ఫ్యాక్ట్ చెక్: హిందూపురం మున్సిపాలిటీలో ఆటో డ్రైవర్ల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు
హిందూపురం మున్సిపాలిటీలో ఒక్కో ఆటో నుండి 70 రూపాయలు

Claim :
హిందూపురం మున్సిపాలిటీలో ఒక్కో ఆటో నుండి 70 రూపాయలు వసూలు చేస్తున్నారుFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2025లో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. వైసీపీ నుంచి గెలిచి చైర్పర్సన్ అయిన ఇంద్రజ.. రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో చైర్మన్ పీఠం ఖాళీ అయింది. ఆ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీకి 17 స్థానాలు ఉంటే అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీకే మున్సిపల్ ఛైర్మన్ సీటు దక్కింది.