Mon Dec 23 2024 07:26:15 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: యూనియన్ బ్యాంకు నుండి ఆధార్ అప్డేట్ అంటూ వచ్చే APK ఫైల్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయకండి.
యూనియన్ బ్యాంకు నుండి ఆధార్ అప్డేట్ అంటూ
Claim :
యూనియన్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కు ఆధార్ అప్డేట్ చేయొచ్చుFact :
8799618790 నెంబర్ యూనియన్ బ్యాంక్ కు సంబంధించినది కాదు. వినియోగదారులను మోసం చేయడానికి చేసిన ప్రయత్నం.
భారతదేశంలో ఎంతో మంది సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతూ వస్తున్నారు. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు అనే తేడా లేకుండా ఎంతో మందిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. బ్యాంకు వినియోగదారుల ఫోన్ నెంబర్లను ఎలాగోలా తీసుకున్న సైబర్ క్రిమినల్స్.. మీ అకౌంట్ ఆధార్ అప్డేట్ చేయాలంటూ కాల్స్, మెసేజీలు చేస్తూ వస్తున్నారు.
అలా పలువురు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు 8799618790 నెంబర్ నుండి వాట్సాప్ లో మెసేజీలు, కాల్స్ వచ్చాయి. 'ఆధార్ అప్డేట్.. యూనియన్ బ్యాంక్' అంటూ apk ఫైల్ ను పంపిస్తున్నారు. ఆ ఫైల్ ను మీ మొబైల్స్ లో ఇన్స్టాల్ చేసుకోండి అంటూ కోరుతున్నారు. పలువురు తెలుగుపోస్ట్ ఫాలోవర్లకు ఈ నెంబర్ నుండి మెసేజీ వచ్చింది. ఇందులో ఎంతటి నిజం ఉందో తెలుసుకోవాలని మమ్మల్ని ఆశ్రయించారు.
ఆర్కైవ్ చేసిన లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఇలాంటి తెలియని నెంబర్ల నుండి వచ్చే లింక్ లను క్లిక్ చేయడం కానీ.. యాప్ లను ఇన్స్టాల్ చేసుకోవడం కానీ చేయకండి. 8799618790 నెంబర్ కు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని తెలుగుపోస్ట్ గుర్తించింది.మొదటగా మేము యూనియన్ బ్యాంక్ వెబ్ సైట్ ను ఓపెన్ చేశాం. అక్కడ బ్యాంకును కాంటాక్ట్ అవ్వడానికి, లేదా బ్యాంక్ కు సంబంధించిన ఫోన్ నెంబర్లను మేము వెతికాం. యూనియన్ బ్యాంక్ వెబ్సైట్ లో Contact Us విభాగంలో ఉన్న అధికారిక నెంబర్లు ఇవే!!
కాల్ సెంటర్ 24x7 అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ల వివరాలు:
1800 208 2244
1800 2222 43 - మోసం/వివాదాస్పద లావాదేవీలను నివేదించడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్
1800 208 2244
1800 425 1515
1800 425 3555
1800 425 2407 - ప్రీమియం ఖాతా వినియోగదారుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
+918484848458 – NRI కస్టమర్లకు కాల్ బ్యాక్ చేసే సౌకర్యం కోసం ఉన్న ఫోన్ నెంబర్లను కూడా గుర్తించాం. ఎక్కడా కూడా 8799618790 నెంబర్ లేదని గుర్తించాం.
1800 2222 43 - మోసం/వివాదాస్పద లావాదేవీలను నివేదించడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్
1800 208 2244
1800 425 1515
1800 425 3555
1800 425 2407 - ప్రీమియం ఖాతా వినియోగదారుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
+918484848458 – NRI కస్టమర్లకు కాల్ బ్యాక్ చేసే సౌకర్యం కోసం ఉన్న ఫోన్ నెంబర్లను కూడా గుర్తించాం. ఎక్కడా కూడా 8799618790 నెంబర్ లేదని గుర్తించాం.
యూనియన్ బ్యాంకు కు చెందిన 1800 2222 43 ఫోన్ నెంబర్ కు తెలుగుపోస్టు ఫ్యాక్ట్ చెక్ టీమ్ కాల్ చేసింది. కస్టమర్ కేర్ సిబ్బంది 8799618790 నెంబర్ కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని ధృవీకరించింది. యూనియన్ బ్యాంక్ నుండి ఏవైనా అప్డేట్స్ సూచనలకు సంబంధించి యూనియన్ బ్యాంకు అధికారిక వాట్సాప్ నెంబర్ 9666606060 మాత్రమే నమ్మదగినదని యూనియన్ బ్యాంక్ సిబ్బంది తెలిపింది. యూనియన్ బ్యాంక్ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా తాము పంపే APK ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ఎక్కడా సూచించలేదు.
మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో ఆధార్ ను అప్డేట్ చేయాలని అనుకుంటే: UIDAadhaar numberacount number ఫార్మాట్లో మెసేజీని టైప్ చేసి 567676కు పంపండి. మీ అభ్యర్థన ఆమోదించినట్లైతే మీకు నిర్ధారణ అయినట్లుగా సందేశం వస్తుంది. బ్యాంక్ UIDAIతో వివరాలను ధృవీకరిస్తుంది.
మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో ఆధార్ ను అప్డేట్ చేయాలని అనుకుంటే: UID
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేయాలనుకుంటే: మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ చేయండి. “లింక్ ఆధార్” విభాగాన్ని క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్‌ను టైప్ చేసి కన్ఫర్మ్ చేయండి. బ్యాంక్ మీ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తుంది. సంబంధిత నిర్ధారణను అందుకుంటారు. ఇక మరిన్ని వివరాలకు UIDAI లింక్ ను క్లిక్ చేయండి.
Claim : యూనియన్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కు ఆధార్ అప్డేట్ చేయొచ్చు
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story