Mon Dec 23 2024 05:44:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ట్రంప్ ప్రాణాలను కాపాడిందన్న వాదన అవాస్తవం, ఒక్క బుల్లెట్ మాత్రమే ట్రంప్ చెవిని తాకింది
కాల్పుల ఘటన తర్వాత భద్రతా సిబ్బంది, డొనాల్డ్ ట్రంప్ నవ్వుతూ కనిపించారు
Claim :
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలను కాపాడింది. కాల్పుల ఘటన తర్వాత భద్రతా సిబ్బంది, డొనాల్డ్ ట్రంప్ నవ్వుతూ కనిపించారుFact :
కేవలం ఒక్క బుల్లెట్ మాత్రమే ట్రంప్ కుడి చెవి పైభాగంలో తగిలింది. మిగిలిన రెండు చిత్రాలను డిజిటల్‌గా ఎడిట్ చేశారు
జూలై 13, 2024న పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ఆ సమయంలో అతని చెవి రక్తంతో తడిసిపోయింది. తూటా ట్రంప్ చెవి నుండి దూసుకుని వెళ్లగానే.. అతడిని వేదికపై నుండి క్రిందికి లాగేశారు. షూటర్ ను వెంటనే చంపేశారు. సీక్రెట్ సర్వీస్ ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ట్రంప్ ర్యాలీకి హాజరైన వారిలో ఒకరు మరణించారు.. ఇద్దరు గాయపడ్డారు.
ట్రంప్‌పై జరిగిన దాడి గురించి సీక్రెట్ సర్వీస్ పలు విషయాలను మీడియాతో పంచుకుంది. భద్రతా లోపంపై స్థానిక పోలీసుల తప్పు కూడా ఉందని సీక్రెట్ సర్వీస్ చెబుతోంది. నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఓ భవనం పైకప్పు మీదికి చేరుకుని తుపాకీ ఎక్కుపెట్టినా పోలీసులు పట్టించుకోలేదని సీక్రెట్ సర్వీస్ అంటోంది. ట్రంప్ రక్షణకు సంబంధించి తమ పరిధి దూరానికి మించి ఉందని, సమావేశం జరిగిన ప్రాంగణాన్ని పెట్రోలింగ్ చేయాల్సిన బాధ్యత స్థానిక పోలీసులదేనని సీక్రెట్ సర్వీస్ మీడియాకు తెలిపింది.
ఇక ట్రంప్ మీద దాడికి సంబంధించి పలువురు పలు రకాల వాదనలను వినిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పలు ఫోటో గ్రాఫ్ లు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి.
క్లెయిమ్ 1
“बुलेट प्रूफ जैकेट का कमाल ट्रंप को एक गोली सीने पर लगी लेकिन बुलेट प्रूफ जैकेट ने उसे रोक लिया” అంటూ ట్రంప్ క్లోజప్ షాట్స్ ను షేర్ చేశారు. హిందీలో ఉన్న ఈ వాదనను డొనాల్డ్ ట్రంప్ జాకెట్ క్లోజ్-అప్ చిత్రాన్ని వినియోగదారులు పంచుకున్నారు. ట్రంప్ వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆయనను కాపాడిందంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
క్లెయిమ్ 2
ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత సీక్రెట్ సర్వీస్ అధికారులు నవ్వుతున్నారని మరో యూజర్ షేర్ చేశారు. వినియోగదారులు ఈ చిత్రాన్ని "ఈ ఘటన జరిగిన తర్వాత సీక్రెట్ సర్వీస్ అంత ఇబ్బంది పడలేదని నేను చెప్తున్నాను. వారిలో ఒకరు కెమెరాలోకి కూడా చూశారు" అంటూ మరో వ్యక్తి ఫోటోలను షేర్ చేశారు.
