప్రకటించలేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.
ఈ మధ్య కాలంలో సైబర్ మోసాల ఘటనలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా, మోసగాళ్లు ఇలాంటి మెసేజీలను ఉపయోగించి ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తప్పుడు సందేశాల బారిన పడవద్దని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తోంది.
కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.46,715 ఇస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.46,715 ఇస్తోంది
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story