Sat Nov 23 2024 05:23:55 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు
మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది
Claim :
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారుFact :
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై దిగ్విజయ్ సింగ్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. వైరల్ అవుతున్న లేఖ నకిలీది.
మధ్యప్రదేశ్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
లేఖ యొక్క సబ్జెక్ట్ లైన్ పై "కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా" అని ఉంది. సరైన ప్రాధాన్యత పార్టీలో ఇవ్వకపోవడం, పార్టీలో కొనసాగడం ఇష్టం లేకనే దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
తన రాజీనామా గురించి వచ్చిన ఆరోపణలను దిగ్విజయ్ సింగ్ ఖండించారు. X ఖాతా ద్వారా ఆయన తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని అన్నారు. 1971లో కాంగ్రెస్ పార్టీలో చేరానని.. తన చివరి రోజుల వరకు కాంగ్రెస్ సభ్యుడిగా ఉండాలనుకుంటున్నానని తెలిపారు. నేను కాంగ్రెస్‌లో చేరింది పదవి కోసం కాదు, సిద్ధాంతాల ప్రభావంతో అని తెలిపారు. నా జీవితపు చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని తెలిపారు.
ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీనే ఈ వదంతులను వ్యాప్తి చేస్తోందని.. అబద్ధాలను ప్రచారం చేయడంతో బీజేపీ తర్వాతే ఎవరైనా అని కూడా దిగ్విజయ్ సింగ్ అన్నారు.
భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి హితేష్ వాజ్‌పేయిపై ఈ ఫేక్ లెటర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అతనే ఈ 'నకిలీ లేఖ'ను సర్క్యులేట్ చేశారని ఆరోపించింది. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
"మాజీ ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చడానికి, బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేష్ వాజ్‌పేయి దిగ్విజయ సింగ్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక లెటర్ హెడ్‌ను ఫోర్జరీ చేసి, అతని సంతకాన్ని ఫోర్జరీ చేసారు" అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ) నివేదిక ప్రకారం అక్టోబర్ 16 నాడు సైబర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దిగ్విజయ్ సింగ్ పీటీఐతో మాట్లాడుతూ, "నేను బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు ఇష్టమైనవాడిని. నాపై తప్పుడు ప్రకటనలు, నా పేరు మీద నకిలీ లేఖలు, నా ప్రకటనలను తప్పుదోవ పట్టించడం ద్వారా నా పరువు తీయడం వారి హాబీ. నేను ఎంపీ సైబర్ పోలీసులకు పదే పదే ఫిర్యాదులు చేశాను, కానీ వారు బీజేపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు." అని వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై దిగ్విజయ్ సింగ్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.. వైరల్ అవుతున్న లేఖ నకిలీది.
Claim : Digvijaya Singh announces resignation from the Congress party
Claimed By : Social Media
Claim Reviewed By : Telugu Post Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story