క్లెయిమ్ 3
దాడి జరిగిన వెంటనే మరొక వినియోగదారు డొనాల్డ్ ట్రంప్ ఫోటోను పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము. ట్రంప్ చెవిపై రక్తం ఉండగా.. అతని ముఖం మీద మాత్రం చిరునవ్వు ఉందనే వాదనతో పోస్టులు వైరల్ అయ్యాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనల్లో ఏ మాత్రం నిజం లేదని మేము కనుగొన్నాము. ట్రంప్ జాకెట్లోని "బుల్లెట్ హోల్" వాస్తవానికి భద్రతా వ్యక్తి జాకెట్లోని మడత. సంఘటన జరిగిన వెంటనే నవ్వుతున్న భద్రతా సిబ్బంది, డొనాల్డ్ ట్రంప్ చిత్రం డిజిటల్‌గా ఎడిట్ చేశారు.
క్లెయిమ్ 1
రివర్స్ ఇమేజ్ సెర్చ్ సమయంలో.. మేము అదే కీ ఫ్రేమ్ కు సంబంధించిన స్పష్టమైన ఛాయాచిత్రాన్ని కనుగొన్నాము. జూమ్ చేసిన తర్వాత, ట్రంప్ జాకెట్లో బుల్లెట్ రంధ్రం లేదని మేము కనుగొన్నాము. అది ట్రంప్‌ను రక్షించే సమయంలో భద్రతా వ్యక్తి జాకెట్లోని మడత మాత్రమే. దీంతో ఒక్క బుల్లెట్ మాత్రమే ట్రంప్ కుడి చెవి పైభాగంలోకి దూసుకెళ్లినట్లు నిర్ధారణ అయింది.
మీడియా నివేదిక ప్రకారం, “పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్ కుడి చెవి ఎగువ భాగంలో బుల్లెట్ గుచ్చుకుంది. స్లో-మోషన్లో ఉన్న వీడియోలు ట్రంప్ తల వంచడం వల్లనే ఆయన ప్రాణాలు మిగిలాయి. ట్రంప్‌కి 2వ బుల్లెట్ తాకలేదు. అప్పటికే ఆయన కిందకు పడిపోగా.. ఆయన్ను సీక్రెట్ సర్వీస్ అధికారులు చుట్టుముట్టేశారు" అని చూడొచ్చు.
క్లెయిమ్ 2:
మా సెర్చ్ ఆపరేషన్ సమయంలో.. ఎలోన్ మస్క్ ఈ ఘటనకు సంబంధించిన చిత్రాన్ని పంచుకున్నట్లు మేము కనుగొన్నాము. చిత్రాన్ని పరిశీలించిన తర్వాత, డోనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది నవ్వుతూ కనిపించలేదని మేము ధృవీకరించాము. అసలు చిత్రంలో.. వారు ట్రంప్‌ను రక్షిస్తున్నారు. కాబట్టి, వైరల్ ఇమేజ్ ను డిజిటల్‌గా ఎడిట్ చేసి ఉండవచ్చు.
క్లెయిమ్ 3:
WSJ న్యూస్ వైరల్ ఇమేజ్ కాకుండా వేరొక కోణం నుండి తీసిన వీడియోను అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. సరిగ్గా 1:16 టైమ్‌స్టాంప్ వద్ద, మేము వైరల్ ఇమేజ్ కీ ఫ్రేమ్‌ని కనుగొన్నాము. అయితే, ఆ సమయంలో ట్రంప్ నవ్వుతూ కనిపించలేదు. కాబట్టి, వైరల్ ఇమేజ్ ను డిజిటల్‌గా ఎడిట్ చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలన్నీ డిజిటల్ గా ఎడిట్ చేశారు. ట్రంప్ జాకెట్లోని "బుల్లెట్ హోల్" భద్రతా వ్యక్తి జాకెట్లోని మడత మాత్రమే. సంఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది, డొనాల్డ్ ట్రంప్ నవ్వుతున్నట్లు ఉన్న చిత్రాలు డిజిటల్‌గా ఎడిట్ చేశారు.
Claim : బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలను కాపాడింది. కాల్పుల ఘటన తర్వాత భద్రతా సిబ్బంది, డొనాల్డ్ ట్రంప్ నవ్వుతూ కనిపించారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story