Wed Jan 15 2025 17:05:08 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రముఖ యూట్యూబర్ ఖాన్ సార్ ను అరెస్టు చేయలేదని పోలీసులు ధృవీకరించారు
ఖాన్ సార్ ను అరెస్టు చేయలేదని పోలీసులు ధృవీకరించారు
Claim :
ప్రముఖ యూట్యూబర్, విద్యా వేత్త ఖాన్ సార్ ను అరెస్టు చేశారుFact :
ఖాన్ సార్ ను అరెస్టు చేయలేదని పోలీసులు ధృవీకరించారు
పాట్నాలోని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (BPSC) అభ్యర్థులు 70వ BPSC ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన నిబంధనలలో మార్పులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఆశావాదులు కొత్త విధానం అన్యాయమని, సాంప్రదాయ పద్ధతిని తిరిగి కోరుకుంటున్నట్లు తెలిపారు. కొత్త నిబంధనలు పరీక్షలో వారి పనితీరుపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
ప్రిలిమినరీ పరీక్షలో మార్పులు చేయవద్దని, పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులపై బీహార్ పోలీసులు లాఠీఛార్జి కూడా చేశారు. రాష్ట్ర రాజధాని పాట్నా బెయిలీ రోడ్లోని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట అభ్యర్థులు డిసెంబర్ 6న నిరసన చేపట్టారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి, నిరసనకు దిగిన సివిల్ సర్వీస్ అభ్యర్థులను చెదరగొట్టారు.
ఖాన్ సార్ అలియాస్ ఫైజల్ ఖాన్ వంటి విద్యావేత్తలు కూడా నిరసనలలో పాల్గొన్నారు. BPSC నుండి సరైన సమాచారం లేకపోవడంతో అభ్యర్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని వాదించారు. ఖాన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారనే వదంతులు వ్యాప్తి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. సోషల్ మీడియాలో ఆయనను అరెస్టు చేశారనే పోస్టులు కూడా వైరల్ అయ్యాయి.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని పోలీసులు ధృవీకరించారు. అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
మేము సంబంధిత పదాలతో కీవర్డ్ సెర్చ్ చేశాం.
ఖాన్ సర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ పలు మీడియా కథనాలు మాకు లభించాయి. బీహార్కు చెందిన ప్రముఖ ఉపాధ్యాయుడు, యూట్యూబర్ ఖాన్ సర్ ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలైనట్లు సమాచారం. నివేదికల ప్రకారం, అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చేరాడు. వైద్యుల పరిశీలనలో ఉన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతూ ఉందని వైద్యులు తెలిపారు. ఖాన్ సర్ ఆసుపత్రిలో చేరిన కొన్ని చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా కనిపించాయి. డీహైడ్రేషన్, అలసట వల్ల ఖాన్ సర్ కు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారని రిపబ్లిక్ వరల్డ్ నివేదించింది.
ఆజ్ తక్ కూడా ఖాన్ సర్ ఆసుపత్రిలో ఉన్నారంటూ నివేదికలను అందించింది.
కాబట్టి, ఖాన్ సర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో లేడని ధృవీకరించాం.
ఇక పోలీసులు అరెస్టు చేశారా అని తెలుసుకోడానికి ప్రయత్నించగా బీహార్ పోలీసులు వైరల్ పోస్టులను ఖండిస్తూ వివరణ ఇచ్చారని తెలుసుకున్నాము.
సచివాలయ సబ్-డివిజనల్ పోలీసు అధికారి డాక్టర్ అను కుమారి ఖాన్ సర్ ను అరెస్టు చేసారంటూ నిరాధారమైన, తప్పుదారి పట్టించే, రెచ్చగొట్టే కథనాలను ప్రసారం చేస్తున్నారని వివరించారు. ఖాన్ సర్ తన ఇష్టప్రకారం గార్దానీబాగ్ పోలీస్ స్టేషన్కు వచ్చారని కుమారి స్పష్టం చేశారు. తర్వాత పోలీసు వాహనంలో అటల్ పాత్ సమీపంలో ఆయన కోరిన ప్రాంతంలో దింపారని తెలిపారు. పోలీస్ స్టేషన్ నుండి బయటకు వెళ్లమని పదే పదే పోలీసులను అడిగామని, కానీ వేరే ప్రదేశంలో పార్క్ చేసిన తన కారు దగ్గర దింపమని అభ్యర్థించారన్నారు పోలీసులు. పోలీసు వాహనంలో అతని కారు పార్క్ చేసిన ప్రదేశానికి తీసుకువెళ్ళామని పోలీసులు తెలిపారు.
ఖాన్ సర్ అరెస్ట్ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు సోషల్ మీడియా హ్యాండిల్ 'ఖాన్ గ్లోబల్ స్టడీస్'పై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు.
ndtv, హిందుస్థాన్ టైమ్స్ లాంటి మీడియా సంస్థలు కూడా ఖాన్ సర్ ను అరెస్టు చేయలేదని ధృవీకరించాయి.
కాబట్టి, ఖాన్ సర్ అరెస్టు అయ్యారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : ప్రముఖ యూట్యూబర్, విద్యా వేత్త ఖాన్ సార్ ను అరెస్టు చేశారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Unknown
Claim Source : Social Media
Fact Check : False
Next Story