Thu Jan 16 2025 19:07:15 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్ : ఆవుల అక్రమ రవాణా కారణంగా రెండు వర్గాల మధ్య గొడవ హింసాత్మకంగా మారిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు
మధ్యప్రదేశ్ లో పోలీసులు ఆవుల అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేయడంతో ఓ గుంపు పోలీసు స్టేషన్ ను ముట్టడించింది
Claim :
మధ్యప్రదేశ్ లో పోలీసులు ఆవుల అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేయడంతో ఓ గుంపు పోలీసు స్టేషన్ ను ముట్టడించిందిFact :
ఒక దర్జీ సమయానికి బట్టలను కుట్టి డెలివరీ చేయలేదు.. అందుకే ఈ గొడవ జరిగింది.
భారతదేశంలో 2024లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో 18వ లోక్సభ, అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో దేశంలో కీలకమైన ఎన్నికలు జరగనున్న సమయంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి, పుకార్లు సృష్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.
"మధ్యప్రదేశ్ లోని దామోహ్లో ఆవుల స్మగ్లర్లపై పోలీసులు చర్యలు తీసుకోగా.. అందుకు ప్రతీకారంగా జిహాద్ గుంపు పోలీసు స్టేషన్, పోలీసు అధికారులపై దాడి చేసింది" అనే వాదనతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము వైరల్ పోస్టులకు సంబంధించి.. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. వీడియోలోని కీలక ఫ్రేమ్లను సెర్చ్ చేయగా.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వివిధ వార్తా సంస్థలు ఈ ఘటనను నివేదించాయి. అనేక వీడియోలను కూడా మేము కనుగొన్నాము. అనేక వార్తా నివేదికలలో ఈ గొడవలలో మతపరమైన కోణం లేదని తేలింది.
చాలా హిందీ వెబ్ సైట్స్ హెడ్డింగ్ లో “दमोह में टेलर और इमाम से मारपीट “ అని ఉండడం కూడా మేము గమనించాం. టైలర్ కు.. ఇమామ్ కు మధ్య గొడవ జరిగిందని.. అది కాస్తా పెద్దదైందని అర్థం అవుతూ ఉంది.
మేము YouTube లో సెర్చ్ చేయగా.. మేము వివిధ వార్తా ఛానెల్స్ లో వివిధ కోణాల నుండి రికార్డు చేసిన చాలా వీడియోలను కనుగొన్నాము.
వార్తా నివేదికల ప్రకారం, ఈ సంఘటన ఫిబ్రవరి 3, 2024 న సాయంత్రం చోటు చేసుకుంది. బట్టలు కుట్టడానికి సంబంధించి ఒక టైలర్తో జరిగిన గొడవ ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. దర్జీ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఓ గుంపు అతనిపై దాడి చేసింది. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాలు వేర్వేరు మతాలకు చెందిన వారు కావడం యాదృచ్ఛికం. సంఘటన హింసాత్మకంగా మారడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు పోలీసు స్టేషన్ వద్ద గుమిగూడారు. కొందరు వ్యక్తులు స్టేషన్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం, పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా నలుగురిపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ బయట నిరసన తెలిపిన 30 మందిపై మరో కేసు కూడా నమోదైంది.
మధ్యప్రదేశ్ CMO ట్విట్టర్ లో “కొద్ది మంది వ్యక్తుల కారణంగా దామోహ్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి ఉంది, దీనిని అడ్మినిస్ట్రేషన్ & పోలీసులు నియంత్రించారు. అలాగే ఈ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు." అని పోస్టు పెట్టడం కూడా మేము గమనించాం.
అలాగే, పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ అధికారిక X ఖాతాలో “ఈ సంఘటనపై మేజిస్ట్రేట్ స్థాయి విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు." అని పోస్టు పెట్టింది.
న్యూస్ 18 హిందీ ప్రకారం: టైలర్ దుస్తులను సమయానికి కుట్టడంలో విఫలమవ్వడంతో ఇరు వర్గాల మధ్య గొడవలకు కారణం అయింది.
“దర్జీకి సంబంధించిన విషయంలో హిందూ-ముస్లిం వర్గాలు ఘర్షణ పడ్డాయి, పోలీసులు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చారు” అని అమర్ ఉజాలా ఓ కథనాన్ని ప్రసారం చేసింది.
పై సాక్ష్యాల ఆధారంగా, ఆవుల అక్రమ రవాణా కారణంగా హింస చెలరేగింది అనే వాదన పూర్తిగా అబద్ధమని మేము కనుగొన్నాము.
Claim : Police took action against cow smugglers in Damoh, MP
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story